- టిడిపి కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక హామీని అమలు చేయాలి – సిపిఎం ఆత్మకూరు
టిడిపి కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు భవన నిర్మాణ కార్మికులకు పనులు కల్పించేందుకు ఉచిత ఇసుక పాలసీని అమలు చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి. యేసు రత్నం, పట్టణ కార్యదర్శి ఏ.రణధీర్, మండల కార్యదర్శి నరసింహ నాయక్ లు డిమాండ్ చేశారు. ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి వాగ్దానం ప్రకారం ఉచిత ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టి ప్రజలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా స్థానిక తహసిల్దార్ రత్న రాధిక కి మెమొరాండం ఇవ్వడం జరిగింది.. సభకు సిపిఎం పార్టీ పట్టణ నాయకులు డి రామ్ నాయక్ అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ఉండే వైయస్సార్ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు ఇసుక సమస్య సృష్టించడం వలన భవన నిర్మాణ కార్మికులు పనులు లేక అనేక ఇబ్బందులకు గురయ్యారని అన్నారు. ఎలాగైనా ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న కసితో ఆరోజు టిడిపి కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక పాలసీని అమలు చేస్తామని ఇచ్చిన హామీని నమ్మి భవన నిర్మాణ కార్మికులు ముక్కుమ్మడిగా ఓట్లు వేసి అత్యధిక సీట్ల తో టిడిపి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం జరిగిందని అన్నారు.
అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్నా నేటికీ ఇసుక సమస్య పరిష్కరించకపోవడం ఉచిత ఇసుక పాలసీని అమలు చేయకపోవడం చాలా దారుణమని అన్నారు. భవన నిర్మాణ కార్మికులకు పనులు లేక పనుల కోసం ఎదురుచూసి నిరాశతో ఇళ్లకు తిరిగి పోతున్నారని అన్నారు. అప్పులు చేసుకొని కుటుంబాలు గడపవలసి వస్తుందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన ఉచిత ఇసుక హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ నాయకులు ఏ. సురేంద్ర, సద్దాం హుసేన్, జి. నాగేశ్వరావు, నాయకులు భాస్కర్, వీరన్న, కిరణ్, గణపతి, రాజేష్, మహమ్మద్, సామేలు, మా భాష, రఫీ, ముర్తుజా, షాకీర్, రవీంద్ర, హుస్సేన్, నూర్ తదితరులు పాల్గొన్నారు.
ఉచిత ఇసుక వాగ్దానం అమలు ఎక్కడ. CPM వెలుగోడు
వెలుగోడు మండల రెవెన్యూ కార్యాలయం దగ్గర సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఉచితఇ సు క అమలు చేయాలనిధర్నా చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ వెలుగోడు మండల నాయకులు మహమ్మద్ రఫీ సిఐటియు మండల అధ్యక్షులు నాగ మోహన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉచిత ఇసుక ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్న ఉచిత ఇసుక అమలు చేయడం లేదన్నారు.గత ప్రభుత్వం అమలు చేసిన విధానాన్ని ఈ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఉచిత ఇసుక అమ్ములు కానందున భవాని నిర్మాణ కార్మికులు వలసలు వెళ్లిపోయారు గృహాలు నిర్మించుకునే లబ్ధిదారులు అధిక ధరలకు ఇసుకను కొనలేక ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు.
Also Read దగ్గు, ఆయాసం, కడుపుబ్బరం, మంటకు అతిమధురం’ వైద్యం
అలాగే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని చెప్పి ఇప్పటికీ ఒక పథకం తప్ప మిగతా అన్ని పథకాలను గాలికి వదిలేస్తుందన్నారు అధికారంలోకి రాకముందు ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక మాట కూటమి ప్రభుత్వం చెబుతుంది ప్రభుత్వ గృహాలు నిర్మించుకునే లబ్ధిదారులు ఇసుక దొరకక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆలోచించి రాబోవు రోజుల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చి మాట నిలుపుకోవాలన్నారు.లేకపోతే రాబోవు రోజుల్లో గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుందని వారు హెచ్చరించారు సిపిఎం ఈ ప్రభుత్వం పైన ఇచ్చిన వాగ్దానాలు అమలు కోసం పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు .ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వెంకటయ్య,రామకృష్ణ, జి భాష, రహంతుల్లా,ఎర్ర భాష,కిషోర్, కరిముల్లా,కృష్ణ, నాగమోహన్ తదితరులు పాల్గొన్నారు.
Also Read..Samsung 163 cm (65 inches) 4K Ultra HD Smart QLED TV