నకిలీ ప్రతివాదితో కుమ్మక్కై భూ వివాదంలో అనుకూల ఉత్తర్వులు!
భూ వివాదంలో న్యాయస్థానం నుంచి మోసపూరితంగా అనుకూల ఉత్తర్వులు పొందిన వ్యక్తిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
పిటిషనర్ దుర్బుద్ధిపై సుప్రీంకోర్టు ఆగ్రహం తీర్పు రద్దు… దర్యాప్తునకు ఆదేశం
దిల్లీ: భూ వివాదంలో న్యాయస్థానం నుంచి మోసపూరితంగా అనుకూల ఉత్తర్వులు పొందిన వ్యక్తిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆరు నెలల క్రితం వెలువరించిన ఆ తీర్పును రద్దు చేయడంతో పాటు ఆ ఉదంతంపై దర్యాప్తు జరిపి మూడు వారాల్లోగా నివేదిక సమర్పించాలని కోర్టు రిజిస్ట్రీని జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ ధర్మాసనం ఆదేశించింది. నిందితుడిపై ఎఫ్ఎఆర్ దాఖలు చేస్తామని హెచ్చరించింది. భూవివాదంలో బిహార్కు చెందిన పిటిషనర్, ప్రతివాది మధ్య రాజీ కుదిరిందని తెలియజేయడంతో 2024 డిసెంబరు 13న సుప్రీంకోర్టు ధర్మాసనం… పట్నా హైకోర్టు, ముజఫర్పుర్ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేస్తూ తీర్పువెలువరించింది. నకిలీ ప్రతివాది తరఫున కేవియట్ కూడా దాఖలుకావడంతో ప్రతివాదిని అప్రమత్తం చేసేందుకు నోటీసు కూడా జారీ కాలేదు. అయితే, ఆరు నెలల తర్వాత సుప్రీంకోర్టు వెబ్సైట్లో ఈ కేసు తీర్పును గమనించిన అసలు ప్రతివాది జైస్వాల్ జరిగిన మోసాన్ని గుర్తించి కోర్టును ఆశ్రయించారు. వాస్తవాలను దాచి, మోసపూరితంగా నకిలీ ప్రతివాదిని అడ్డుపెట్టుకుని బిపిన్ బిహారీ సిన్హా అనుకూల తీర్పుపొందారని వివరించారు. తాజా విచారణ సందర్భంగా…. గతంలో మోసాన్ని గుర్తించి కోర్టును ఆశ్రయించారు. వాస్తవాలను దాచి, మోసపూరితంగా నకిలీ ప్రతివాదిని అడ్డుపెట్టుకుని బిపిన్ బిహారీ సిన్హా అనుకూల తీర్పుపొందారని వివరించారు. తాజా విచారణ సందర్భంగా…. గతంలో ఈ కేసు తరఫున హాజరైన ఓ న్యాయవాది కూడా నకిలీ అని తేలింది. ఈ మోసంపై సుప్రీంకోర్టు ధర్మాసనం మండిపడింది. న్యాయస్థానాన్నే తప్పుదారిపట్టించిన వ్యక్తి దుర్బుద్ధిని సహించరాదంటూ దర్యాప్తునకు ఆదేశించింది.