దేవదాయ శాఖ భూములను వదలని భూకబ్జాదారులు…?

ravi-kumar-jarnalist-01-scaled.jpg

దేవదాయ శాఖ భూములను వదలని భూకబ్జాదారులు…?

కేసులు నమోదు చేసిన మారని తీరు…ఆ భూ కబ్జాదారులకు కొమ్ముకాస్తుంది ఎవరు

ఆత్మకూరు పట్టణంలో దేవాదాయ శాఖ భూములను మింగేసేందుకు రంగం సిద్ధం

రెవెన్యూ శాఖలో రికార్డర్ గోల్ మాల్ చేస్తున్న కింది స్థాయి సిబ్బంది

ఆత్మకూరు డిసెంబర్16…సగినాల రవికుమార్ సీనియర్ జర్నలిస్టు :

ప్రభుత్వ , ప్రైవేటు భూములను కబ్జా చేసి ఏకంగా కోట్ల రూపాయలను సంపాదించాలని ఆలోచనతో దేవుని పేరుతో ఉన్న భూములను వదిలిపెట్టడం లేదు. చివరకు తెల్లవారిలోపు కోట్లాది రూపాయలకు పడగలు ఎత్తాలని కలలు నిజం చేసుకునేందుకు అది కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. చివరకు దేవాదాయ శాఖ భూములను వదలని భూకబ్జాదారులకు కొమ్ముకాస్తుంది ఎవరని.. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరు పట్టణంలో జోరుగా చర్చ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే గత ఆరు నెలల క్రితం ఆత్మకూరు పట్టణంలో తప్పుడు రెవెన్యూ రికార్డులు సృష్టించుకుని దేవాదాయ శాఖకు సంబంధించిన భూమి మాది అంటూ.. ముందుకు వెళ్లిన వారిపై కేసు నమోదు చేయడం అందరికీ తెలిసిన విషయమే అయితే ఆ విషయం కాస్త మరుగున పడడంతో మళ్లీ భూకబ్జాదారులు చెలరేగిపోయారు చివరకు గృహ నిర్మాణ శాఖ సొసైటీ భూమిని మరియు దేవదాయ శాఖ భూమిని మింగేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

వెంటనే దేవాదాయ శాఖ భూములను కాపాడుకునే విధంగా కొందరు ఆత్మకూరు పట్టణానికి చెందినవారు దేవదాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే ఈవో స్థాయి అధికారి స్థానిక పోలీస్ స్టేషన్లో ఈ భూమి మాదే అంటూ.. అన్ని హక్కులు దేవాదాయ శాఖకి ఉన్నాయంటూ స్థానిక ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. విచారణ జరిగిన కొన్ని రోజుల తర్వాత వారిపై ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆత్మకూరు పట్టణంలో అధికార పార్టీని అడ్డుపెట్టుకొని అధినేత అండదండలు పుష్కలంగా ఉండడంతో ప్రభుత్వ భూములు ప్రైవేటు భూములు మరియు దేవునికి సంబంధించిన మన్యం భూములను కబ్జా చేసే విధంగా కనిపించని నాయకుడిగా ఉంటూ.. అధికార పార్టీలో చలామనవుతున్నారు.

ఈ నాయకుడిపై ఇదివరకే పలువురు అధికార పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం లేకుండా పోయింది. చివరకు ఆ నాయకుడు భూ కబ్జాదారుల ముఠాలకు అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న తీరు ఆత్మకూరు పట్టణంలో జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి ఈ నాయకుడిని ఇలాగే వదిలిపెడితే రాయబోయే భావితరాలలో ప్రభుత్వ భూములు దేవాదాయ శాఖ భూములు కనుమరుగయ్యే దుస్థితి ఈ ఆత్మకూరు ప్రాంతంలో నెలకొందని మేధావులు తమ ఆవేదన వ్యక్తపరుస్తున్నారు.

సగినాల రవికుమార్ సీనియర్ జర్నలిస్టు :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top