- ఆదిమానవులు నల్లమల చెంచులే..
- పరిణామా క్రమంలో జన్యూ అభివృద్ది నిలచింది.. పెచ్చెర్వు లోనే..
- ప్రపంచ వారసత్వస్థాయిలో పెచ్చెర్వు చెంచు గూడెం
- 1867లో ఆసుపత్రి, 1867లో ఆశ్రమ పాఠశాలలు1937లో పరిపాలన భవనాలు
- నేడు చెంచుల రాజధానిలో కాందిసీకోలుగా దుర్బరమైన జీవితం
- చీకటి ఖండం నుంచి పెచ్చర్వుకు జన్యూ సంబందం
- నల్లమల రారాజులు చెంచులు
ప్రపంచ వ్యాప్తంగా ఆదివాసిలు అంతరించిపో తున్న నేపథ్యంలో వారి సంరణక్ష కోసం ఐక్యరాజ్య సమితి చర్యలు చేపట్టింది. ప్రతి సంవత్సరం అగష్టు 9వతేదిన ప్రపంచ అదివాసి దినోత్సవంను నిర్వ హించుకోవాలని 1994 ప్రకటించింది. 1997లో గిరిజనులకు ప్రత్యేక చట్టాలను, హక్కులను కల్పిస్తూ ప్రపంచ దేశాలను ప్రతినిధులను తిర్మాణానికి అహ్వనించింది. 143 ఐరాస సభ్య దేశాలు పాల్గోన్నగా అందులో 125 దేశాల ప్రతినిధులు తిర్మాణం ఆమోదించింది. అప్పటి నుంచి గిరిజన హక్కులు వారికి ప్రభుత్వాలు కల్పిస్తున్న రాయితీలు గురించి అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ప్రపంచ అదివాసి దినోత్సవంను నిర్వహించుకుం టారు. నల్లమలలో నివశించే చెంచు గిరిజ నుల జీవితాలు వారి అభివృద్ధి,స్వచ్చమైన జీవితం అనుభవించే తెగ్గా.. ఆదివాసి వారి మనుగడకు ఎన్ని అవంతరాలు ఎదరువు తున్నాయి. అభివృద్ధికి దూరంగా ఉంటున్న అడవిని నమ్ముకొని అక్కడికి ఉండి పోతున్నారా.. వారి జీవన సంస్కృతికి, సంప్రదాయాలలో వైవిద్యం, వంటి నల్లమల గిరిజనుల జీవనంపై ప్రత్యేక కథనంను అందిస్తుంది.
దేశ వ్యాప్తంగా 2001 జనాభ లెక్కలో 756 గిరిజన తెగలు 8.45కోట్ల జనాభ ఉన్నారు. దేశ వ్యాప్తంగా వీరి అభివృద్ధి కోసం ఐటిడిఏ కార్యాలయం ప్రారంభించి వారి అభ్యున్నతికి తోడ్పానిస్తుంది. దేశంలో 195 ఐటిడిఏ కార్యాలయాలు ఉన్నట్లు తెలసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10ఐటిడిఏ కార్యాలయాలు, 17 క్లస్టర్లు, మిని ఐటిడిఏ ప్రాజెక్టులు 41 ఉన్నాయి. 75 ఆదివాసి తెగలు ఉన్నట్లు గణంకాలు తెలపుతున్నాయి. ఆంధ్రప్ర దేశ్లో 12 పిటిజి తెగలు ఉన్నట్లు తెలసింది. ఆర్టికల్ 295-1 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పెటిజిలకు అదనంగా నిదులు ఇవ్వాలి. ఆ నిధులను చెంచు గిరిజనుల పునారవాస కేంద్రాలు, వారి అభివృద్ధి కోసం నిధులను ఖర్చు చేయాల్సి ఉంది. నల్లమలలో జీవించే చెంచు గిరిజనులు 60శాతం అదివాసులకే వూర్తి హక్కులు కల్పించిన్నట్లు చట్టాలు చెబుతున్నాయి.

