కర్నూలు మార్కెట్ యార్డ్ కు కాటసాని రామ్ భూపాల్ రెడ్డి

Katasani Ram Bhupal Reddy to Kurnool Market Yard

Katasani Ram Bhupal Reddy to Kurnool Market Yard

“కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్” నందు “మిర్చి” రైతులు పడుతున్న కష్టాలు గుర్తించి మార్కెట్ ను సందర్శించి రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్న వైఎస్ఆర్ సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రామ్ భూపాల్ రెడ్డి గారు..

కాటసాని రామ్ భూపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ మా ప్రభుత్వంలో ప్రతి పంట మేము కొనుగోలు చేశాం ఈ ప్రభుత్వం లో రైతులు ఎక్కువగా కష్టాలు పడుతున్నారు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో క్వింటా 25 వేల రూపాయలు కొనుగోలు చేసాం. సెకండ్ గ్రేడ్ ఉన్న వాటిని 16 వేల రూపాయల కొనుగోలు చేశాం.. ఈ కూటమి ప్రభుత్వంలో మంచి టాప్ క్వాలిటీ ఉన్న “మిర్చి” పంటను 13 మరియు 14 వేల రూపాయలకు కొనుగోలు చేస్తున్న పరిస్థితి.. వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేసింది…..

రైతు భరోసా కేంద్రంలో రైతులకు కావాల్సిన మందులు కావాలంటే రైతు భరోసా కేంద్రంలోని సరఫరా చేసేవాళ్లం కానీ ప్రభుత్వం రైతు భరోసా లేదు ఇన్పుట్ సబ్సిడీ పోయింది..చివరికి పండించిన పంట కూడా రైతు అమ్ముకొని స్థితిలో రైతులు ఉన్నారు.. వైసిపి గవర్నమెంట్ లో ఎక్కడైనా రైతులు పంటను అమ్ముకోలేకపోతున్నారు అటువంటి వాళ్ళు డైరెక్ట్ గా మార్కెట్ తో మాట్లాడి న్యాయం చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిదని తెలిపారు…

ఎలక్షన్ల ముందర మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు రైతుల గురించి ఆలోచన లేదు ఈ ప్రభుత్వంలో రైతులు ఎక్కువగా కష్టపడుతున్నారు. ఖర్చులు పెరిగిపోయి పండించిన పంట గిట్టుబాటు ధర లేకపోతే చాలామంది రైతులు అన్యాయం అయిపోతారు..అందుకు ఖచ్చితంగా రైతులకు ఖర్చుతో బట్టి గిట్టుబాటు ధర కల్పించాల్సిన అవసరం ఉంది…ఈ తెలుగుదేశం నాయకులకు వీటిపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు.. వారు అక్రమసంపాదనలపై నిమగ్నమైపోయారు..

“మిర్చి” పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి అని ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారిని డిమాండ్ చేశారు… అవసరమైతే రైతులతో కలిసి న్యాయం కోసం పోరాటం చేస్తామని నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రామ్ భూపాల్ రెడ్డి గారు తెలిపారు…..

ఈ కార్యక్రమంలో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, కర్నూలు జిల్లా అనుబంధం విభాగాల అధ్యక్షులు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు..

#YSJaganForFarmers#MirchiFarmers

#CBNFailedCM#SadistChandraBabu#MosagaduBabu#Kurnool#Katasani#YSJagan#కాటసాని#YSRCP#KatasaniRambhupalReddy

#KatasaniShivaNarasimhaReddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top