పులిగోరు – tigerclaw

tigerclaw-పులిగోరు

tigerclaw-పులిగోరు

నంద్యాల జిల్లా, ఆత్మకూరు అటవి డివిజన్ పరిధిలో పులిగోరు వ్యవహారం కలకలం రేపింది.కొత్తపల్లి మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులను అటవీశాఖ ఆ ధికారులు అదుపులోకి తీసుకుని
వారి వద్ద ఉన్న పులి గోరును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ఆత్మకూరు అటవి డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ విజ్ఞేశ్ అప్పావ్ స్పష్టత ని చ్చారు. ఇద్దరి నిందితుల నుంచి ఒక పులిగోరు లభించిందని అయితే ఎటువంటి పులివేట (హంటింగ్ ) జరగలేదని తెలిపారు. వృద్ధాప్యం కారణంగా పెద్దపులి సహజ మరణం చెంది ఉండొచ్చని వివరించారు. మృతి చెందిన పెద్దపులి నుంచి సేకరించిన గోరు సుమారు ఐదేళ్ల కిందట నుంచి నిందితుల వద్ద ఉందని వారిని పూర్తిస్థాయిలో విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. డిప్యూటీ డైరెక్టర్ విజ్ఞేశ్ అప్పావ్ తెలిపారు. అదుపులో ఉన్న ఇద్దరుఅనుమానితులను విచారణ తర్వాత న్యాయస్థానంలో హాజరు పరుస్తామని తెలిపారు. స్వాధీనం చేసుకున్న పులి గోరును ల్యాబ్‌కు పంపామని, రిపోర్ట్ వచ్చిన తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీడీ విజ్ఞేశ్ అప్పావ్ అన్నారు. నల్లమలలో అనుమానాస్పద వ్యక్తులు సంచరించినట్లయితే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పులిగోరు లభ్యంతో పర్యావరణ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు.

Read More https://politicalhunter.com/wild-boars-die/

Read More https://www.facebook.com/share/p/1HU1xLBnHf/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top