వాలంటీర్లకు..మంగళం

Bad news for volunteers

Bad news for volunteers

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు

వాలంటీర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇక మంగళం పాడినట్లే వారిని తిరిగి ఉద్యోగాల లోకి తీసుకోమని రదారబడిగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పిసింది. వాలంటీర్లకు మా ప్రభుత్వంలో ఇక మనుగడ లేదని, మంత్రిబాల వీరాంజనేయ ఈస్వామి శాసనిమండలిలో ప్రకటించేవారు. 2023 సెప్టెంబర్ నుండి వ్యవస్థలో లేని వారికి జీతాలు ఎలా చెల్లిస్తారని మంత్రి అగ్రహించారు. గత ప్రభుత్వం వాలంటీర్లను రెన్యువల్ చేయలేదని మంత్రి తెలిపారు. ఎమ్మిగనూరులో కేవలం 50 ఇళ్లకే పరిమితమై వాలంటీర్లు పనిచేశారు. వీరి నియామకం వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే జరిగింది. వీరు పెన్షన్లు ఇవ్వడం ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు తెలియజేయడం చేస్తారు.

వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నన్నాళ్లు వాలంటీర్ల హవా అనే చెప్పాలి. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వాలంటిర్లపై దుమ్మెత్తి పోస్తోంది. వీదంతా అధికార పార్టీ తొత్తులని ఆరోపిస్తోంది వాలంటీర్లు విధులలో ఉంటే ఓటర్లనుప్రభావితం చేస్తారన్నది ప్రతిపక్ష పార్టీ ప్రధాన ఆరోపణ. ఇలా చీటికిమాటికి వాలంటీర్లపై ప్రతిపక్ష పార్టీ నేతలు ఆరోపణస్త్రాలను, సంధిస్తుండడంతో వాలంటీర్లకు చిర్రెత్తిపోయింది. మాపై ఎందుకు ప్రతిపక్ష పార్టీకి అంత అక్కస్సు అని వాలంటీర్లు రాజీనామా డ్రామాలు మొదలు పెట్టారు. వాలంటీర్లు సార్వత్రిక ఎన్నికల ముందు ఉద్యోగానికి రాజీనామా చేశారు స్వేచ్ఛగా అధికార పార్టీ కార్యకలాపాలలో పాల్గొంటున్నారనే ఆరోపణలు వచ్చాయి.

ఎన్నికల సమయంలో వాలంటీర్ల రాజీనామా డ్రామా అదికార పార్టీకి సహకరించడానికి వేసిన ఎత్తుగడని, రాజకీయ పరిశీలకులు భాదిస్తున్నారు. ఉద్యోగానికి రాజీనామా చేసినా తిరిగి వస్తుందన్న విషయం వాలంటీర్లకు ధీమా ఉండేది.ఆ వైద్యంతోనే రాజీనామా చేసి అధికార పార్టీకి సహకరిస్తున్నారని తెలు గుదేశం పార్టీ ఆరోముస్తాలను సంధించింది. ప్రజలు కూడా వాలంటీర్లు చెప్పినట్లు వివేటట్లు మారిపోయారు. ఈచొరవతోనే రాజీనామా చేసిన వాలంబర్లంతా తమకు కేటాయించిన 50 ఇండ్లకు వెళ్లి ప్రచారాన్ని గుట్టు చప్పుడు కాకుండా నిర్వహించినట్లు తెలుగుదేశం పార్టీ ప్రధాన ఆరోపణ.

లో లోపల ఓటర్లను ప్రలోభం : వాలంటీర్లు ఉద్యోగానికి రాజీనామా చేసిన వారంతా. లో లోపల ఓటర్లను
ప్రలోభపెట్టి, అధికార పార్టీకి ఓటు వేయకుంటే ఇళ్ల వద్దకు వచ్చి పెన్షన్ ఇచ్చేవారు ఉండరు. మీరే సచివాలయాలు దగ్గరకు వెళ్లి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పథకాలన్నీ రద్దువుతాయి. వీటన్నిటినీ ఆలోచించండి ఆలోచించే ఓటువేయండి.అంటూ వాలంటీర్లు వార్డులలో తిరుగుతూ..సుతి మెత్తగా ఓటర్లను హితబోధ చేసినట్లు సమాచారం. వాలంటీర్లు మాటలువిని వేరే పార్టీకి ఓటు వేస్తే పెన్షన్ రాదేమో అన్న భ్రమలో ఓటర్లు ఉన్నారు. అంతేకాకుండా వాలంటీర్లు చెప్పినట్లు గంగిరెద్దుల్లా తల ఊపుతున్నారు. వాలంటీర్లను మీరిప్పుడు విధులలో లేరు, కదా! ఎందుకు వార్డులో తిరుగుతున్నారని..అని అడిగితె .. అవ్వ, కాతంతో మాకు ఐదు ఏళ్లుగా అనుబంధం ఉంది. వారితో మాట్లాడింది యోగ క్షేమాలు తెలుసుకుని మరి వసున్నాం. మేము ఏపార్టీకి చెందిన వారం కాదు.అని వాలంటీ ర్లు అంటున్నారు. కానీ లో లోపల ఏమికిచేయాలో అది చేసి, ఏమిచెప్పాలో అవి చెప్పి మెల్లగా జారుకున్నారు.

