వాల్మీకుల ఎస్టి రిజర్వేషన్ పునరుద్ధరణ కు చట్టబద్దత కోసం పోరాటం:
– వాల్మీకుల ఎస్టి రిజర్వేషన్ పునరుద్ధరణ కు చట్టబద్దత వలనే వాల్మీకులకు న్యాయం.
– ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించుచున్న రాష్ట్ర స్థాయి వర్క్ షాప్,చర్చా వేదిక సమావేశం ను జయప్రదం చేయాలి.
– ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం నందికొట్కూరు నియోజకవర్గం కార్యవర్గ సభ్యులు గుజ్జుల గౌరీశ్వర నాయుడు,పసుల శ్రీనివాసులు నాయుడు, నల్లబోతుల రాజశేఖర్, మండ్ల మహేష్,ఎమ్.బి. రాంబాబు నాయుడు, నల్లబోతుల మద్దిలేటి, దర్గయ్య, పుల్లయ్య,బోయ శ్రీకాంత్ ల పిలుపు.
వాల్మీకుల ఎస్టి రిజర్వేషన్ పునరుద్ధరణ కు చట్టబద్ధత సాధించుకునేంత వరకు వాల్మీకులు ఉద్యమించాల్సిన అవసరముందని,వాల్మీకుల ఎస్టి రిజర్వేషన్ పునరుద్ధరణ కు చట్టబద్దత తోనే వాల్మీకులకు న్యాయం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం నందికొట్కూరు నియోజకవర్గం కార్యవర్గ సభ్యులు అన్నారు.శుక్రవారం పట్టణంలోని నందికొట్కూరు నియోజకవర్గం అధ్యక్షులు గుజ్జుల గౌరీశ్వర నాయుడు స్వగృహంలో 17 నవంబర్ 2024 ఆదివారం నాడు ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలోని దేశాయ్ ఫంక్షన్ హాల్, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నిర్వహించే రాష్ట్రస్థాయి వర్క్ షాప్ చర్చా వేదిక సమావేశం సన్నాహాకాల గురించి సమావేశం ఏర్పాటు చేశారు.
also read జూనియర్ ఎన్ టి ఆర్ బామ్మర్ది నార్నే నితిన్ ఎంగేజ్మెంట్
ఈ కార్యక్రమానికి నందికొట్కూరు నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం కార్యవర్గ సభ్యులు హాజరై మాట్లాడారు.ఎస్టి రిజర్వేషన్ పునరుద్ధరణ కోసం ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం దశాబ్దాలుగా పోరాటం చేస్తుందన్నారు. వాల్మీకుల ఎస్టి రిజర్వేషన్ పునరుద్ధరణ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. ఎస్టి రిజర్వేషన్ లేని సమయంలో వాల్మీకులు ఉద్యోగాలు సాధించారని గుర్తుచేశారు. • ఎస్టి రిజర్వేషన్ పునరుద్ధరణ ను చేయడకపోవడంతో *వాల్మీకులు వెనుకబాటుకు గురయ్యారని,మళ్లీ ఎస్టి రిజర్వేషన్ పునరుద్ధరణ చేస్తేనే వాల్మీకులకు న్యాయం జరుగుతుందన్నారు. ఇందుకోసం కూటమి పార్టీల పై ఒత్తిడి తేవాలన్నారు.
Also Read అత్తగారింటికి పోవడానికి ఆర్టీసీ బస్సు చోరీ..
ఎస్టి రిజర్వేషన్ పునరుద్ధరణ సాధనకు అందరూ కృషి చేయాలన్నారు. ఎస్టి రిజర్వేషన్ పునరుద్ధరణ సాధించుకుని దానికి చట్టబద్దత కల్పించుకోవడమే ధ్యేయమన్నారు. వచ్చే ఆదివారం మదనపల్లి లో నిర్వహిస్తున్న వాల్మీకుల రాష్ట్రస్థాయి వర్క్ షాప్ సమావేశం నకు వాల్మీకులంతా ఉమ్మడిగా తరలిరావాలని కదలి రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం నాయకులు,వాల్మీకి కుల పెద్దలు, వాల్మీకి యువత తదితరులు పాల్గొన్నారు….!