భీముని పాడులో MLA కాటసాని సమక్షంలో.. వంద కుటుంబాలు TDPనీ వీడి YCPలో చేరిక

Katasani-Ramireddy.jpg

నంద్యాల జిల్లా

బనగానపల్లె నియోజకవర్గం లో టీడీపీ పార్టీ కి షాక్…..

వంద కుటుంబాలు టీడీపీ పార్టీ నీ వీడి వైయస్సార్ పార్టీ లో చేరిక….

కోవెలకుంట్ల మండలం భీముని పాడు గ్రామంలో బనగానపల్లె నియోజకవర్గం శాసన సభ్యులు కాటసాని రామిరెడ్డి సమక్షం లో కందుకూరి అనిల్ రెడ్డి ,మాజీ సింగిల్ విండో అధ్యక్షురాలు కందుకూరి రామ సుబ్బమ్మ,మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు గోదుల ఓబుల్ రెడ్డి లతో పాటు వంద కుటుంబాలు టీడీపీ పార్టీ నీ వీడి వైయస్సార్ పార్టీ లో చేరిక……

వైయస్సార్ పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు…..

వైయస్సార్ పార్టీ అందిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీడీపీ పార్టీ నీ వీడి వైయస్సార్ పార్టీ లో చేరిక…..

వైయస్సార్ పార్టీ లో చేరిన వారికి సముచిత స్థానాన్ని కల్పిస్తాం…..ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు

కోవెలకుంట్ల మండలం భీముని పాడు గ్రామంలో కందుకూరి అనిల్ రెడ్డి ,మాజీ సింగిల్ విండో అధ్యక్షురాలు కందుకూరి రామ సుబ్బమ్మ,మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు గోధుల ఓబుల్ రెడ్డి లతో పాటు మరో వంద కుటుంబాలు బనగానపల్లె నియోజకవర్గం శాసన సభ్యులు కాటసాని రామిరెడ్డి గారి ఆధ్వర్యం లో టీడీపీ పార్టీ నీ వీడి వైయస్సార్ పార్టీ లో చేరారు. కందు కూరి అనిల్ రెడ్డి,మాజీ సింగిల్ విండో అధ్యక్షురాలు రామ సుబ్బమ్మ,మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు గోధుల ఓబుల్ రెడ్డి,కందుకూరి లలితా రెడ్డి, గోధుల ప్రవీణ్ కుమార్ రెడ్డి, గోధుల శశి కాంత్ రెడ్డి, గోధుల హర్షవర్ధన్ రెడ్డి, జమాల్ వలి,మురళీమోహన్ రెడ్డి,మంగలి సురేంద్ర,బోయ రాం మోహన్,దేశి రెడ్డి హుస్సేనయ్య, అషిరెడ్డి మధు సుధన్ రెడ్డి, తలారి నాగార్జున,చాకలి ఓబులేసు,చాకలి శ్రీను,తలారి వెంకటప్ప నాయుడు,పల్లె రాజ శేఖర్ రెడ్డి లతో పాటు మరో వంద కుటుంబాలు బనగానపల్లె నియోజకవర్గ శాసన సభ్యులు కాటసాని రామిరెడ్డి గారు వైయస్సార్ పార్టీ కండువా కప్పి పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు.మన ముఖ్య మంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు పార్టీ లకు,కులాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించడం జరుగుతుంది అని అందుకే వాటికి ఆకర్షితులై ఈ రోజు వంద కుటుంబాలు టీడీపీ పార్టీ నీ వీడి వైయస్సార్ పార్టీ లోకి రావడం జరిగింది అని చెప్పారు.

ఈ సందర్భంగా బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తో దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అయినప్పటికీ ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కష్టకాలం లో కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించిన ఘనత మన ముఖ్య మంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పారు.అంతే కాకుండా వైయస్సార్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత పాదయాత్రలో ఏవైతే హామీలు వైయస్ జగన్ గారు ఇచ్చారో వాటిలో ఇప్పటికే 98 శాతం మేర నెరవేర్చిన ఘనత ఒక్క వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్పారు.పార్టీ లకు,కులాలకు,మతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించిన నాయకుడు మన ముఖ్య మంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్పారు.ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ లో జగనిజం సునామీలో చంద్ర బాబు వారి నాయకులు కొట్టుకు పోతారు అని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు తెలిపారు.ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా ప్రజలు వైయస్సార్ పార్టీ నీ అఖండ మెజార్టీ తో గెలిపించాలని ఎదురు చూస్తున్నారు అని చెప్పారు.ఈ కార్యక్రమం లో జిల్లా వైయస్సార్ పార్టీ ప్రచార కార్యదర్శి సిద్దం రెడ్డి రాం మోహన్ రెడ్డి,కోవెలకుంట్ల మండల వైయస్సార్ పార్టీ కన్వీనర్ భీం రెడ్డి ప్రతాప్ రెడ్డి,కోవెలకుంట్ల పట్టణ ఉప సర్పంచ్ GCR సూర్యనారాయణ రెడ్డి,గువ్వల రామకృష్ణా రెడ్డి,భీముని పాడు వైయస్సార్ పార్టీ నాయకులు వీరా రెడ్డి,నరసింహారెడ్డి,ప్రతాప్ రెడ్డి,కంపమల్ల లోకేశ్వర్ రెడ్డి, వెలగటురు సుధాకర్ రెడ్డి,వైయస్సార్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top