10వేలు జీతం ఇస్తామన్నా లెక్కలేదు

ప్రతిపక్ష పార్టీ వాలంటీర్లను మచ్చిక చేసుకునేందుకు థాయిలాలు ప్రకటిస్తోంది. ముందు వాలంటీర్ వ్యవస్థను రూపుమాపు తామని ప్రతిపక్ష పార్టీ ప్రకటించింది. తరువాత వాలంటీర్లను కొనసాగిస్తామని హామీ ఇచ్చింది. వెంటనే వాలంటీర్లకు నెలకు 10000 జీతం ఇస్తామని ప్రతి పక్ష నేత ప్రకటించారు. కానీ దీన్ని వాలంటర్లు నమ్మడం లేదు. లిక్క చేయలేదు.అంటే ప్రతిపక్షం మీద వాలంటీర్లకు పూర్తిగా విశ్వాసం లేదని తేలిపోయింది. అందుకే ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేసి వైసిపి గెలుపు కోసం ప్రాకులాడుతున్నాం సవైసీపీ నేతలు కూడా రాజీనామా చేసిన వారికి మళ్లి ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది. దీన్నిబట్టి వైసిస్ పార్టీకి వాలంటీర్లకు మధ్య లోపాయకాయ ఒప్పందం కుదిరింది. ఏమో? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.

గుట్టునినప్పుడు కాకుండా ప్రచారం: ఉద్యోగాలకు రాజీనామా చేసిన వాలంటీర్లు గుట్టు చప్పుడు కాకుండా అధికార పార్టీ తరఫున ఎన్నికల వేళ ప్రచారం చేసినట్లు స్పష్టంగా తెదేపా నేతలకు తెలిసి పోయింది. ఇంటింటికీ వెళ్లి తాము పిన్షన్లు ఇచ్చే వృద్ధులు చికలాంగులు, వితంతు వుల న బ్రతిమలాడి అధికార పార్టీకే ఓటు వేయమని అడిగి నట్లు ఆరోపణ. దాని వల్ల వచ్చే లాభాలు ప్రభుత్వ పథకాల గురించి క్షుణ్ణంగా వివరించారని రాజకీయ పరిశీలకులు తేల్చేశారు. కేవలం ఒంటరిగా వెళ్లి వాలంటీర్లు ప్రచారం చేస్తుండడం వల్ల ఈవిషయం ఎవరికీ తెలియడం లేదు. పైగా వాలంటీర్లకు ఉద్యోగాలకు రాజీనామా చేశామన్న బీమా వారిలో అధికంగా ఉంది. ఇప్పుడు తమను ఎవడు ఏమి చేయలేదని ప్రచారాన్ని కొనసాగిసాగించారు.

also read జూనియర్ ఎన్ టి ఆర్ బామ్మర్ది నార్నే నితిన్ ఎంగేజ్మెంట్

ఎమ్మిగనూరులో 450 మంది వాలంటీర్లు

కాక పోతే నేతలు వెంటకదిలి వెళ్లడం లేదు.మొత్తానికి వాలంటీ ర్లు వైకాపాకు అండగా ఉన్నావని చెప్పకనే చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఎమ్మిగనూరులో 450 మంది వాలంటీర్లు ఉన్నారు. ఇందులో సగానికి పైగా వాలంటీర్లు ఉద్యోగాలకు రాజీనామా చేశారు. కొంతమంది విధినిర్వహణ చేయక. పోయినా? వాలంటీర్ ఉద్యోగాలకు రాజీనామా చేయడం లేదు. తాము విధిని నిర్వహించక పోంబనా ఎన్నికల తర్వాత మొత్తం జీతం వస్తుందని అనుకుంటున్నారు. ఇదే విషయాన్ని అధికారులు కూడా చెప్పినట్లు వాలంటీర్లు పేర్కొంటున్నారు.పైగా ఎన్నికల తరువాత జీతం పెరిగే ఆవకాశం ఉందని వాలంటీర్లు ఆశలు పెట్టుకున్నారు. అప్పటికే ప్రభుత్వం వాలంటీర్లకు 7500 జీతం చేసింది.

Also Read అత్తగారింటికి పోవడానికి ఆర్టీసీ బస్సు చోరీ..

ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వాలంటీర్ల కు 10,000 కు జీతం పెంచుతామని హామీలు గుప్పించారు.. ప్రస్తుతం అధికారం ఉన్న పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చిగిలేక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా?. వాలంటీర్ల గొని విరిగి నేతిలో పడ్డట్టే వాలంటీర్లు. భావించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడు నెలలకు కావస్తుంది. తొలినాళ్లలో వాలంటీ ర్లను తీసుకుంటామని, నేతలు చెబుతూ వచ్చారు. ఆ తర్వాత వాలంటీర్లపై తలోమాట మాట్లాడుతూ దాటేశారు. మొన్న జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఏకంగా ఇక వాలంటీర్ వ్యవస్థ ఉండదని చెప్పి వాలంటీర్ల ఆశలకు పుల్సాస్ పెట్టారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top