శ్రీశైలం న విస్తృత స్థాయి సమావేశం – MLA బుడ్డా రాజశేఖర్ రెడ్డి

Tdp samavesham atmakur MLA Budda

Tdp samavesham atmakur MLA Budda

శ్రీశైలం నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి.

టిడిపి పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలు.

ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోనికి తీసుకువెళ్లాలి.

ఎన్డీఏ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట.

షెడ్యూల్డ్ ప్రకారం ఏప్రిల్ 22 తేదీ లోపల గ్రామ కమిటీలు పూర్తి చేయాలని సూచించిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి.

క్లస్టర్, యూనిట్, మండల అనుబంధ కమిటీలు పట్టణ వార్డు కమిటీలు ఏప్రిల్ 30వ. తేదీ లోపు పూర్తి చేయాలి.

నియోజకవర్గ కమిటీలు వచ్చేనెల 7 తేదీ లోపల పూర్తి చేయాలి.

మే నెల 27, 28 తేదీల్లో జరిగే టిడిపి మహానాడు కార్యక్రమానికి పార్టీ ఆదేశాల మేరకు సిద్ధం కావాలని తెలియజేసిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి.

వక్ఫ్ బోర్డు చట్టం జోలికి వచ్చే ప్రసక్తే లేదు. అసత్య ప్రచారాలు నమ్మవద్దు.

ఆత్మకూరు పట్టణంలోని స్థానిక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ప్రాంగణంలో శ్రీశైలం నియోజకవర్గం టిడిపి విస్తృత స్థాయి సమావేశం శ్రీశైల నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. శ్రీశైలం నియోజకవర్గం అభివృద్ధి ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా సాధ్యమని పేర్కొన్నారు. శ్రీశైలం నియోజకవర్గం టిడిపి సభ్యత్వాలు చేయడంలో రాష్ట్రంలో టాప్ 10 లో ఉందని పేర్కొన్నారు. కార్యకర్తల, టిడిపి నాయకుల కృషి ప్రశంసనీయమని అన్నారు. ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోనికి విస్తృతంగా తీసుకువెళ్లే బాధ్యత గ్రామ, మండల, వార్డు అనుబంధ సంఘాల కమిటీల సభ్యులు తీసుకువెళ్లాలని పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసిందని అన్నారు. గ్రామస్థాయి కమిటీలు ఏప్రిల్ 22 తేదీలోపు పూర్తి చేయాలని నాయకులకు సూచించారు. మండల వార్డు అనుబంధ కమిటీలు ఏప్రిల్ 30 తేదీ లోపల పూర్తి చేయాలని అన్నారు. నియోజకవర్గ స్థాయి కమిటీలు మే 7 తేదీలోపు పూర్తి చేయాలని నాయకులు అహర్నిశలు కృషి చేయాలని పేర్కొన్నారు. కడపలో నిర్వహించబోయే టిడిపి మహానాడు కార్యక్రమానికి అధిష్టానం ఆదేశాల మేరకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియోజకవర్గ అభివృద్ధికి 25 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని పేర్కొన్నారు. సిద్దాపురం చెరువు అభివృద్ధి చేశామని పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. బూత్ కన్వీనర్లు పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలు బలంగా ఉంటేనే మేము బలంగా ఉంటామని అన్నారు. గత వైసిపి ప్రభుత్వంలో అభివృద్ధిస్తుందని ప్రజలు గమనించాలని పేర్కొన్నారు. పేదలు ఇల్లు నిర్మించుకోవడం కోసం మూడు లక్షల రూపాయలు ఇస్తుందని, ఎస్సీ ఎస్టీలకు అదనంగా 30 వేల రూపాయలు అందజేస్తారని అన్నారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో సిసి రోడ్లను నిర్మించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కెసి కెనాల్ చైర్మన్ రామలింగారెడ్డి, సీనియర్ అడ్వకేట్ గోవింద్ రెడ్డి, వి ఆర్ ఎస్ పి ప్రాజెక్ట్ చైర్మన్ మల్లికార్జున రెడ్డి, టిడిపి మండల పట్టణ అధ్యక్షులు వేణుగోపాల్, శివప్రసాద్ రెడ్డి నియోజకవర్గంలోని వివిధ మండలాల టిడిపి నాయకులు కార్యకర్తలు బూత్ కన్వీనర్లు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top