అంతుచిక్కని వ్యాధి తో చిన్నారి ఆక్రందన.. ఎమ్మెల్యే శిల్పా ఆపన్న హస్తం

MLA Silpa Apanna Hastam

MLA Silpa Apanna Hastam

అంతుచిక్కని వ్యాధి తో చిన్నారి ఆక్రందన

ఎమ్మెల్యే శిల్పా ఆపన్న హస్తం

వైద్య ఖర్చులకు ప్రతి నెలా రు 2000 సాయం

కార్యక్రమం… గడప గడప కు మన ప్రభుత్వం..
ఆత్మకూరు పట్టణం లోని ఈడిగ పేట..ప్రాంతం లో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పర్యటిస్తున్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు అందరి మాదిరే కళ్యాణి అనే మహిళ ఇంటికి కూడా ఎమ్మెల్యే వెళ్లారు.

ఆమె ఒడిలో 4 ఏళ్ల బాలుడు ఉన్నాడు.
సంక్షేమ పథకాల ద్వారా ఎంత లబ్ది పొందారు? ఆ మొత్తం చేరిందా లేదా అని అడిగి అక్కడి నుంచి వేరే ఇంటికి కదలొచ్చు.
అయితే ఆమె ఒడిలో ఉన్న బాలుడు అదే పనిగా ఏడుస్తూ ఉండటం ఎమ్మెల్యే శిల్పా గమనించారు. ఆ చిన్నారి ఒళ్ళంతా బొబ్బలెక్కి చీము, నెత్తురు తో అల్లాడుతుండటం చూసి బాబు కు ఏమైందమ్మా అని అడిగారు. అంతే ఆ తల్లి కంట కన్నీరు పెల్లుబికింది.

ఆ ఇంటి కన్నీటి గాధ

నీలకంఠేశ్వర గౌడ్, కళ్యాణి దంపతులది నిరుపేద కుటుంబం. అతడు కారు డ్రైవర్ గా చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
వారికి మొదట ఒక పాప పుట్టింది.
పుట్టినప్పటి నుంచి అంతు చిక్కని చర్మ వ్యాధి. ఒళ్ళంతా బొబ్బలు ఎక్కడం, చీము కారడం. వైద్యానికి అందని ఈ వ్యాధి తోనే కోలుకోలేక 4 ఏళ్ల లోపే మృతి చెందింది.
ఆ తర్వాత ఈ బాబు పుట్టాడు. చిత్రం గా అదే వ్యాధి పట్టి పీడిస్తోంది. 6 ఏళ్ళు నిండే వరకు సరైన చికిత్స చేయడానికి కుదరదు అని డాక్టర్లు తేల్చారు. అంతవరకూ ఎంతో కొంత ఉపశమనం కలిగించే అందుకోసమే వైద్యం అందిస్తున్నారు.
అయితే ఈ చికిత్స లకు అయ్యే ఖర్చు భరించడం వారి అరకొర సంపాదన లో భారం గా మారింది.
ఇదంతా విని మనసున్న మారాజు శిల్పన్న ఊరుకుంటాడా..?
చిన్నారి వైద్య ఖర్చులకు ప్రతి నెలా 2000 రూపాయలు తన సొంత నిధులు సాయం గా ప్రకటించి ఆశీర్వదించాడు.
శిల్పన్న చల్లని దీవెనలతో ఆ నాలుగేళ్ల చిన్నారి ఆరోగ్యం కుదుటబడి నిండు నూరేళ్లు వర్ధిల్లు గాక….

Also Read నల్లమలకు అడవి దున్న

Buy it a good pen drive

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top