అందంలోనూ.. బలంలోనూ.. పెద్ద పులికి సాటిరాగల మరో జంతువు భూమిపై కనిపించదు. అది నడుస్తుంటే రాజనం తొణికి సలాడుతుంది. మనిషి క్రూరత్వం బారిన పడుతూ చివరకు భూమిపై అంతరించి పోతున్న జాతుల జాబితాలో చేరి రెడ్ డాటా బుక్ లో పులి పేరు చేరడం మానవ మనుగడకే ప్రమాదకరం. ఈ అపురూప మైన పులిని సంరక్షిస్తే అది పర్యావరణ అభివృద్ధికి ఎంతో దోహద పడుతుంది.
భూమిపై మానవ మనుగడ సజావుగా సాగ దానికి భూ విస్తీర్ణంలో కనీసం 33 శాతం అడవులు ఉండాలి. కాని ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడా ఈ పరిస్థితి లేదు. అందుకే పర్యావరణాన్ని కాపాడేం దుకు అన్ని ప్రభుత్వాలు అనేక మార్గాలు అన్వేషిస్తు న్నాయి. మనదేశంలో పర్యావరణ పిరమిడ్కు పెద్ద పులిని అగ్ర సూచిగా గుర్తించి ఆ మేరకు పర్యావర ణాన్ని అభివృద్ధి పరుస్తున్నారు. పులికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం. పులి ఆహార జంతువుల సంఖ్య పులుల నిష్పత్తితో తగ్గకుండా చూడడం, పులి ఆహార జంతువుల కోసం గడ్డి మైదానాలను విస్తరించడం, పులి విహారానికి ఆటంకం కలుగకుండా అడవుల్లో మానవ సంచారాన్ని నియంత్రించడం వంటి పలుచర్యలు చేపడుతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం పెద్ద పులుల సంఖ్య 4 వేలు మాత్రమే ఉండగా వాటిలో 75 శాతం ఒక్క భారత దేశంలోనే 3.167గా ఉండడం గమనార్హం. ఏటా పులుల సంఖ్య రేటు 6 శాతం పెరుగుతుండడం విశేషం. ఇటీవల ప్రకటించిన చత్తీస్ఘడ్ లోని గురుదాసిదాస్ టైగర్ రిజర్వ్ తో కలిపి భారత దేశ వ్యాప్తంగా మొత్తం 53 పెద్ద పులుల అభయారణ్యాలున్నాయి. విస్తీర్ణం రీత్యా రెండు తెలుగు రాష్ట్రాలలో విస్తరించి ఉన్న నాగా ర్జున సాగర్ శ్రీశైలం పెద్ద పులుల అభయారణ్యం (ఎన్ఎన్టీఆర్) దేశంలోనే అతి పెద్దది (3568 చ.కి. మీ) 2022-23 అధికారుల అంచనా మేరకు ఎన్. ఎన్టీఆర్లో 73 78 పులులు ఉండవచ్చు తెలు స్తోంది. అయితే అధికారికంగా ఇంకా వెల్లడించ లేదు. ఆటవీ సిబ్బంది పర్యవేక్షణ, మానవ వనరు లను అత్యంత ప్రతిభావంతంగా వినియోగించు కోవడం వంటి అంశాల కారణంగా ఇక్కడ పులులు క్రమేపి పెరుగుతున్నాయి. 2014లో ఈ అంశాలపై ఎన్టీసీఏ అత్యున్నత ప్రతిభా అవార్డును అప్పటి ఎన్ఎసీఆర్ ఎఫ్.రాహుల్ పాండే అందుకున్నారు.
Also Read నల్లమలలో పెద్ద పులి సంతతి పెరుగుతుందా..? తరుగుతుందా..!
లెక్క పక్కాగా..పెద్ద పులుల పాద ముద్రలు సేకరించి వాటి ఆధారంగా పులు సం ఖ్యను అంచనా వేయ డాన్నే స్టాండర్డ్ పగమార్క్ ఎన్యూమరేషన్ పద్ద తిగా పిలుస్తారు. పులుల అంచనాకు పూర్తిస్థాయి సాంకేతిక పరిజ్ఞాణాన్ని కూడా వినియోగించుకుం టున్నారు. అడవుల్లో ఇన్ఫ్రారెడ్ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిల్లో పడే చిత్రాల ఆధారంగా పులుల చారలను విశ్లేషిస్తారు. వీటి ఆధారంగా వాటికి పేర్లు పెట్టి పర్యవేక్షిస్తుంటారు.
