నంద్యాల : జగన్ రెడ్డి 2019లో ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారం తెచ్చుకొని ఏపీని చిన్నాభిన్నం చేశాడని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి సంచలన వాఖ్యలు చేశారు.
జగన్ సిగ్గుండాలి రాజకీయాల నుండి విరమించుకోవాలి జగన్ కు ప్రజలే బుద్ధి చెప్పి 11 సీట్లు ఇచ్చారు : బైరెడ్డి రాజశేఖరరెడ్డి
జగన్ ని తండ్రి రాజశేఖర్ రెడ్డే నమ్మలేదు జగన్ కు వైయస్సార్ కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది : బైరెడ్డి రాజశేఖరరెడ్డి
కక్ష ఉన్నవాడు కూడా రాష్ట్రాన్ని ఇలా చేయడు జగన్ అహంకారం,పొగరుకు ప్రజలు ఇలా తీర్పునిచ్చారు : బైరెడ్డి రాజశేఖరరెడ్డి
వైఎస్ ర్ సీఎం గా ఉంటేనే జగన్ అంత దోపిడీ చేశాడంటే జగనే సీఎం అంటే ఇంకెంత దోపిడీ చేసి ఉంటాడు : బైరెడ్డి రాజశేఖరరెడ్డి
శ్రీశైలానికి రైల్వే మార్గం విమానాశ్రయం ఏర్పాటు చేయమని ప్రధాన మంత్రి మోదీకి పార్లమెంటు సభ్యురాలు వినతిపత్రం శబరితో ఇవ్వనున్నాము : బైరెడ్డి రాజశేఖరరెడ్డి
చెడపకురా చెడేవు అన్నారు అంతా చెడగొట్టాడు జగన్ చెడిపోయాడు : బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి
శ్రీశైలం మహాక్షేత్రానికి రైల్వే మార్గంతోపాటు ఎయిర్ పోర్ట్ సదుపాయం కల్పించాలని అందుకు సంబందించిన సమాచారాన్ని లేటర్ పూర్వకంగా ప్రధానమంత్రి మోదికి నంద్యాల పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శభరితో సమాచారం అందించి రైల్వే మార్గానికి విమానాల రాకపోకలకు కృషి చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజి ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి మీడియాతో మాట్లాడారు రైల్వే సదుపాయం విమాన సర్వీసులు భక్తులకు ఏర్పడితే తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగా శ్రీశైలం అభివృద్ధి చెందుతుందన్నారు దేశ విదేశాలలో నుంచి భక్తులు శ్రీశైలం వచ్చేందుకు కూడ వీలుంటుందని బైరెడ్డి రాజశేఖరరెడ్డి అభిప్రాయం పడ్డారు అందుకు సంబంధించిన ఏర్పాట్లను నంద్యాల పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శభరితో చర్చించినట్లు బైరెడ్డి రాజశేఖరరెడ్డి తెలిపారు బైరెడ్డి శభరి పార్లమెంట్ ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నామని బైరెడ్డి రాజశేఖరరెడ్డి మీడియాతో మాట్లాడారు …
వైఎస్ రాజశేఖరరెడ్డికి జగన్ మోహన్ రెడ్డికి నక్కకు నాగాలోకానికి ఉన్నంత తేడా ఉందని స్వయానా తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డికే జగన్ మోహన్ రెడ్డి మీద నమ్మకం లేదని బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఎద్దేవా చేశారు
2019 ఎన్నికలలో జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేశాడు కాబట్టే ఈ ఎన్నికలలో ప్రజలే తిరిగి జగన్ మోహన్ రెడ్డికి బుద్ది చెప్పారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి శ్రీశైలంలో మీడియాతో అన్నారు