కర్నూలు నగరం లోని గుత్తి పెట్రోల్ బంకు సమీపం లో వున్న V V S ఫంక్షన్ హాల్లో కుమ్మర శాలివాహనుల కార్తీక వన సమారాధన కార్యక్రమం
అత్యంత ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి వందల సంఖ్యలో కుమ్మర కులస్తులు హాజరయ్యారు…. ముఖ్య అతిథులుగా రవీంద్ర విద్యా సంస్థల అధినేత గూడూరు పుల్లయ్య గారు ,
శాలివాహన కార్పొరేషన్ మాజీ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర గారు ,ప్రముఖ పరిశ్రామిక వేత్త అనంత రమన గారు హాజరయ్యారు…. శాలివాహన
కులస్తు లందరూ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పూర్తిగా వెనుకబడి ఉన్నారని…
Also Read..నల్లమల అడవులకు రానున్న గజరాజులు
వచ్చే సాధారణ ఎన్నికల లో అధికార, ప్రతిపక్ష పార్టీలు గుర్తించి ఎమ్మెల్యే లు గా పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు… విద్యార్థులు ,
యువత మంచి చదువులే లక్ష్యంగా అడుగులు. ముందుకు వేసి ఉన్నత శిఖరాల ను సాధించాలని రవీంద్రా విద్యాసంస్థల అధినేత గూడూరు పుల్లయ్య పిలుపు నిచ్చారు…..
ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా తీర్చి దిద్ది కుమ్మరి కులస్తు లందరినీ ఒకచోట ఏకం చేసిన కర్నూలు జిల్లా శాలివాహన సంక్షేమ సంఘం కమిటీ తోపాటు,
జిల్లా అధ్యక్షు డైన సోమేశ్ ని ముఖ్య అతిథులు ప్రత్యేకంగా అభినందించారు….ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తూ..
కులస్తు లందరి కష్ట నష్టాలను తీరుస్తూ అందరికీ తలలో నాలుకలా మెలగాలని ఆకాంక్షించారు…
కార్యక్రమానికి వచ్చిన విశిష్ట అతిథులకు కర్నూలు జిల్లా శాలివాహన సంక్షేమ సంఘం కమిటీవారు మెమోంటో లతో శాలువాలు కప్పి సత్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా అంత ర్జాతీయ సాఫ్ట్ బాల్ టోర్నీకి ఎంపి కైన కళ్యాణి కి కుల సంఘాలు అందరూ చందాలను ప్రోగు చేసి
లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించారు…. కళ్యాణి మరెన్నో మైలు రాయులను అధిగమించి అను కున్న లక్ష్యాలను
నెరవేర్చి అంత ర్జాతీయంగా తెలుగు వారి సత్తా తో పాటు కుమ్మరి కుల గొప్ప తనాన్ని తెలియ చెప్పాలని విజ్ఞప్తి చేశారు….
ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు సోమేశ్, ప్రధాన కార్యదర్శి బజారప్ప, కోశాధికారి కేసీ నాగన్న తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కె నాగేశ్వరరావు,
గుడంపాడు శ్రీనివాసులు, రామచంద్రుడు ,లింగన్న తో పాటు శ్రీశైల అన్న దాన సత్రం మాజీ అధ్యక్షులు రాజు, ప్రస్తుత ప్రధాన కార్యదర్శి లక్ష్మన్న , మహానంది అన్నదాన సత్రం అధ్యక్షులు రామకృష్ణ,
అహోబిలం అన్నసత్రం అధ్యక్షులు నారాయణ తోపాటు నవ్యాంధ్ర ప్రదేశ్ కుమ్మర శాలివాహన యువ జన రాష్ట్ర అధ్యక్షులు హరి కిషన్ నియోజకవర్గం అధ్యక్షులు సురేష్ పాండు రంగ స్వామీ రాజన్న ఉమ్మడి కర్నూలు జిల్లా లోని నియోజక వర్గం సంక్షేమ సంఘం కమిటీల సభ్యులు అన్నసత్రాల కార్యవర్గ సభ్యులు శాలివాహన కుల భందువులు అందరూ పాల్గొన్నారు.
Also Read..YABER PRO V9 WiFi 6 Bluetooth Projector
#kummariSalivahana #kummarulu #kummarulakartikaVanabojanam #KurnoolKummarulu#కుమ్మర శాలివాహనుల కార్తీక వన సమారాధన