నేర నియంత్రణపై కర్నూలు SP విక్రాంత్ పాటిల్

Kurnool SP Vikranth patil

Kurnool SP Vikranth patil

పత్రికా ప్రకటన (27.06.2025)కర్నూలు జిల్లా…నేర నియంత్రణ, ప్రజలకు ఉత్తమ సేవలందించడమే లక్ష్యంగా పని చేయాలి … జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు.• అత్యాధునిక సాంకేతికతను వినియోగించాలి.• నేరాల కట్టడికి గట్టిగా పని చేయాలి. • జిల్లా వ్యాప్తంగా రాత్రి వేళల్లో గస్తీని పటిష్ట చేయాలి.• మహిళల పై జరిగే నేరాల నివారణ కు గట్టి చర్యలు చేపట్టాలి. శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, ప్రజలకు ఉత్తమ సేవలందించడమే లక్ష్యంగా పని చేయాలని జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు తెలిపారు.ఈ సంధర్బంగా శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని డిఎస్పీలు, సిఐలు, ఎస్సైల తో కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలీసు అధికారులతో మాట్లాడారు. కర్నూలు , పత్తికొండ , ఆదోని , ఎమ్మిగనూరు సబ్ డివిజన్ లలో ఉన్న పెండింగ్‌ కేసుల గురించి జిల్లా ఎస్పీ గారు సమీక్షించి ఆరా తీశారు.పోలీసుస్టేషన్ల వారీగా కేసుల పెండింగ్ కు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పలు సలహాలు, సూచనలు చేశారు. * అత్యాధునిక సాంకేతికతను వినియోగించి నేరాల కట్టడికి గట్టిగా పని చేయాలన్నారు.* పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించే విధంగా అన్ని స్ధాయిల అధికారులు కృషి చేయాలన్నారు. పెండింగ్ కేసులలో ముద్దాయిల అరెస్టు గురించి ఆరా తీశారు. ప్రాధాన్యత గల కేసులలో ముద్దాయిలకు శిక్షలు పడే విధంగా భాదితులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. * జిల్లా వ్యాప్తంగా రాత్రి గస్తీలు బాగా చేయాలన్నారు. (Mscd) మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైస్ తో రాత్రి గస్తీలలో అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తుల వేలి ముద్రలను సేకరించి, వాటిని నేర రికార్డులతో సరిపోల్చి నేరగాళ్ళను పట్టుకోవాలన్నారు. నేర పరిశోధనలలో నిందితులను గుర్తించడంలో వేలి ముద్రల విశ్లేషణ యొక్క ప్రాముఖ్యత చాలా ఉందన్నారు.* సిసియస్ పోలీసులు బాగా పని చేయాలన్నారు. దొంగతనాల నివారణకు , ప్రాపర్టీల రీకవరికి కృషి చేయాలన్నారు. * బేసిక్ పోలీసింగ్ లో భాగంగా పోలీసు అధికారులు పాటించాల్సిన విధులు, నైతిక ప్రమాణాలు, రోల్ కాల్స్, చట్టాన్ని అమలు చేయడంలో ప్రజలకు న్యాయం చేయాలన్నారు.* డయల్ 100 బాగా పని చేయాలన్నారు. * పోక్సో కేసులలో నివేదికలు త్వరగా సిద్దం చేయాలన్నారు. * రోడ్డు ప్రమాదాలు తగ్గించాలన్నారు. రోడ్డు ప్రమాదాల మలుపులు, ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి అడ్డుగా ఉన్న కంప చెట్లను తొలగించాలన్నారు. రేడియం స్టిక్కర్స్, బారికేడ్స్, జిగ్ జాగ్ డ్రమ్స్ , స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. * డ్రంకెన్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలన్నారు. * మిస్సింగ్ కేసులు, పోక్సో, మహిళల పై జరిగే నేరాల నివారణ పై ప్రత్యేక శ్రధ్ధ వహించాలన్నారు. ఇటువంటి విషయాల పట్ల పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండే విధంగా పోలీసు అధికారులు బ్రీఫింగ్ చేయాలన్నారు. * సచివాలయ మహిళా పోలీసుల విధుల గురించి ఆరా తీశారు. విధుల పట్ల వారి సేవలను సద్వినియోగం చేసుకునేవిధంగా చూడాలన్నారు. * అనంతరం గత నెలలో వివిధ కేసులలో ప్రతిభ కనబరచిన పోలీసు అధికారులు, పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ గారు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ నేర సమీక్షా సమావేశంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ హుస్సేన్ పీరా, లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు, డిఎస్పీలు బాబు ప్రసాద్, వెంకట్రామయ్య, ఉపేంద్రబాబు , హేమలత , ఏ ఆర్ డి ఎస్ పి భాస్కర్ రావు , సిఐలు , ఎస్సైలు పాల్గొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయం – కర్నూలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top