1996నాటి షేడ్యుల్డ్ చట్టం క్రింద 1959 ఎల్ఆర్ భూ హక్కుల చట్టం ప్రకారం గిరిజనుల నుంచి ఇతరులు భూములు కొనే చట్టంను పూర్తిగా నిషేదించడం జరిగింది. నకీలి సర్టిపికేట్లతో ఎంతో మంది అన్యాయం చేస్తున్నారు. రాజ్యాంగంలో 5-6 షేడ్యల్డ్ గిరిజనులకు స్వయం పాలన ఏర్పాటు చేయాలి. ఆర్టికల్ 244–1 అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5,948 గ్రామాలు, 5 షేడ్యూల్డ్ గ్రామాలు ఉన్నాయి. మరో 809 గ్రామాలలో 100శాతం ఆదివాసిలే గుర్తుకు వస్తారు. శ్రీశైలం ఐటిడిఎను మొట్టమొదటి సారిగా 1982 సంవత్సరంలో ఏర్పాటుచేశారు. నేటికి 30 ఏళ్ళు పూర్తికావచ్చిన్న ప్పటికి ఆదివాసీల తలరాతాలు మారడంలేదు.
నల్లమల చెంచులను పిటిజి నుంచి పివిటిజి జాబితాలోకి..
ప్రత్యేక చట్టాలు ఎన్ని తీసుకోని వచ్చిన వారికి మాత్రం నిధులు ఏమైతు న్నాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. 2011 జనాభ లెక్కల ప్రకారంగా దేశ వ్యాప్తంగా ఎస్టీలు 10,42,18,034మంది ఉన్నట్లు అప్పటి జనాభ లెక్కలు చెబుతు న్నాయి. స్వాతంత్ర గుర్తింపు పొంది. అదివాసితెగలు 705 ఉన్నట్లు తెలసింది. తాజాగా లెక్కల ప్రకారం నల్లమల చెంచులను పిటిజి నుంచి పివిటిజి జాబితాలోకి చేర్చి వర్గీకరణ చేశారు. ఎక్కువ ప్రమాదంగా ఉండే గూడెలలో గుర్తించి ప్రత్యేక పున రావాస కేంద్రాలను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వాలు చర్యలు దేవట్బాల్సిన పరిస్థితి నెలకొంది. దేశ వ్యాప్తంగా 75పివిటిజి తెగలు ఉన్నాయి. 2011 జనాభ లెక్కలో 27,68,322మంది ఉన్నట్లు గణంకాలు తెలుపుతున్నాయి. 7 రాష్ట్రలలో ఆదివాసిలు అధికంగా ఉన్నారు..
స్వాతంత్రం రాక ముందు నల్లమల చెంచు గిరిజనులకు స్వేచ్చా జీవితం..
నల్లమల అటవీ ప్రాంతంలో నివశించే చెంచు గిరిజనులకు స్వాతంత్రం రాకముందు నల్లమల కొండల్లో స్వేచ్చగా వారి జీవితంను కొనసాగించే వారు, సబ్ ప్లాన్ నిధులతో 1996 పీసా చట్టంను ఏర్పాటు చేశారు. 2006 సంవత్సరంలో అటవీ హక్కుల చట్టంను కల్పించారు. 2015 సంవత్సరంలో ఆదివాసి హక్కుల రక్షణ చట్టంను అమలు చేశారు. 1989లో ఎస్సీఎస్టీ నిరోదక చట్టం, 2009లో నిర్బంద విద్యాహక్కు చట్టం, 2013లో భూసేకరణ పునరావాస చట్టంలను ప్రవేశపెట్టారు. ఈ చట్టాలు 20శాతం అమలైన ఆదివాసిల రూపురేకలు మారీ 30శాతం ప్రయోజనం చేకూరుతుంది. అదివాసి హక్కుల కోసం జాతీయ స్థాయిలో ఎలాంటి గణంకాలు లేవు, అందుకు ఎస్ఆర్ఎ క్రింద పివిటిజిలు 5వ షేడ్యుల్డ్ నుంచి రక్షణ హక్కులు కోల్పోయారు. 80శాతం నల్లమల చెంచులు అభివృద్ధికి నోచుకోలేదు. అటవీ అవాసాలనుంచి బలవంతంగా జనవాసుల వైపు తరలించడంపై పూర్తి అ జాతి ప్రమాదంలో వడింది.
