రాయల సీమ గర్జన కాదు ప్రజా మోసపూరిత గర్జన….మాజీ ఎమ్మెల్యే బిసి జనార్దన్ రెడ్డి…
ప్రజల ను మోసం చేసేందుకు ఈ గర్జన….
మాజీ ఎమ్మెల్యే బిసి జనార్దన్ రెడ్డి…
వైసిపి నాయకులు నిర్వహిస్తున్నది రాయలసీమ సింహ గర్జన కాదు ప్రజా మోస పూరిత గర్జన అని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బిసి జనార్దన్ రెడ్డి ఆరోపించారు.
తెలుగు దేశం పార్టీకి వస్తున్న ప్రజల ఆదరణ చూసి ఈ గర్జన కార్య క్రమాన్ని నిర్వహిస్తున్నారని అన్నారు.
ప్రజలందరూ రాష్ట్రం లో ఒకే రాజధాని అంటూ ముక్త కంఠంతో చెబుతున్నారని,
మీరు మాత్రం అధికారాన్ని అడ్డం పెట్టుకొని విద్యార్థులను, మహిళా సంఘాలను, ఉద్యోగులను, తదితరులను గర్జనకు రావాలని బెదిరి స్తున్నారని,
వైసీపీ ప్రభుత్వం లో వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజలను భయందో.. ళనకు గురి చేస్తున్నారని తెలిపారు.
వైసిపి పార్టీ ఉనికిని కాపాడు కోవడానికి ఈ గర్జన చేస్తున్నారని, ఆనాడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధాని అని చెప్పి..
ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత సిఎం జగన్ మోహన్ రెడ్డి గారు అమరావతి ప్రజలను ఆంద్ర ప్రదేశ్ ప్రజలను నిలువునా .. మోసం చేశాడని
బీసీ జనార్ధన్ రెడ్డి మండి పడ్డారు. మాట తిప్పను మడమ తిప్పను అన్న సిఎం జగన్ జగన్ మాట తప్పలేదా అంటూ మండిపడ్డారు.
ఇప్పుడు వికేంద్రీకరణ అనే పేరుతో ఇప్పుడు మాట తప్పుతున్నాడని, తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమ పథకాలకు పేర్లు మార్చి ఈరోజు..
ఆర్భాటంగా ప్రకటనల కోసం ప్రజల దనాన్ని దుర్వినియోగం చేస్తున్న నాయకుడు ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు.
Also Read..నల్లమల అడవులకు రానున్న గజరాజులు
కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను వైసిపి ప్రభుత్వం పక్కదారి పట్టించి గ్రామాల అభివృద్ధి కుంటు పడేటట్లు చేస్తున్నారని అన్నారు…
వైసిపి నాయకులు అధికారాన్ని అడ్డపెట్టుకుని బలవంతపు గర్జనలు నిర్వహిస్తున్నారని విమర్శించారు.
అసెంబ్లీ సాక్షిగా నాడు అమరావతి ని రాజథాని గా అంగీకరించిన జగన్ మోహన్ రెడ్డి ఇపుడు మాట తప్పి మడమ ఎందుకు త్రిప్పితున్నారని అన్నారు.
ఎన్నికల్లో 25 ఎంపి స్థానాలు గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ప్రగల్భాలు పలికిన జగన్ ప్రస్తుతం తానే కేంద్రం వద్ద..
మెడలు వంచి సాగిల పడుతూ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు.
రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తానని జగన్ మోహన్ రెడ్డి మోసం చేశారనీ, అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష పార్టీ నాయకుల పైన కార్య కర్తల పైన అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు,
ఎప్పుడు ఏ క్షణాన్ని ఎన్నికలు జరిగినా కూడా రాష్ట్రంలో టిడిపి ప్రభంజనం ఉప్పెనలాగా ఎగిసిపడుతుందని , టిడిపి జెండా రెప రెప లాడిస్తూ చంద్ర బాబు నాయుడు మళ్ళీ ముఖ్య మంత్రి కావడం తధ్యమని బీసీ జనార్దన్ రెడ్డి జోస్యం చెప్పారు.