గుడ్ టచ్ బాడ్ టచ్

Good touch bad touch

Good touch bad touch

నంద్యాల జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాఠశాలలు మరియు కళాశాలలో అవగాహన కార్యక్రమాల నిర్వహణ…

గుడ్ టచ్ బాడ్ టచ్, మహిళా సంబంధిత నేరాలు, సైబర్ క్రైమ్, డ్రగ్స్, లోన్ యాప్ మోసాలు, రహదారి భద్రతా నియమాలపై పాఠశాల విద్యార్థులకు పోలీసుల అవగాహన.

నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా IPS గారి ఆదేశాలమేరకు నంద్యాల జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధులలో ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలు మరియు కళాశాలలో సంబంధిత పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో ప్రస్తుతం సమాజంలో జరిగే నేరాలపై విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.

ఈ సంధర్భంగా విద్యార్థులకు డ్రగ్స్, మహిళలపై జరిగే అఘాయిత్యాలు, బాలికల సంరక్షణ చట్టం (ఫోక్సో చట్టం), సైబర్ క్రైమ్, రహదారి భద్రత నియమాలు మొదలగు అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలు, మహిళలు, యువత ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి వివరించారు. బాలికలు మహిళలు ఏదైనా ఆపద సమయంలో డయల్ 100/112 కు ఫోన్ చేసి పోలీసులు వారి సహాయాన్ని తక్షణమే పొందాలని తెలియజేశారు.

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని,ఒక్కసారి అలవాటు పడితే అవి మీ జీవితాన్ని మరియు మీ చుట్టూ ఉన్న వారి జీవితాలను నాశనం చేస్తాయి. మీకు ఎవరికైనా మాదకద్రవ్యాల సంబంధిత కార్యకలాపాల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మరియు మాదక ద్రవ్యాలు లేని సమాజ నిర్మాణంలో మీరు కూడా భాగస్వామ్యం కావాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే లింక్‌లను క్లిక్ చెయ్యవద్దు మరియు వ్యక్తిగత సమాచారాన్ని లేదా OTP లను ఎవరితోనూ పంచుకోకూడదు. ఎవరైనా సైబర్ నేరగాళ్ల చేతిలో పడి మోసపోతే వెంటనే 1930 నంబర్ కు ఫోన్ చేసి సహాయం మరియు సైబర్ క్రైమ్, ఫేక్ లోన్ యాప్స్ మోసాల గురించి వివరించి, వాటిని ఎలా ఎదుర్కోవాలో ముందస్తు జాగ్రత్తలను వివరించారు.

ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని లైసెన్స్ లేకుండా వాహనాలు నడపరాదు మరియు ఎవరైన మైనర్ లు వాహనం నడిపితే వాహనాన్ని సీజ్ చేసి వారి తల్లిదండ్రుల పై కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదని, రహదారిపై మీ కళ్ళ ముందు ఏదైనా అనుకోని సంఘటన జరిగితే వెంటనే డయల్ 100/112/108 ద్వారా సమాచారం అందించాలి. ప్రతి ఒక్కరూ బాధ్యత గల పౌరులుగా రహదారి భద్రత నియమాలను పాటించి మెరుగైన సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

క్రమశిక్షణతో బాధ్యతగా చదువుకొని మీ యొక్క తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి.విద్యార్థి దశ నుండి మంచి క్రమశిక్షణ కలిగి, చదువుకున్నటువంటి వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఈ అవగాహన కార్యక్రమంలో తెలియజేశారు.

జిల్లా పోలీసు కార్యలయం,నంద్యాల

Also Read అత్తగారింటికి పోవడానికి ఆర్టీసీ బస్సు చోరీ..

also read జూనియర్ ఎన్ టి ఆర్ బామ్మర్ది నార్నే నితిన్ ఎంగేజ్మెంట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top