మూడు తరాలుగా నల్లమల అటవీ ప్రాంతంలోనే చెంచు గిరిజనుల ఆవాసం.. మూడు తరాలుగా నల్లమల అటవీ ప్రాంతంలోనే చెంచు గిరిజనులకు పరివరాత అటవీ నివాస హక్కును కలుగుతుంది. ఎఫ్ఎస్ఏ, ఆర్వోఎస్ఆర్ హక్కులకు నోచుకోలేదు. ఎన్అర్హజిఎస్ క్రింది ఉపాధి డబ్బువస్తున్న ఆదివాసులకు అటవీశాఖ మోఖలకు అడ్డుగా వేసేందుకు వారు చేసే వనులకు ఎన్నో అటంకాలను కల్పిస్తుంది. 2020 చైన్లైన్ సర్వే ప్రకారంగా కర్నూలు జిల్లాలో 14 మండలలో 44 చెంచుల అవాసాలు 2374 గృహాలు ఉన్నట్లు సమాచారం. అర్వోఎస్ఆర్ క్రింద 11గూడెలలో రైతులకు 1192 ఎకరాల సాగు విస్తీర్ణం కోసం ధరఖాస్తు చేసుకున్నారు. మూడు తరాల కంటే ముందు బ్రిటిష్ పరిపాలన శ్రీ కృష్ణదేవరాయుల పరిపాలన నల్లమల చెంచులకు లక్ష ఎకరాలలో వ్యవసాయం చేసుకునే వారు. అటవీశాఖ అధికారులు అభయారణ్యం పేరిట సాగు భూములను రిజర్వు ఫారెస్టుగా మార్చింది.
శ్రీశైలం ఐటిడిఏ పరిధిలో
దేశ రాష్ట్రపతి రాష్ట్ర గవర్నర్లకు విక్షచణఅధికారులతో ఆదివాసిలకు స్వంతంగా అభివృద్ధి పథకాలు చేసే హక్కు ఉంది. కానీ రాష్ట్రాల చరిత్రలో ఏ గవర్నర్ కూడా నల్లమల చెంచుల కనీస హక్కులపై దృష్టిసారించ లేకపోయారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 27,39,919కి గాను అవాసాలు 12,209, జిల్లాలు 13, 5జిల్లాలో 6 ఐటిడిఏ కేంద్రాలు, 13 జిల్లాలో 9 జిల్లాలో ఆదివాసిలు నివాసం ఉంటున్నారు. అక్షరాస్య తలో 48శాతం గిరిజనుల వివరాలను గణంకాలలో తారుమారు చేసి. 25శాతం కంటే ఎక్కువ లేదు. పివిటిజి 6తెగలు జనాభలో 4.520 లక్షలు ప్రకాశం, కర్నూలు, గుంటూరు జిల్లాలో 0.4,073లక్షలు తెలంగాణ రాష్ట్రంలో మహెబుబ్ నగర్ , రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో 72విటిజిలను తెగవలు ఉన్నాయి. చెంచులు మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల వరిధిలో 10,416 చదరపు విస్తీర్ణంలో ఉన్నారు. నల్లమలలో అటవీ ప్రాంతంలో నివశించే 3,568 చదరపు కిలో మీటర్ల పరిధిలో పెద్ద పులుల అభయారణ్యంను నియమించారు. కృష్ణనదికి ఇరువైపుల ఈ నల్లమల ఉంది. నాల్గోవ పంచవర్ష ప్రణాళికలో గిరిజన అభివృద్ధి 6 ప్రత్యేక ప్రాజెక్టులను ఏర్పాటు చేశారు. 5వ పంచవర్ష ప్రణాళికలో 1979లో ఐటిడిఏలు ఏర్పాటు కోసం చెంచులకు ప్రత్యేకంగా శ్రీశైలం ఐటిడిఏ పిజిటి చెంచు ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. శ్రీశైలం ఐటిడిఏ పరిధిలో కర్నూలు, ప్రకాశం, గుంటూరు, ప్రాంతాలలో 165 మ ండలలలో 171 చెంచు గూడెలో ఉన్నట్లు తెలసింది. వీరి జనాభ దాదాపు 40వేల పైనే ఉన్నారు.
