వేపచెట్టు అందరికీ తెలిసిన వృక్షం, వేప శాస్త్రీయనామం అజాడిరక్టా ఇండికా. ఆంగ్లంలో మార్గోసా, నీమ్, సంస్కృతంలో నింబవృక్షం అని దీనిని పిలుస్తారు. ఈ చెట్టు సులభ ప్రక్రియల ద్వారా ఆరోగ్య పరిరక్షణకు ఎలా
ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.
రెండు కప్పుల నీటిలో నాలుగైదు వేపాకులు వేసి బాగా మరిగించి ముఖా నికి ఆవిరిపట్టి గోరువెచ్చని నీటితో ఉదయం, సాయంత్రం ముఖం కడు – క్కుంటూ ఉంటే..
ముఖం జిడ్డుతనం పోయి నిగారింపు సంతరించుకుంటుంది. మొటిమలు, మచ్చలు తగ్గు 3 తాయి. వారానికి ఒకసారి పరగడుపున.. 7 నుంచి 8 వేప చిగుళ్లు నూరి ఉండచేసి మింగి, పావు కప్పు పెరుగు సేవిస్తుంటే కడుపు, పేగుల్లోని వివిధ రకాల క్రిములు చనిపోతాయి.
వేప చిగుళ్లు, పసుపు సమంగా కలిపి మెత్తగా నూరి ఆయా భాగాల్లో లేపనం చేస్తుంటే దురదలు, దద్దుర్లు తగ్గుతాయి.
మీజిల్స్, చికెన్ పాక్స్ లాంటి వైరస్ వ్యాధులు తగ్గుతాయి. వారానికి ఒకటి రెండుసార్లు వేప చిగుళ్ళకు రెట్టింపు చింత ఆకు కలిపి నూరి ఉండచేసి..
పరగడుపున కరక్కాయ ప్రమాణంలో తీసుకుని పాలు తాగుతూ.. పథ్యం చేస్తే కఠినమైన కామెర్ల వ్యాధి కూడా రెండు నుంచి నాలుగు వారాల్లో తగ్గుతుంది.
వేపాకు, నెయ్యి సమాన భాగాలుగా తీసుకుని నెయ్యిలో వేపాకు నల్లగా మాడిపోయేట్లు కాచి మొత్తమంతా కలిపి నూరి నిలువ ఉంచుకోవాలి.
రోజు రెండుసార్లు దీనిని లేపనం చేస్తుంటే వ్రణాలు, దీర్ఘకాలిక పుళ్లు, దుష్ట వ్రణాలు తగ్గుతాయి.
పావు స్పూను వేపచెక్క చూర్ణంలో..
Also Read..నల్లమల అడవులకు రానున్న గజరాజులు
తగినంత పంచదార కలిపి ఉదయం, సాయంత్రం పాలతో తీసుకుంటూ ఉంటే అతిమూత్ర వ్యాధి తగ్గుతుంది. మూత్ర మార్గంలో ఇన్ఫెక్షన్ తగ్గి చీము రావటం తగ్గుతుంది.
పావు స్పూను వేపచెట్టు బెరడు చూర్ణాన్ని ఒక కప్పు నీటిలో కలిపి రాత్రంతా నించి, ఉదయం ఆ నీటిని వడబోసి స్పూను తేనె కలిపి తాగాలి.
అలాగే ఉదయం నానబెట్టి సాయంత్రం తాగుతూ ఉంటే రక్త శుద్ధి జరిగి ఒంటి దురదలు, కామర, పుండ్లు, మచ్చలు, గుల్లలు లాంటి వివిధ రకాల చర్మవ్యాధులు తగ్గుతాయి.
వేపబంక చూర్ణాన్ని రెండు పూటలా అర స్పూను చొప్పున సేవిస్తుంటే మూత్రాశయ కండరాలు బలోపేతమై అసంకల్పిత మూత్ర విసర్జన తగ్గుతుంది.
వేప నూనె, నీరుడు విత్తుల తైలం ఒక్కొక్కటి రెండు వందల గ్రాములు తీసుకుని వేడి చేసి అందులో ఇరవై అయిదు గ్రాముల వుంట కర్పూరాన్ని కరిగించి వివిధ చర్మ వ్యాదుల్లో ఉపయోగిస్తారు.
నింబాది తైలంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆయుర్వేద ఔషధాన్ని పై పూత మందులాగా కుష్టు వ్యాధిలో ఎక్కువగా వాడతారు.
ఎండించిన వేప పండ్ల చూర్ణం, ఉప్పు, పొంగించిన పటిక సమంగా కలిపి దంత ధావనచూర్ణంగా వాడవచ్చు. వేపపుల్లల బదులు ఈ ఔషధాన్ని ఉపయోగించడం.
మొలలు కూడా తగ్గుతాయి.
వల్ల ఉత్తమ ప్రయోజనాలు పొందవచ్చు. అరస్పూను వేప గింజల చూర్ణాన్ని రోజూ ఉదయం పూట నీటితో సేవిస్తూ పై పూత మందుగా వేప పప్పును..
రెండింతలు నువ్వుల నూనెలో వేసి నల్లగా అయ్యేంతవరకూ మాడ్చి చల్లారిన తరువాత కొద్దిగా మైలుతుత్తం కలిపి నిలువు ఉంచుకుని లేపనం చేస్తుంటే మొలలు తగ్గుతాయి.
ఔషధ మొక్కల్లో ఆరోగ్య రహస్యాలు
ఒక వారంపాటు ఉదయం పరగడుపునే 5 వేపాకులు, 5 మిరియాలు కలిపి నమిలి మింగుతూ ఉంటే ఆ సంవత్సరమంతా వివిధ రకాల అంటువ్యాధులు రాకుండా రక్షణనిస్తుంది.
కాడలను తొలగించిన తాజా వేప పువ్వులను వెడల్పాటి పాత్రలో వేసి రెట్టింపు, పంచదార లేదా పటికబెల్లం పొడివేసి బాగా కలిపి రెండ్రోజులకొకసారి బాగా కలుపుతూ సూర్యరశ్మిలో ఒక నెలపాటు ఉంచితే అంతా కలిసిపోయి చక్కని ఔషధం తయారవుతుంది.
Also Read..YABER PRO V9 WiFi 6 Bluetooth Projector
వేపగుల్కందుగా పేర్కొనే ఈ ఔషధాన్ని రోజూ పరగడుపున ఒక స్పూను వంతున సేవిస్తుంటే ఎప్పుడూ జ్వరం వచ్చినట్లు ఉండటం, ముక్కులో నుంచి రక్తం కారడం, ఆకలి మందగించడం, గొంతు ఎండిపోయినట్లు ఉండటం. రక్త దోషాలు తగ్గిపోతాయి.
పొంగించిన పటిక ఒక భాగం వేపాకులు రెండు భాగాలు కలిపి నీటితో నూరి, కంది గింజంత మాత్రలు చేసుకుని మలేరియా వ్యాధిలో జ్వరం వచ్చే సమయానికి ఒక గంట ముందు, జ్వరం తగ్గిన ఒక గంట తరువాత రెండు రెండు మాత్రల చొప్పున సేవిస్తుంటే మలేరియా తగ్గుతుంది.
వేపాకు బూడిదను రసికారే పుళ్లపై చల్లితే అవి త్వరగా మానిపోతాయి . ఈ బూడిదను నెయ్యితో కలిపి రాసుకుంటూ ఉంటే సోరియాసిస్ అ చర్మవ్యాధిలో సుగుణం కనిపిస్తుందని అనుభవ వైద్యం చెబుతోంది.