నంద్యాలలోని స్థానిక ఆర్కే అకాడమీ స్టేడియంలో నిర్వహించిన రాయలసీమ అంతర్ కళాశాల మహిళా పురుషుల షటిల్, టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ పోటీలలో..
ప్రభుత్వ డిగ్రీ కళాశాల బనగానపల్లె జట్టు టేబుల్ టెన్నిస్ ఫైనల్ లో చేరి ఉస్మానియా డిగ్రీ కళాశాల జట్టు పై విజయం సాధించింది.
Also Read..నల్లమల అడవులకు రానున్న గజరాజులు
ఈ విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఐ స్వర్ణతా ఫిజికల్ డైరెక్టర్ విజయ కుమారి మరియు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు.
కళాశాల ఫిజికల్ డైరెక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ టేబుల్ టెన్నిస్ లో మొదటి స్థానం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని ఇలాంటి విజయాలు ఇంకా ఎన్నో అందుకొని క్రీడల పరంగా ఉద్యోగం సాధించి మంచి స్థానంలో ఆకాంక్షించారు.
కోచ్ సయ్యద్ హుస్సేన్ మాట్లాడుతూ క్రిడాకారులు కళాశాలకు పూర్వ వైభవాన్ని తీసుకొని వచ్చారని కళాశాల పేరును రాష్ట్ర జాతీయ స్థాయిలో కూడా తెలిసే విధంగా ఉంచాలని ఆకాంక్షించారు.