పులి సామ్రాజ్యం విస్తరించేలా..
నల్లమలలలోని శ్రీశైలం నుంచి శేషాచలం అడ వుల వరకు పెద్దపులి ప్రస్తానం కొనసాగాలని ఆకాంక్షించిన ఆటవీ అధికారులు ఆదిశగా కార్య క్రమాలు చేపట్టారు. శ్రీశైలం, గుండ్ల బ్రహ్మేశ్వ రం, నంద్యాల అటవీ డివిజన్, రుద్రవరం రేంజ్, వైఎస్సార్ జిల్లా లంకమల వరకు పెద్దపులుల ప్రస్తానం కొనసాగింది. ఈ నేపథ్యంలో పులులు స్వేచ్ఛగా సుదూర ప్రాంతాలకు తరలి వెళ్లడానికి తగిన వసతులు కల్పించడమే శ్రీశైలం- శేషా చలం పెద్దపులుల కారిడార్ ఆలోచనకు నాంది చర్యలు చేపడుతున్నారు. చర్య పలికి
ఏకాంతానికి అనుకూలంగా..పులుల సమాగ సమయమైన జూలై మొదటి వారం నుంచి సెప్టెంబర్ చివరి వారం వరకు ఆడవుల్లో జన సంచారాన్ని అటవీ శాఖ నిలుపుదల చేసింది. గిరి జనులు కూడా ఈ సమయాల్లో చిన్నతరహా ఆటవీ ఉత్పత్తుల కోసం అడవుల్లో తిరగకుండా చర్యలు చేపట్టారు. బైర్లూటీ నల్లమల జంగిల్ క్యాంప్, పచ్చ ర్ల, తుమ్మల బయలు ఎకో టూరిజం రిసార్ట్స్ ఆన్ లైన్ బుకింగ్ నిలిపి వేశారు. అంతే కాకుండా దట్టమైన అడవుల్లో ఉన్న ఇష్టకామేశ్వరి, నాగలూటి వీరభద్రాలయం, రుద్రకోడు, గుండ్ల బ్రహ్మేశ్వ రానికి వెళ్లే భక్తులకు ఆటవీ ప్రవేశం నిలిపివేశారు.
పులి విశేషాలు.. పులి మనిషిని వాసన ద్వారా గుర్తించి అతని కంట పడకుండా తప్పుకు తిరుగుతుంది. ఆహారం కోసం పులి ఎపుడు మనిషిపై దాడి చేయదు. (ఏదో కారణంగా గాయపడి వేటాడలేని దుస్థితిలో,వృద్ధాప్య స్థితిలో అరుదుగా మనుషులను ఆహారం కోసం చంపిన ఘటనలున్నాయి). ఇది చాలా సిగ్గరి జంతువు. పులుల సంగమ సమయంలో మనిషి అలికిడి విన్నా చాలు అవివెంటనే సమాగం నుంచి దూరమవుతాయి. లేత గర్భంతో ఉన్న ఆడపులులకు మానవ కలకలం వినపడినా సరే బెదురుతో గర్భస్రావం అవుతుంది. పులి కనీసం 10 నుంచి 20 సార్లు వేటాడటం ప్రయత్నస్తే ఒకసారి మాత్రమే వేట జంతువును చంపగ లుగుతుంది. తన బరువుకంటే రెట్టింపు బరువు ఉండే ఆవులు, బర్రెలను మెడ పట్టుకుని చాలా సునా యాసంగా పాదల్లోకి ఈడ్చుకు వెళుతుంది. సంవత్సరానికి ఒక పులి 50 నుంచి 60 జంతువులను తన ఆహారం కోసం వేటాడుతుంది. సాధారణంగా ఒక మగ పులి తన ఆహార లభ్యతను బట్టి తన విహార ప్రాంతాన్ని గుర్తిస్తుంది. నల్లమలలో ఒక పులి సాధారణంగా తన ఆధీన ప్రాంతం (టెరిటరీ) 50 చ.కి.మీ గా ఉంచు
కుంటుంది. అయితే తన భాగస్వామి కోసం, ఆహారం కోసం 200 చ.కిమీ పరిధి వరకు విహరిస్తుంది.
(ఎన్ఎన్టీఆర్ ) రిధిలో పులుల సంఖ్య పెరుగుదల ఇలా..
సంవత్సరం పులుల సంఖ్య
2014-15 37
2015-16 40
2016-17 46
2017-18 46
2018-19 47
2019-20 63
2020-21 70
2022-23 78 (అంచనా)