దస్తగిరి స్వామి దర్గాలో ఫాతిహాలు సమర్పించిన.. MLA కాటసాని

MLA-Katasani-delivered-Fatihas-at-Dastagiri-Swami-Dargah.jpg

బనగానపల్లె పట్టణ శివారులోని దస్తగిరి స్వామి దర్గాలో ప్రత్యేక ఫాతిహాలు సమర్పించిన నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు….

కమలాపురం దర్గా పిఠాధిపతులను శాలువాకప్పి పూలమాలలతో సత్కరించిన బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు…..

బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారికి పూలమాలతో సత్కరించిన కమలాపురం దర్గా పీఠాధిపతులు…..

బనగానపల్లె పట్టణ శివారులోని దస్తగిరి స్వామి దర్గాలో బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు ప్రత్యేక ఫాతిహాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కమలాపురం దర్గా పీఠాధిపతులు హాజరయ్యారు. ముఖ్య అతిథులు అయిన దర్గా పిఠాధిపతులను శాలువా కప్పి పూలమాలలతో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు సత్కరించారు.

ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు మాట్లాడుతూ కమలాపురం దర్గా పీఠాధిపతుల ఆశీస్సులు తమకు అందించాలని బనగానపల్లె నియోజకవర్గం అభివృద్ధికి ఎటువంటి ఆటంకం కలగకుండా ఆశీర్వదించాలని కోరారు. కమలాపురం దర్గా కు చెందిన భక్తులు బనగానపల్లె నియోజకవర్గంలో చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారని చెప్పారు. భక్తులకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రిన్స్ టైలర్ భాష వార్డ్ మెంబర్ సురేష్ పాన్ బీడ వళి, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top