కడప జిల్లాలో ఉక్కుపరిశ్రమ నిర్మించాలి
పిఆర్ఎస్ వైఎఫ్ రాష్ట్ర కన్వీనర్ కన్నెలూరు శంకర్ డిమాండ్
పిఆర్ఎస్ వైఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి గారికి వినతి పత్రం
కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను నిర్మించి, నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించి వలసలను కరువును నివారించాలని నూతన ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ,
మంగళవారం నాడు స్థానిక జిల్లా కలెక్టరేట్ చాంబర్లో జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ గారికి ప్రగతిశీల రెవల్యూషనరీ
విద్యార్థి యువజన సంఘం(పిఆర్ఎస్ వైఎఫ్) ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేయడం జరిగింది..
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ స్పందిస్తూ ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి జిల్లాలో
ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి కృషిచేసి నిరుద్యోగ,యువతీ యువకులకు ఉపాధి కల్పనకు తోడ్పాటు ఇస్తామని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా పిఆర్ఎస్ వైఎఫ్ రాష్ట్ర కన్వీనర్ కన్నెలూరు శంకర్ మాట్లాడుతూ……
రాయలసీమ ప్రాంతం కరువు, వలసలు,రైతుల ఆత్మహత్యలకు నిలయం. ఇలాంటి రాయలసీమ ప్రాంతంలోని కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను స్థాపించి,ఈ సమస్యలన్నింటిని పరిష్కరించాలని
Also Read..YABER PRO V9 WiFi 6 Bluetooth Projector
గత కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో సెక్షన్ 8(II) పొందుపరచి పార్లమెంటు సాక్షిగా ప్రకటించడం జరిగింది.
2014 ఎన్నికల ప్రచారం సందర్భంగా మేము కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సర కాలంలో కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను పూర్తి చేసి నిరుద్యోగ యువతకు
ఉపాధి కల్పిస్తామని నేటి మన దేశ ప్రధాని నరేంద్ర మోది గారు తిరుపతిలో వెంకన్న సాక్షిగా హామీ ఇవ్వడం జరిగినది.
కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోది సర్కార్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తరుణంలో కడప జిల్లాలోని
అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి, యువజన, ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో జాయింట్ యాక్షన్గా పలు రకాల ఉద్యమాలు, ఆందోళనలు, రిలే నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు
చేయడం జరిగిందన్నారు.ఈ విశాల ఉక్కు ఉద్యమాల వత్తిడితో గతంలో (2018)లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేయడం జరిగిందని,
ఎన్నికల తరువాత ప్రభుత్వం మారడం జరిగింది. అలాగే గతంలో (2018) ప్రతిపక్షంలో వున్న వై.యస్. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర, ఎన్నికల ప్రచార సందర్భంలో..
మేము అధికారంలోకి వచ్చిన తరువాత ఆరు నెలల లోపుశంకుస్థాపన చేసి సంవత్సరం కాలంలో పూర్తి చేస్తామని కడప జిల్లా ప్రజానీకానికి హామీ ఇచ్చారని,
2019 లో అధికారంలోకి వచ్చిన తరువాత వై.యస్. జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపనకే
పరిమితమై ఉక్కు పరిశ్రమ పనులను ప్రారంభించకుండా, నిధులను కేటాయించకుండా జగన్ సర్కార్ 5 సంవత్సరాలు పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించి జిల్లా ప్రజానీకాన్ని నిరుద్యోగ యువతీ,
యువకులను ఘోరంగా మోసం చేసిందని ఆయన ఆవేదనను వ్యక్తం చేశారు.
వేల మంది నిరుద్యోగులకు ఉపాధి దొరికే అవకాశం
ఈ ఉక్కు పరిశ్రమ నిర్మాణం పూర్తి అయితే ప్రత్యక్షంగా 10000 వేలు మంది నిరుద్యోగులకు పరోక్షంగా 25000 వేలు మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని,అలాగే
ఈ పరిశ్రమకు అనుబంధంగా మరీ కొన్ని పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుంది, వీటి చుట్టూ రవాణా వ్యవస్థ (లారీలు, బస్సులు, ట్యాక్సీలు, ఆటోలు మొదలగునవి)
Also Read..నల్లమల అడవులకు రానున్న గజరాజులు
హోటల్స్ , లాడ్జీలు, టూరిజం, కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలు, వివిధ కార్పొరేట్, ప్రైవేట్ సంస్థలు బాగా అభివృద్ధి చెంది, వీటి ద్వారా కూడా కొన్ని వేల మంది
నిరుద్యోగులకు..ఉపాధి దొరికే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు,కాబట్టి ఇప్పటికైనా నూతనంగా ఏర్పడిన
ఎన్.డి.ఎ. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి వెంటనే ఉక్కు పరిశ్రమను నిర్మించి,నిరుద్యోగ యువతీ యువకుల వలసలను నివారించి
వారికి ఉద్యోగ ఉపాధి కల్పన అవకాశం కల్పించి, కడప జిల్లా ప్రజల చిరకాల కళ స్వప్నాన్ని నెరవేర్చాలని, జిల్లా ప్రజల నిరుద్యోగ యువతీ, యువకుల ఆకాంక్షలకు అనుగుణంగా ..
ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి నిధులు కేటాయించి, ఉక్కు పరిశ్రమను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రగతిశీల రెవల్యూషనరీ విద్యార్థి యువజన సంఘం (పిఆర్ఎస్ వైఎఫ్) గా
ఆయన విజ్ఞప్తి చేశారు.. ఈ కార్యక్రమంలో పిఆర్ఎస్ వైఎఫ్ జిల్లా కన్వీనర్ ఓ.నాగేంద్రబాబు, నగర నాయకులు విజయ్,రవితేజ, లుక్మాన్, పాల్గొన్నారు..