బదిలీలపై ఏలూరు సచివాలయ ఉద్యోగుల అసంతృప్తి
బదిలీలపై ఏలూరు సచివాలయం ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల కొంతమంది సచివాలయ ఉద్యోగులను ఏలూరు కమిషనర్ అకస్మాత్తుగా బదిలీ చేయడంతో సదరు సచివాలయం ఉద్యోగులు అయోమయంలో పడిపోయారు.
ఉద్యోగుల పనితీరును పరిశీలించి బదిలీలపై నిర్ణయం తీసుకోవాలి.
దీనికి గల కారణాలు లోతుగా పరిశీలించగా అధికార పార్టీ నాయకుల ఒత్తిడి వల్లే తమను ఇతర సచివాలయాలకు దూరంగా బదిలీ చేశారని అనుమానాలు వారిలో కలుగుతున్నాయి.
తమకు అనుకూలంగా లేని సచివాలయ ఉద్యోగులను బదిలీ
స్థానికంగా ఉన్న చోట నాయకులకు అనుకూలంగా లేని ఉద్యోగులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి ఇతర సచివాలయాలకు బదిలీ చేశారని వాపోతున్నారు.
ఉద్యోగుల పనితీరును బట్టి అధికారులు నిర్ణయాలు తీసుకోవాలే గాని పార్టీ నాయకుల మాటలు విని నిర్ణయం తీసుకోవడంతో తాము ఇబ్బందులకు గురి అవుతామని వారు వాపోతున్నారు.
సచివాలయ ఉద్యోగుల అసంతృప్తి
సచివాలయం వ్యవస్థ గత ప్రభుత్వంలో ఏర్పడినప్పటి నుండి తాము వివిధ హోదాల్లో ఆ ప్రాంత ప్రజలకు అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంలో
తమది ముఖ్యమైన పాత్ర అని గతంలో అధికారులే కితాబ్ ఇచ్చిన సంగతి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు కోరుతున్నారు.
తమ ద్వారా ప్రజలు ఏదైనా ఇబ్బందులు కలిగి ఉంటే వారి ఫిర్యాదుతో తమపై అధికారులు బదిలీ చేస్తే తాము దానికి అంగీకరిస్తామని
అంతేగాని రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో ఈ విధమైన నిర్ణయాలు తీసుకోవడం సరైనది కాదని ఉద్యోగులు మనొ వేదనకు గురి అవుతున్నారు.
కక్షపూరితంగానే సచివాలయ ఉద్యోగులను బదిలీ
ఏలూరు నగరంలో కొన్ని డివిజన్లో వైసిపికి అధిక ఓట్లు పోలవడంతో దీన్ని గల కారణాలు సచివాలయాల ఉద్యోగులు పై
అనుమానంతో ఈ విధమైన కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని వారు భావిస్తున్నారు.
గ్రామ, వార్డు సచివాలయాల్లో 9 విభాగాల ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఏలూరు నగరంలో 79 గ్రామ, వార్డు సచివాలయాలున్నాయి.
వాటిల్లో 14 సచివాలయాలో కొంతమందిని మాత్రమే మినహాయించి బదిలీ చేయడంపై సచివాలయం ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.
పలుకుబడి ఉన్న ఉద్యోగులు ఈ బదిలీలను ఆపుకుంటున్నారని అవి లేనివారు కొత్త ప్రాంతంలోకి వెళ్లి విధులు నిర్వహించాల లేదా అనే సంశయంలో పడిపోయారు.
గత ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ వ్యవస్థ ద్వారా తమకు ఉపాధి లభిస్తుందని భావనతో తమ జీతాలు తక్కువ అయినప్పటికీ విధుల్లో చేరామని
కొంతమంది చేసిన పొరపాట్లకు అనుమానంతో ప్రతి ఒక్కరిని ఈ విధంగా బదిలీలు చేయడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంపై ప్రభుత్వ అధికారులు తగిన చర్యలు తీసుకొని తమకు సరైన న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.Buy a good pen drive
సచివాలయ వ్యవస్త ఏర్పడిన తర్వాత మేము అందరికీ అందుబాటులో ఉండి ప్రజల అవసరాలను మెరుగు పరిచామని
అలాగే సచివాలయనికి వచ్చన ప్రతి ఒక్కరికీ పార్టీలకు అతీతంగా పనిచేశామని అన్నారు. పక్షపాతం
లేకుండా పనిచ్చేశాం
AlsoRead నల్లమలకు అడవి దున్న – Adavi Dunna