కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను..అంటూ మంత్రిగా పవన్ కళ్యాణ్ తన ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించారు CM గా చంద్రబాబు నాయుడు ప్రమా ణ స్వీకారం చేసిన వెంటనే.. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. పవన్ కళ్యాణ్ తన అన్న మెగా స్టార్ చిరంజీవి వద్దకు వెళ్లి కాళ్లకు నమస్కరించడం ఆసక్తికరంగా అనిపించింది. పవన్ కళ్యాణ్ ను చిరంజీవి ప్రేమగా దగ్గరకు తీసుకుని గుండెల కు హత్తుకున్నారు. ఈ అన్నివేశం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుందని చెప్పవచ్చు.

పవన్ కు డిప్యూటీ సీఎం పదవి ఫిక్స్ అయినట్టు పక్కా సమాచారం. వాస్తవానికి ఆయన విజయం కూడా ఓ అద్భుతమేనని ఏపి ప్రజలు కొనియాడారు. 70 వేలకు పైగా మెజారిటీ తో పిఠాపురం నుంచి పవన్ విజయం సాధించారు. ఇంత మెజారిటీ రావడం అనేది మామూలు మాటలు కాదు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవరంటూ.. వైసీపీ నేతలు సోసియల్ మీడియాలో రచ్చ చేశారు. తను మాత్రమే కాదు.. తన పార్టీ తరుఫున బరిలో నిలి చిన వారందరినీ పవన్ కళ్యాణ్ గెలిపించుకున్నారు. ఇక ఈ ప్రమాణ స్వీకార మహోత్స వానికి ప్రధాని నరేంద్ర మోదీ.. కేంద్ర మంత్రులు అమిత్‌షా, జేపీ నడ్డా& నితిన్ గడ్కరీ మహారాష్ట్ర CM ఏక్‌నాళథ్ షిండే, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు , మాజీ CJI N.V రమణ తది తరులు హాజరయ్యారు. ఇక సినీ ఇండస్ట్రీ నుంచి ప్రముఖులు సూపర్‌స్టార్ రజనీకాంత్ , మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు…
