పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితను హోం మంత్రి పదవి వరించింది .. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి ఈ మంత్రివర్గంలో పదవి దక్కించుకున్న ఏకైక ఎమ్మెల్యేగా వంగలపూడి అనిత నిలిచింది.. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎంతో మంది సీనియర్ నేతలు ఉన్నప్పటికీ.. పార్టీ పట్ల ఆమె చూపిన విధేయతకు మంత్రి పదవిని కేటాయించిన చంద్రబాబు నాయుడు .. ఏకంగా హోం శాఖ నే కేటాయిచండం గమనార్హం. వంగలపూడి అనిత ఈ 2024 ఎన్నికల్లో పాయకరావుపేట అసెంబ్లీ నుంచి 43,727 ఓట్ల మెజార్టీతో గెలిచి చరిత్ర సృష్టించారు.
వంగలపూడి అనిత .. ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చారు వంగలపూడి అనిత. 2014కు ముందు టీడీపీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2014 ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ నుండి పోటీచేసి ఆమె గెచారు 2019 ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి కొవ్వూరుకు పంపింది. అయితే 2019 ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు . ఓడిపోయినకూడా.. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేస్తూ అధికార పక్షం పై అవాకులు చవాకులు పేలుస్తూ .. ప్రభుత్వాన్ని ఎండగట్టారు.