మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఆధ్వర్యంలో G.O.NO.1 రద్దు చేయాలని ఆలూరులో ధర్నా నిర్వహించారు
కర్నూలు జిల్లా ఆలూరులో మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఆధ్వర్యంలో G.O.NO.1 రద్దు చేయాలని ధర్నా నిర్వహించారు. రాత్రికి రాత్రి పాస్ చేసిన G.O.NO. 1 జి.ఓ ను రద్దు చేయాలని అంబెడ్కర్ సర్కిల్ లో మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. జి.ఓ. కాఫీలు ను తగలబెట్టి ,నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ మీడియా తో మాట్లాడుతూ జి.ఓ నెంబర్ 1 జి.ఓ ప్రతిపక్షాలు గోంతునోక్కడమే అని ఎద్దేవా చేసారు. టీడీపీ జాతీయ ఆధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన నియోజకవర్గమైన కుప్పంలో పర్యటన ను పోలీసులు అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గం లో పర్యటించడం నేరమా అని, ప్రశ్నించారు. ఈ జి.ఓ ను వెంటనే రధ్ధు చేయాలని డిమాండ్ చేసారు. లేనిపక్షంలో బారీ మూల్యం చెలించక తప్పదని హెచ్చరించారు.