మా బడికి దూరం – విద్యార్థుల నిరసన

Distance to our school students' protest

Distance to our school students' protest

  • మా బడికి దూరం – విద్యార్థుల నిరసన
  • మా చదువులను దూరం చేయొద్దు
  • నేటి బాలలే రేపటి పౌరులు
  • నవసమాజ నిర్మాతలు
  • రేపటి భావిభారత పౌరులు.. అనే ప్రసంగాలు వేదికలకే పరిమితమా ..

నంద్యాల జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని..ముష్టపల్లె, సిద్ధపల్లె, పెద్దనంతపురం , డైరీ కొట్టాల గ్రామాల నుంచి సుమారు 100 మంది విద్యార్థులు ఆత్మకూరులో ఉన్న వివిధ పాఠశాలల్లో చదువుకోవడానికి.. సైకిళ్లపై , ఆటోలపై , మరి కొందరు నడుచుకుంటూ.. వెళ్తుంటారు.

ఆత్మకూరు కి వెళ్లే దారిలో .. అడ్డంగా నేషనల్ హైవే (340’C ) వెళ్తూ.. మా దారిని మూసివేస్తుండ డంతో.. మా బడికి వెల్లడానికి , తిరిగి రావడానికి సుమారు 5 కిలో మీటర్లు దూరం పెరుగుందని.. విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈజ్ మెంట్ 1882 యాక్ట్ ను దుర్వినియోగం చేస్తూ.. పూర్వం నుంచి నడుస్తున్న దారిని మూసి వేసి రాజ్యాంగం ఇచ్చిన హక్కును మాకు దూరం చేయొద్దని నేషనల్ హైవే( 340’C ) పై విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ..నేటి బాలలే రేపటి పౌరులు , నవసమాజ నిర్మాతలు , వారే రేపటి భావిభారత పౌరులని వేదికలపై ప్రసంగాలు చేసే అధికారులు, నాయకులు మాపై దయవుంచి మా దారిని యధావిధిగా వుండేలా చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు..

నేషనల్ హైవే వారు ఫ్లైఓవర్ నిర్మించుకొని మాకు అండర్ పాస్ ద్వారా మా బడికి బంగారు బాట వేయాలని విద్యార్థులు నాయకులను , అధికారులను వేడుకున్నారు..

ఈ కార్యక్రమంలో.. సిద్ధపల్లె గ్రామానికి చెందిన లక్ష్మణ్ యాదవ్ , జస్వంత్ , M ప్రసాద్ , వెంకట రాకేష్ , ముష్టపల్లె గ్రామానికి చెందిన నందకిషోర్ , బాలాజీ , పెద్ద అనంతాపురం గ్రామానికి చెందిన.. వెంకట రాకేష్ లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top