ఆఫ్రికా ఖండాల నుంచి పెచ్చెర్వు వరకు అదివాసిల అనుబందాలు.. ప్రపంచ దేశాలలో ఆఫ్రికా ఖండం నుంచి చెంచుల పూర్వ రాజధాని పెచ్చర్వు గూడెం వరకు ఆదివాసిల అనుబంద సంబందాలు ఉన్నట్లు సమాచారం. ఆదిమానవుల నుంచి నల్లమల చెంచులే మొదటిగా నిలిచారు. పరిణామ క్రమంలో జన్యూఅభివృద్ధి నిలచింది. పెచ్చర్వు లోనే నల్లమల చెంచుల రాజధాని అయిన పెచ్చర్వులో చెంచు గిరిజ నులకు రారాజులుగా రాజ్యం ఏళ్ళే వారు ప్రపంచ వారోసత్వ స్థాయిల పెచ్చెర్వు చెంచుగూడంలో 1867 సంవత్సరంలో అసుపత్రి, 1937లో పరిపాలన భవనాలు, ఆశ్రమపాఠశాలలు 5 భారీ చెంచు గూడెలలో సమహరం పెచ్చెర్వు కేంద్రం రాజధానిగా కొనసాగించారు. తమ రాజధానిలో నేడు కాందిసికోలుగా దుర్బటమైన జీవితంను అనుభవిస్తు న్నారు. చీకటి ఖండంను పెచ్చర్వు జన్యూవ సంబంధం అదిమానవుడి అనవాలకు పెచ్చెర్వు చెంచులే నిదర్శనం. శ్రీలంకలో పెదోయిడ్ తెగ నల్లమల చెంచులే అడవికి రారాజుల ఉంటూ మహనోత్స చరిత్ర కల వారు మహరాజులు, చక్రవర్తులనే తమకు అనుకూలంగా మలుచుకున్న నేర్పరులు శ్రీశైలం అడవులో నివశించే వీరికి మల్లికార్జునస్వామితో పాటు అంతకంటే కూడా చరిత్ర ఉందని చాల మందికి తెలియదు.
ప్రస్తుతం రాష్ట్రంలో చెంచుల స్థితిగతులపై అధికారుల పరిపాలన ఏవిదంగా ఉంది..
నవ్యాం ధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి ప్రభుత్వాలు అభయారణ్యాల పేరిట అడవులలో నివవించే చెంచులను అడవుల నుంచి వెల్లగొడుతున్నారు. పునరావాస పేరుతో పెచ్చర్వు గూడెంను కొట్టాలచెరువుకు తరలించి పూర్తి పునరవాసం కల్పింలేదు. దీంతో 400ల మంది పెచ్చర్వు గిరిజనులు పునరావాసం కోల్పోవాల్సి వచ్చింది. వారేఉండి ఉంటే వారి జనాభ 3వేలకుపైగా పెరిగి ఉండేది. నిజాం పాలనలో నల్లమల చెంచులకు 1,07,850 ఎకరాలను చెంచు రిజర్వుగా కేటాయించారు. నేటి చట్టాలు అంతరించిపోతున్నా ఆదివాసి చెంచుల ప్రాణాల కంటే పెద్ద వులుల ప్రాణాలే ముఖ్యమా అని ఆదివాసీలు ప్రశ్నించు కుంటున్నారు..?
Also Read అందంలోనూ.. బలంలోనూ..పెద్ద పులి
Also Read అత్తగారింటికి పోవడానికి ఆర్టీసీ బస్సు చోరీ..