వాసంతి అత్యాచారం, హత్య
సంఘటనలో పాల్గొన్న దోస్తులను శిక్షించాలి ….
వాసంతి మృతదేహాన్ని గుర్తించడంలో నిర్లక్ష్యం కు కారకులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలి…..CLC
ఉమ్మడి కర్నూలు జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమరి గ్రామానికి చెందిన సంగెం మద్దిలేటి, సుజాతల కుమార్తె వాసంతి ( 9) అత్యాచారం,
హత్య సంఘటనపై పౌర హక్కుల సంఘం కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో బాధితులను పరామర్శించి ,తీర ప్రాంతాన్ని పరిశీలించి ,
స్థానిక ప్రజలను కలిసి సేకరించిన సమాచారం మేరకు నిజనిర్ధారణ బృందం ఈ క్రింది వాస్తవాలను తెలియజేస్తున్నది…
7- 7-24 నాడు ( ఆదివారం) వాసంతి తన తల్లిదండ్రులతో కలిసి ఉదయం 10 గంటలకు భోంచేసి సెలవు దినం కావడంతో పక్కింటి ఒక చిన్నారితో..
కలిసి ఇంటికి సమీపంలోని పార్కు వద్దకు ఆడుకోవడానికి వెళ్ళింది సహజంగా పిల్లలు సెలవు దినాల్లో ఆడుకోవడానికి వెళుతుంటారని..
ఆ నేపథ్యంలో నే వాసంతి కూడా ఆడుకోవడానికి వెళ్ళింది. ఇంటి పనుల ఒత్తిడి వల్ల తమ కుమార్తె ను గమనించని తల్లితండ్రులు ..
మధ్యాహ్నం 3 గంటలవరకు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పార్కులోను ,పార్కు చుట్టుపక్కల ప్రాంతాలను వెతికినారు.
పక్కన ప్రజలు ఎవరు సమాధానం చెప్పకపోవడంతో గ్రామ చుట్టూ ఉన్న కాలువలు, వంకలు కూడా వెతికినారు అప్పటికి కనిపించకపోవడంతో..
రాత్రి 8 గంటల తర్వాత ముచ్చుమరి పోలీసులకు ఫిర్యాదు చేసినారు అయితే పోలీసులు వెంటనే స్పందించి ఆమెతో పాటు ..
వెళ్లిన చిన్నారిని విచారించి ఉంటే వాసంతి శవమైన దొరికి ఉండేది. ఆదివారం సంఘటన జరిగితే మంగళవారం సాయంత్రం
వాసంతితో పాటు వెళ్లిన వెళ్లిన చిన్నారిని విచారించి ఆ సంఘటనకు పాల్పడిన నిందితులను గుర్తించారు. ఆదివారమే చిన్నారిని విచారించి ఉంటే..
వాసంతి తల్లిదండ్రులు సవమైన దొరికి కడుపుకోత కొంతైనా తీరేది ఇందులో పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతోంది.
ఎన్నో సంక్లిష్టమైన కేసులను ఛేదించే పోలీసు వ్యవస్థకు ఇది పెద్ద విషయం ఏమీ కాదు దీన్నిబట్టి చూస్తే దీని వెనుక నిందితులను నిందితుల ,
వారి కుటుంబాలను కాపాడడానికి అధికార రాజకీయ నాయకుల జోక్యం కనిపిస్తున్నది.. స్థానిక ప్రజల నుండి వచ్చిన సమాచారం మేరకు ..
మూడు నాలుగు దశాబ్దాల నుండి శవాలను కృష్ణ నదిలో పడవేయడం సాక్ష్యాలు లేకుండా చేయడము ప్యాక్షన్ సంస్కృతిలో సహజమేనని కమిటీ దృష్టికి తీసుకువచ్చారు.
Also Read..నల్లమల అడవులకు రానున్న గజరాజులు
ఈ అమానుష సంఘటనకు కారణం, ప్రభుత్వాలు అవలంబిస్తున్న, పెంచి పోషిస్తున్న విచ్చలవిడి అశ్లీల చిత్రాలు పోర్న్ వీడియోస్ ప్రధాన కారణంగా భావిస్తున్నాం.
ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం వాసంతి సంఘటన లో పాల్గొన్న నిందితులతో పాటు శవాన్ని మాయం చేయడంలో నిందితులకు సహాయం చేసిన వారిని కూడా కఠినంగా శిక్షించాలి.!…
…. “పోలీసుల వైఫల్యాన్ని
కప్పిపుచ్చుకోవడానికి ప్రజల
ఆగ్రహాన్ని సల్లార్చడానికి జరిగినదే! ఉసేనయ్య
లాకప్ హత్య..”…
___________________
సమాజం నుండి వాసంతి హత్య సంఘటన పై వస్తున్న ప్రజాగ్రహం చల్లార్చడానికి ,పోలీసుల వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి పోలీసులు ..
నిందితులైన కుటుంబ సభ్యులను అదుపులోనికి తీసుకొని ఉసే నయ్య ను విచారణ పేరిట పలు పోలీస్ స్టేషన్ల లో హింసిస్తూ చివరకు నంద్యాల సిసిఎస్ పోలీస్ స్టేషన్లో లాకప్ హత్యచేశారు.
సిసిఎస్ సిఐ గోపీనాథ్ రెడ్డి, మరియు ఇతర అధికారుల సమక్షంలో ఈ లాకప్ హత్య జరిగినట్లు మా విచారణలో తేలింది. పత్రికలలో,
ప్రసారం మాధ్యమాలలో పూర్తి సాక్షాదారులతో మృతిని శరీరంపై తీవ్రమైన గాయాలు ఉన్నట్లు మీడియా బహిర్గతం చేసింది .
ఇంతటి తీవ్రమైన హత్య నేరాన్ని చేసినప్పటికీ పోలీసులపై కేసు నమోదు చేయలేదు ఒకవేళ శవాన్ని మాయం చేయడంలో సహకరించిన వారిని చట్ట ప్రకారంగా శిక్షించాలి,
గాని చట్టాన్ని పోలీసులు చేతులకు తీసుకోవడం పౌర హక్కుల సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది .వాసంతి హత్యకు చట్టపరమైన పరిష్కారం చేయడంలో వైఫల్యం చెందిన పోలీస్ యంత్రాంగం..
చట్ట వ్యతిరేకంగా హత్యకు ,హత్య ప్రతీకారంగా సమాజంలో చూపెట్టడానికి ప్రభుత్వ ఆదేశాలతోనే చేసినట్లు తెలుస్తుంది.
Also Read..YABER PRO V9 WiFi 6 Bluetooth Projector
పై రెండు సంఘటనలపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాము …
ఈ నిజ నిర్ధారణలో పాల్గొన్న సభ్యులు సి.వెంకటేశ్వర్లు రాష్ట్ర సహాయ కార్యదర్శి ,ఏస్ అల్లాబకాష్ జిల్లా కార్యదర్శి, ఎం కరీం భాషా జిల్లా కార్యవర్గ సభ్యులు ,ఎం ఇదయతుల్లా జిల్లా కార్యవర్గ సభ్యులు ఏవి సుబ్బరాయుడు కే ఎన్ పి ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తదితరులు పాల్గొన్నారు
ముచ్చుమరి/నందికొట్కూర్
ఉమ్మడి కర్నూలు జిల్లా
తేదీ, 25/07/2024.