రాష్ట్రంలో ఎక్కువ మంది రైతులు వరి పంట మీద ఆధారపడి ఉన్నారు. తగినంత మంది కూలీలు లేకపోవడం వారి యొక్క రోజు ఛార్జీలు పెరగడం వలన రైతు యొక్క పెట్టుబడి చాలా పెరిగిపోతుంది. సరైన సమయంలో నాటక పోవడం వలన కూడా తగిన ఉత్పాదక పొందలేకపోతున్నాం. ఈ సమస్యలను అధిగమించడం కొరకు వరినారు నాటు యంత్రంను అభివృద్ధి చేయడం జరిగింది. ఇవి 3 రకాలుగా ఉన్నాయి. స్వయంచాలక వరినారు నాటు యంత్రం, ట్రాక్టర్తో నడిపే వరినారు నాటు యంత్రం, మానవుడు నడిపే వరినారు నాటు యంత్రం. ఇవి 2, 4, 6, 8 వరుసలలో ఒకేసారి వరిని నాటుతాయి. ఈ పద్ధతిలో వరి నాటడానికి నారును ప్రత్యేక పద్దతిలో తయారు చేసుకోవాలి.
దీనిలో ముఖ్యంగా ప్రైమ్ మూవర్, ట్రాన్స్ మిషన్, ఇంజన్, ప్లోట్, లగ్డ్ వీల్స్, సీడ్లింగ్ ట్రే, సీడ్లింగ్ ట్రే షిఫ్టర్, పికప్ ఫోర్క్ మరియు పికప్ ఫోర్క్ క్లీనర్ ఉంటాయి. ఈ యంత్రంలో వరుసకు వరుసకు మధ్య దూరంను మరియు నాటు లోతును మార్చుకోవచ్చు. మొలకలు పాడవకుండా పొలం మొత్తం ఒకే పద్దతిలో నాటుతుంది. స్వయంచాలక వరినారు నాటు యంత్రం స్వతహాగా నాటులోతును సవరించుకుంటుంది. దీనిలో ప్రత్యేకమైన క్లచ్ మెకానిజం కలిగి ఉండడం వలన రాళ్ళపై నుండి వెళ్ళినప్పుడు యంత్రం విచ్చినం కాకుండా స్వతహాగా సవరించుకుంటుంది. స్వయంచాలక వరినాటు యంత్రం 12 అశ్వశక్తి గల పెట్రోలుతో నడిచే ఇంజను ఉంటుంది. సాళ్ళమధ్య దూరం 300మి.మీ.లు గాను కుదురుకి కుదురుకి మధ్య గల దూరం, 5 రకాల సర్దుబాటులు (120-220 మి.మీ. వరకు లోతు 15-45 మిమీ. వరకు) మార్చుకోవచ్చు. దీనిని నియంత్రించేందుకు పవర్ స్టీరింగ్ కలిగి ఉంటుంది.
Also Read ఆరోగ్యానిచ్చే ఆహారపు పంటగా జొన్న
ఇది 6 వరుసలలో ఒకేసారి నాటుతుంది. నారుమడిని సాధారణ పద్ధతిలో కాకుండా నర్సరీలో ట్రేలలో ప్రత్యేక పద్ధతిలో పెంచవలసి ఉంటుంది. మట్టితో పాటు వరినారును ప్లాస్టిక్ కవరుపై మడి తయారు చేసుకోవాలి. వరినాటును పెంచడం కొరకు 150 సెం.మీ. వెడల్పు, 20 మీ. పొడవుగల 50-60 మైక్రాన్ల మందంగల 600 గ్రా. పాలిథీన్ షీట్ తీసుకోవాలి. ఇది ఒక ఎకరానికి అవసరమైన 80 నారు మ్యాట్లు తయారు చేయవచ్చు. ఈ పద్ధతిలో వరి నాటే ప్రదేశంను 1 నుండి 2 రోజుల ముందుగా దమ్ము చేసుకోవాలి. 24 గంటల ముందు నానబెట్టిన వడ్లను ట్రేలలో పెంచవల్సినవసరం ఉంది. ఈ పద్ధతిలో వరి నాటడానికి ముగ్గురు వ్యక్తులు ఐదు ఎకరాలను ఒక్క రోజులో వెయ్యగలరు. సాధారణ పద్ధతిలో 25 నుండి 30 మంది ఒక రోజుకు ఒక ఎకరం మాత్రమే నాటు వేయగలరు.
వరినాటు యంత్రం ద్వారా 80,000 నుండి 1,20,000 మొక్కలు నాటవచ్చు
ఖర్చు ఎకరానికి 1500 రూపాయలు అనగా 60% ఆదా అవుతుంది. కూలీల అవసరాన్ని 75-80% వరకు తగ్గిస్తుంది. మాన్యువల్ మరియు స్వీయచోధక వరినాటు యంత్రం ఖర్చును 45-50% వరకు తగ్గిస్తుంది. భారతదేశంలో సగటు వరి దిగుబడి హెక్టారుకు 2.09 టన్నులు మాత్రమే. జపాన్లో హెక్టార్కు 6.58 టన్నులు మరియు ప్రపంచ సగటు 3.91 టన్నులు/హెక్టారుకు. భారతదేశంలో 70% కంటే ఎక్కువ మంది రైతులు సన్నకారు, చిన్న రైతులు. అందువల్ల అభివృద్ధి చెందుతున్న దేశాలలో సన్నకారు, చిన్న రైతులలో సాంకేతికత చాలా ముఖ్యమైనది. ఒక ఎకరానికి సిఫార్సు చేయబడిన మొక్కలు 80,000 మొక్కలు మరియు వరినాటు యంత్రం ద్వారా 80,000 నుండి 1,20,000 మొక్కలు నాటవచ్చు.
Also Read అత్తగారింటికి పోవడానికి ఆర్టీసీ బస్సు చోరీ..
కల్లూరి ప్రవీణ్, Ph.D. విద్యార్థి, ఫామ్ మెషినరీ అండ్ పవర్ ఇంజనీర్, జెన్కవివి, జబల్పూర్, మధ్యప్రదేశ్, ఫోన్: 9542424278