ఆంధ్రప్రదేశ్‌లో అధికారం కోల్పోయిన YSRCP అధినేత, మాజీ CM వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో రాయబారాలు నడుపుతున్నట్లు వస్తున్న ప్రచారంపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి DK శివ కుమార్ X’ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు.
DK శివ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు
కొంత మంది అసత్య ప్రచారం చేస్తున్నారంటూ .. DK శివ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘోర పరాభవం ఎదుర్కొన్న విషయం తెలిసిందే. 175 ఎమ్మెల్యే స్థానాల్లో కేవలం 11 మాత్రమే గెలవడంతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయిన విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించారు. అనంతరం బెంగళూరులో పర్యటించారు.
Also see this news
ఆ పర్యటనలో ఉన్న సమయంలోనే వైఎస్ జగన్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ డీకే శివ కుమార్‌తో సమావేశమయ్యారని వార్తలు గుప్పుమన్నాయి.కాంగ్రెస్ పార్టీలో వైఎస్సాసీపీ విలీనానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరిగింది.
x లో డికె శివ కుమార్ ఫైర్
ఎక్స్ ట్విట్టర్ వేదికగా డీకే శివ కుమార్ పోస్టు చేశారు… నేను ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశానని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. అది తప్పుడు ఫొటోతో దుష్పచారం చేస్తున్నారని. జగన్ తో నేను ఏనాడూ ..కలవలేదని.. అటువంటి తప్పుడు వార్తలను ఎవరూ కూడా నమ్మొద్దని X లో ట్వీట్ చేశాడు. దీంతోపాటు ఓ వెబ్ పత్రికలో ప్రచురితమైన వార్తకు సంబంధించిన ఫొటోను కూడా జత చేసి ఖండించారు.
కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్‌సీపీ విలీనంపై క్లారిటీ
ఈ ఖండన ద్వారా కాంగ్రెస్ పార్టీలో .. YSRCP విలీనం అనే వార్తలకు అడ్డుకట్ట పడింది. dk శివ కుమార్ ప్రకటనతో.. వైయస్ జగన్ ఆయన కలవలేదనేది స్పష్టమైంది. దీంతో ఏపీ రాజకీయాల్లో వైయస్ జగన్, శివ కుమార్ భేటీ వార్త అసత్య ప్రచార వార్త నే అని నిరూపితమవుతోంది. ఇలాంటి అసత్య వార్తలను అధికార టీడీపీ చేయిస్తోందని YSRCP ఆరోపిస్తోంది. ఎన్నికల సమయంలోనూ ఇలాంటి అసత్య ప్రచారాలు ఎన్నో పుట్టించారని తెలిపారు.
