రైతును అవమానించిన మాల్ మూసివేత
బెంగళూరు : ధోతీ కట్టుకున్నాడని ఓ రైతును అవమానించిన బెంగళూరులోని జీటీ వరల్డ్ మాల్ సెక్యూరిటీ గార్డుతోపాటు ..
మాల్ యజమానిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 126(2) (నిర్బంధం) కింద కేసు నమోదైంది.
రైతుకు అవ మానంపై సీరియస్ అయిన కర్నాటక సర్కారు.. ఆ మాల్ ను వారం పాటు మూసివేయాలని కూడా ఆదేశించింది.
మంగళ వారం జీటీ మాల్ లోని మల్టీప్లెక్స్ లో కొడుకుతో కలిసి సినిమా చూసేందుకు వచ్చిన హవేరికి చెందిన ఫకీరప్ప అనే రైతును సె క్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు.
పంచె కట్టుకున్నందుకు మాల్ లోకి అనుమతించ లేమని చెప్పారు. తమ దగ్గర సినిమా టికెట్స్ ఉన్నాయని.. మాల్ లోకి పంపాలని తండ్రి కొడుకు కోరినా సెక్యూరిటీ గార్డు వదల్లేదు.
సెక్యూరిటీ ప్రవర్తనను ఫకీరప్ప కొడుకు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో మాల్ యాజమాన్యంపై విమర్శలు వెల్లువెత్తాయి.
Also Read..నల్లమల అడవులకు రానున్న గజరాజులు
మాల్ ఎదుట రైతు సంఘాలు ఆందోళనకు దిగాయి. రైతుకు, ఆయన కొడుక్కి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి.
మాల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, లేదంటే వేలాది మంది రైతులతో నిర సనకు దిగుతామని హెచ్చరించాయి.
దీంతో రైతుకు మాల్ సెక్యూరిటీ సిబ్బంది క్షమాపణలు చెప్పారు. వీడియో వైరల్ కావడంతో కర్నాటక ప్రభుత్వం కూడా స్పందించింది.
రైతును అవమానించినందుకు జీటీ వరల్డ్ మాల్ ను వారం రోజుల పాటు మూసివేయాలని ఆదేశించింది.
బెంగళూరులో ఓ మాల్లోని మల్టీప్లెక్స్లోలో కుమా రుడితో కలిసి సినిమా చూడటానికి ఫకీరప్ప అనే రైతు ధోతీ కట్టుకొని వచ్చాడని,
ధోతీ, తలగుడ్డంటే… రైతే..!
కాపలాదారు లోనికి రానివ్వ కుండా, ప్యాంట్ ధరించి వస్తేనే అనుమతిస్తానని అడ్డు కొన్నాడు.
ఆ రైతు కుమారుడు ఈ సంభాషణను వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశాడు. దానిపై రైతు సంఘం నాయకులు వేలాదిమంది..
ధోతీ ధరించిన రైతులతో, ఆ మాల్ను ముట్టడిస్తామని హెచ్చ రించారు. దానితో మాల్ యాజమాన్యం ఈ సదరు ఫకీరప్పను ఆహ్వానించి,
ధోతితో వచ్చిన ఆయనకు స్వాగతం పలికి శాలువా కప్పి సత్కరించి, క్షమా పణలు చెప్పి ఇకపై ఇటువంటి పొరపాటు చేయబోమని చెంపలేసుకుంది.
Also Read..YABER PRO V9 WiFi 6 Bluetooth Projector
పత్రికలలో ఈ వార్త చదివినాక, నాడు రాజ్యసభలో జరిగిన ఓ ఆసక్తి కరమైన సన్నివేశం గుర్తుకొచ్చింది. 1990లో నాటి ఉపప్రధాని దేవీలాల్ ఓ ప్రశ్నకు సమాధానం చెబుతున్నారు.
5 నక్షత్రాల హోటళ్లలో రైతులకు రెస్టారెం ట్లలో చౌక ధరలకు తినుబండారాలు ఇస్తామని ప్రకటించారు. రైతులను ఎలా గుర్తుపడతారని ప్రశ్నించారు.
ఏముంది – ధోతీ, తలగుడ్డ ఉంటుంది గదా? వాటి ఆధారంగా గుర్తుపడతారు’ అన్నారు.
కర్ణాటకకు చెందిన ..
మార్గరేట్ ఆల్వా కాంగ్రెస్ పక్షాన సీనియర్ సభ్యురాలు – పైగా జీవ్ రాజ్ ఆల్వా కుటుంబ నేపథ్యం చాలా హుందాగా ఉండేది.
మహిళా రైతులను గుర్తుపట్టడం
‘అది సరే చౌదరీసాబ్ – చౌదరిణీల నెలా గుర్తుపట్టడం (మహిళా రైతులను) అని’ ప్రశ్నించారు. దానికి దేవీలాల్ ‘వారు ఎటూ వారి భర్తల వెంటే ఉంటారు గదా?’ అని సమాధానమిచ్చారు.
‘మరి వారు ఒంటరిగా వస్తేనో?’ అనే సందేహం వెలిబుచ్చారు. దానికి దేవీలాల్ ‘మా పల్లెటూరి మహిళలు, బస్తీల దొరసాను లలాగా..
ఒంటరిగా, భర్త లేకుండా 5 నక్షత్రాల హోటళ్లకు వెళ్లరు’ అని గడుసుగా శెలవిచ్చారు. మార్గరేట్ ఆల్వా సిగ్గుతో ఆమె కుడా సభలో వెల్లివిరిసిన నవ్వులతో పాలుపంచుకొన్నారు.
డాక్టర్ యలమంచిలి శివాజీ , వ్యాసకర్త రాజ్యసభ మాజీ సభ్యులు