బదిలీపై వెళ్తున్నా జిల్లా ఎస్పీ శ్రీ K.రఘువీర్ రెడ్డి IPS గారికి ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించిన జిల్లా పోలీసు అధికారులు…..
పట్టుదల ఉంటే ఎంతటి క్లిష్టమైన పరిస్తుతులనైనా అదిగమించవచ్చు…..
ప్రజలు, పోలీసు యంత్రాంగం అందించిన సహకారం మరవలేను: ఎస్పీ గారు
2022 సంవత్సరం నందు కొత్తగా నంద్యాల జిల్లా ఏర్పడినప్పటి నుండి సుమారు రెండు సంవత్సరాల నాలుగు నెలలు జిల్లాకు మొదటి ఎస్పీగా…
బాధ్యతలు చేపట్టిన జిల్లా ఎస్పీ శ్రీ కె.రఘువీర్ రెడ్డి IPS గారు బదిలీపై వెళ్తున్న సందర్భంగా జిల్లా పోలీస్ అధికారులు నంద్యాల పట్టణంలోని ..
సూరజ్ గ్రాండ్ హోటల్ లోని కాన్ఫరెన్స్ హాల్ నందు నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా IPS గారి ఆధ్వర్యంలో..

ఘనంగా ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం నందు బదిలీపై వెళ్తున్న ఎస్పీ గారిని పోలీసు అధికారులు పూలమాలు, పుష్పగుచ్చాలు, షాలువాలతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా IPS గారు మాట్లాడుతూ జిల్లా ఏర్పడినప్పటినుండి సరైన వనరులు లేకున్నా ..
జిల్లాలో చాలా సమస్యలు ఉన్న ఎస్పీ రఘువీర్ రెడ్డి గారు చాలా సమర్థవంతంగా కస్టపడి పనిచేశారని గడిచిన ఎన్నికలలో ఎలాంటి గొడవలు,
Also Read..నల్లమల అడవులకు రానున్న గజరాజులు
అల్లర్లకు (ఆస్తి,ప్రాణ నష్టంకు) తావులేకుండా చాలా సమర్థవంతంగా పనిచేశారని అభినందించారు. మాకు మీ సహాయ సహకారాలు సూచనను అందించాలని తెలియజేశారు.
జిల్లా పోలీసు అదికారులు సిబ్బంది కలిసికట్టుగా పనిచెయ్యాలని ఏ చిన్న పొరపాటు జరిగిన అందరికీ చెడ్డపెరు వస్తుంది.
కావున చిన్న చిన్న సమస్యలను త్వరగా పరిస్కరించాలని పోలీసు అదికారులకు తెలియజేశారు.
ఈ సందర్భంగా బదిలీపై వెళ్తున్నా జిల్లా ఎస్పీ శ్రీ K.రఘువీర్ రెడ్డి IPS గారు మాట్లాడుతూ సుమారు 2 సంవత్సరాల 4 నెలల కాలంలో..
చేపట్టిన ప్రతి కార్యక్రమానికి పోలీస్ అధికారులు, సిబ్బంది అందించిన సహకారం అభినందనీయమని, మీరు అందించిన సేవలను ఎన్నడు మరువలేనన్నారు.
పట్టుదల ఉంటే ఎంతటి క్లిష్టమైన పరిస్తుతులనైనా అదిగమించవచ్చునని దానికి గడిచిన ఎన్నికలే ఒక నిదర్శనమని నంద్యాల జిల్లాలోని అన్నీ నియోజకవర్గాలలో..

ఏ ఎలక్షన్ లలో ఎప్పుడు జరగని విధంగా ఎలాంటి గొడవలు అల్లర్లకు (ఆస్తి,ప్రాణ నష్టంకు) తావులేకుండా రాజ్యాంగం ద్వారా ప్రజలకు..
సంక్రమించిన ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా వినియోగించుకునేలా మరియు ఎన్నికల కౌంటింగ్ ముగిసేవరకు..
జిల్లా పోలీసు అదికారులు సిబ్బంది సమిష్టి కృషి వల్లనే ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించగలిగామని..
Also Read..YABER PRO V9 WiFi 6 Bluetooth Projector
స్పెషల్ బ్రాంచ్, డిసిఆర్బి, ఆర్మ్ డ్ రిజర్వు, లా అండ్ ఆర్డరు,ఫింగర్ ప్రింట్స్ బ్యూరో, ఎపిపిలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సమర్ధవంతంగా..
నాటుసారా,గంజాయి నియత్రించేందుకు చర్యలు
పని చేయడం వలనే ఎన్నో క్రియాశీలకమైన కేసులను చేధించగలిగామని, పోక్సో, ఎస్సీ మరియు ఎస్టీ కేసుల్లో కొందరికి శిక్షపడేలా చేయగలిగాము.
శాంతి భద్రతల పరిరక్షణలో, నేరాల నియంత్రణలో, క్లిష్టమైన బందోబస్తు విధులు నిర్వహించడంలో జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది కృషి అభినందనీయమన్నారు.
జిల్లాలో పోలీస్ శాఖకు కావలసిన భవన నిర్మాణాన్ని, ఆర్ముడు రిజర్వ్ కార్యాలయాన్ని, మరికొన్ని వనరులను ఏర్పాటు చెయ్యడం జరిగిందని, సిబ్బంది సంక్షేమం కృషి చెయ్యడం జరిగిందన్నారు.
ఎలక్షన్ విధులు, రోడ్డు ప్రమాదాల నియంత్రణ, నాటుసారా, గంజాయి నియత్రించేందుకు చేపట్టిన వినూత్న కార్యక్రమాలు ప్రతి ఒక్కరి కృషి వల్ల సాధ్యం అయిందన్నారు.

అందరం కలిసికట్టుగా పనిచేసినందువల్లే ఈ విజయవంతమైన ప్రయాణం సాధ్యమైందన్నారు. దీనికి హోంగార్డు స్థాయి నుంచి అడిషనల్ ఎస్పీ వరకు ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు అని తెలిపారు.
జిల్లా వదిలి వెళ్లినప్పటికీ ఎప్పుడు ఏ సాయం కావాలన్నా తన పరిధిలో చేయడానికి సిద్ధంగా ఉంటానని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా IPS గారితో పాటు బదిలీపై వెళ్తున్న ఎస్పి K.రఘువీర్ రెడ్డి గారు, డీఎస్పీలు JV సంతోష్ గారు, Y.శ్రీనివాసరెడ్డి గారు,N. రవీంద్రనాథ్ రెడ్డి గారు, A. శ్రీనివాసరావు గారు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయం నంద్యాల.