బనగానపల్లె నియోజకవర్గం శాసన సభ్యులు కాటసాని రామిరెడ్డి గారు ఆయన స్వగృహం లో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ…
టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కర్నూల్ పర్యటన చేయడం జరిగిందని చెప్పారు.
రాయల సీమ ప్రాంత అభివృద్ధి టిడిపి పార్టీ వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మళ్ళీ చంద్ర బాబు నాయుడు రాయల సీమ ప్రాంతం అయిన కర్నూల్ జిల్లా లో పర్యటన చేయడం విడ్డూరంగా వుందని చెప్పారు.
రాయల సీమ ప్రాంత ముఖ ద్వారం అయిన కర్నూల్ జిల్లా అనాదిగా వెనుకబాటు తనానికి గురి అవుతుందని ఇప్పటికయినా ఆంధ్ర ప్రదేశ్ లోని
రాయలసీమ,కోస్తా,ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ముఖ్య మంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు..
మూడు ప్రాంతాల అభివృద్ధికి వికేంద్రీకరణ తోనే సాధ్యం అని భావించి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఆ నిర్ణయానికి కట్టుబడి వున్నారు.
Also Read..నల్లమల అడవులకు రానున్న గజరాజులు
అని అయితే టిడిపి – జనసేన పార్టీలు మాత్రం కర్నూల్ లో హై కోర్ట్ ఏర్పాటు కు వ్యతిరేకించడం వారికి రాయల సీమ ప్రాంతం మీద ఏ మాత్రం అభిమానం వుందో తెలుస్తుంది అని చెప్పారు.
కర్నూల్ పర్యటన సందర్భంగా ప్రతి పక్ష నాయకుడు చంద్ర బాబు నాయుడు కు కుర్నూల్ లో హై కోర్ట్ రాజధాని ఏర్పాటు చేయాలని,
వెళ్లిన విద్యార్థి సంఘాల మీద,న్యాయవాద సంఘాల మీద అసభ్యకర మైన వ్యాఖ్యలు చేయడం 40 ఇయర్స్ రాజకీయ ఇండస్ట్రీ లో..
మీకు సభ్యత సంస్కారం నేర్చుకొన్నది ఇదేనా అని చంద్ర బాబు నాయుడు ను ప్రశ్నిస్తున్నాను అని చెప్పారు.
వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి పుట్టుక అబద్దాల పుట్టుక అని చంద్ర బాబు అంటున్నారే మరి 2014 సంవత్సరం లో..
ఆంధ్ర ప్రదేశ్ నూతనంగా ఏర్పడింది అని అనుభవం వున్న నాయకుడు ముఖ్య మంత్రి గా అయితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది.
అని ప్రజలకు మభ్యపెట్టి ప్రజల ఓట్లతో అధికారం లోకి వచ్చిన మీరు ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చి అధికారం వచ్చిన తరువాత..
మీరు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చిన పాపాన పోలేదు మీరా మా ముఖ్య మంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి పుట్టుక గురించి మాట్లాడేది.
గత టీడీపీ పార్టీ అధికారం లో వున్నప్పుడు మండల రెవెన్యూ ఆఫీసర్ వనజాక్షి మీద దాడి చేసిన మీ ఎమ్మెల్యే చింతమ నేని ప్రభాకర్ అనుచరుల మీద మీ ప్రభుత్వం ఏమి చేసింది.
కాల్ మని ద్వారా కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణమైన వారిని ఏమి చేశారు. మీదా నేరగాళ్లను పట్టుకొనే పార్టీ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు అనాడు.
CM YS జగన్ మోహన్ రెడ్డిని బూతులు తిట్టడం మంచిదికాదు
అధికారం లో వున్నప్పుడు సాగు ప్రాజెక్ట్ లను నిర్మిస్తూ వుంటే ఇది జల యజ్ఞం కాదు ధన యజ్ఞం అని చెప్పిన మీరు జల ప్రాజెక్ట్ ల ను కట్టించినారా అని..
చంద్ర బాబు ను ఎమ్మెల్యే కాటసాని సూటిగా ప్రశ్నించారు.కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా మీరు ముఖ్య మంత్రిగా చేశాను.
అన్న విషయాన్ని కూడా పక్కన పెట్టీ బట్టలు విప్పి తరిమిస్తా,రమ్మంటావా,చేతకాని దద్దమ్మలారా ,నేరాలు ఘోరాలు చేసే దరిద్రులారా,బొడి నా కొడుకులు అంటూ ..
వ్యక్తుల పై బూతులు తిట్టడమే కాకుండా మన రాష్ట్ర ముఖ్య మంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని దద్దమ్మ సీఎం అంటూ,
పనికిమాలిన సీఎం అంటూ,,రౌడీ అంటూ ముఖ్య మంత్రి పదవికి గౌరవం ఇవ్వకుండా మాట్లాడుతున్నారే మీరా మా ముఖ్య మంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు.
గృహ నిర్మాణాల విషయం లో దోపిడీ జరిగింది అంటున్నారు,ప్రభుత్వం ఇచ్చే ఇంటి స్థలాల్లో స్కాం జరిగింది అంటున్నారు మరి బనగానపల్లె పట్టణం లో..
4,000 వేల మంది పేదలకు ఇచ్చే ప్రభుత్వ స్థలాలను ఇవ్వకుండా బనగానపల్లి టిడిపి పార్టీ నాయకులు న్యాయస్థానాలకు వెళ్లి పేదలకు..
ఇంటి స్థలాలు రాకుండా అడ్డుపడుతున్నది మీ టిడిపి పార్టీ,మీ నాయకులు కాదా చంద్ర బాబు నాయుడు గారు అని ప్రశ్నించారు.
చంద్ర బాబు నాయుడు మాట్లాడుతూ పేటిఎం బ్యాచ్ అంటున్నారు ఎవరు ఎవరికి పే టీఎం బ్యాచో ప్రజలకు తెలుసు అన్నారు.
పోలీస్ వ్యవస్థ గురించి చంద్ర బాబు నాయుడు గారు మాట్లాడుతుంటే దయ్యాల ముందు వేదాలు వల్లవేసినట్లు అనిపిస్తుంది.
Also Read..YABER PRO V9 WiFi 6 Bluetooth Projector
ఆనాడు ప్రతి పక్షనేత అయిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని గన్నవరం విమానాశ్రయం వద్ద పోలీస్ లతో అడ్డుపడ్డది మీరు కాదా చంద్రబాబు గారు,
అలాగే మీ అధికారం వున్నప్పుడు అప్పటి వైయస్సార్ పార్టీ నాయకుల మీద,కార్యకర్త ల మీద అక్రమ కేసులు పెట్టడం మీ ప్రభుత్వం లో జరిగినది వాస్తవం కాదా అని గుర్తు చేశారు.
ఎవరు ఏమి చేశారో ప్రజలు గమనిస్తున్నారు అని ప్రజల పక్షాన ప్రజా సమస్యల మీద పోరాటం చేయాల్సింది పోయి అసభ్యకరమైన దూషణలు చేయడం మంచి సంస్కృతి కాదని చెప్పారు.