బనగానపల్లె పట్టణం నేలమఠం లో శాలివాహన సంఘం ఆధ్వర్యం లో కార్తీక వన భోజన మహోత్సవాలు…
శాలివాహన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన బనగానపల్లె ఎమ్మేల్యే కాటసాని రామిరెడ్డి గారు,ఆంధ్ర ప్రదేశ్ శాలివాహన రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పురుషోత్తం ….
కలిసి కట్టుగా సంఘాన్ని అభివృద్ది పథంలో తీసుకువెళ్ళాలి…..
యాగంటి లో కుమ్మరి శాలివాహన సంఘానికి స్థలాన్ని కేటాయిస్తానని హామీ ఇచ్చాను….
ఆ హామీలో భాగంగానే త్వరలోనే కేటాయిస్తాం……
కవయిత్రి మొల్ల విగ్రహాన్ని పట్టణంలో ఏర్పాటు చేస్తాం……
బనగానపల్లె పట్టణం లో నేల మఠం లో బనగానపల్లె నియోజకవర్గం శాలి వాహన సంఘం ఆధ్వర్యం లో కార్తీక వన భోజన ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమం నకు ముఖ్య అతిథిగా బనగానపల్లె ఎమ్మేల్యే కాటసాని రామిరెడ్డి గారు,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ పురుషోత్తం లు హాజరు అయ్యారు.
.కార్తీక వన భోజనానికి పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.అనంతరం శాలి వాహన సంఘం లో మంచి మార్కు లు సాధించిన విద్యార్థులకు అతిథులతో బహుమతులు అందచేశారు.
నియోజకవర్గ శాలి వాహన సంఘం ఆధ్వర్యం లో ఎమ్మేల్యే కాటసాని రామిరెడ్డి గారికి,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర
శాలి వాహన కార్పొరేషన్ చైర్మన్ పురుషోత్తం లను శాలువ కప్పి పూలమాలలతో సత్కరించారు.
Also Read..YABER PRO V9 WiFi 6 Bluetooth Projector
ఈ సందర్భంగా ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర శాలి వాహన కార్పొరేషన్ చైర్మన్ పురుషోత్తం మాట్లాడుతూ పేదల పక్షపాతి అయిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు
నవరత్నాలు కార్యక్రమం ద్వారా..ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ అందించడం జరుగుతుందని చెప్పారు.చేతి వృత్తులు వారికి జగనన్న చేదోడు ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని
అలాగే కుమ్మరి కులస్థులకు కూడా చేదోడు పథకం ద్వారా ఆర్థికంగా ఆదుకోవాలని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని
వాటిని సాధ్య సాధ్యాలను పరిశీలించడం జరుగుతుందని చెప్పారు.అలాగే తెలుగు లో రామాయణం రచించిన శాలి వాహన కులానికి చెందిన మొల్లమాంభ కు
టీటీడీ దేవస్థానం వారి ప్రత్యేకత ఇవ్వాలని కోరడం జరిగిందని అందుకు వారు కూడా సముఖంగా స్పందించారు అని చెప్పారు.
అలాగే స్థానిక శాసన సభ్యులు కాటసాని రామిరెడ్డి గారు కూడా శాలివాహన సంఘం లోని ప్రజలకు రాజకీయంగా ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుందని
ఎమ్మేల్యే కాటసాని రామిరెడ్డి
కాబట్టి అలాంటి నాయకునికి మనం ఎల్లప్పుడూ అండగా వుండాలని తెలిపారు.ఈ సందర్భంగా బనగానపల్లె ఎమ్మేల్యే కాటసాని రామిరెడ్డి గారు మాట్లాడుతూ
నియోజకవర్గం లో సమిష్టిగా ముందుకు వెళుతున్న సంఘం శాలివాహన సంఘం అని వారందరూ సమిష్టిగా వుంటు అభివృద్ది పథంలో వెళుతున్నారు
Also Read..నల్లమల అడవులకు రానున్న గజరాజులు
అని అలాంటి వారికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ వుంటాయి అని చెప్పారు.గత కార్తీక మాసం లో యాగంటి లో శాలివాహన సంఘానికి
స్థలం కేటాయిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని ఆ హామీల్లో భాగం గానే యాగంటి లో స్థల సేకరణ జరుగుతుందని త్వరలోనే హామీలో భాగం గా
స్థలాన్ని కేటాయించడం జరుగుతుందని చెప్పారు.అలాగే బనగానపల్లె పట్టణం లో రోడ్డు వెడల్పు కార్యక్రమం జరుగుతుందని అందులో
కవయిత్రి మొల్లమాంభా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. అందరూ కలిసి కట్టుగా వుండి రాజకీయాలకు అతీతంగా అభివృద్ది పథంలో ముందుకు వెళ్ళాలని ప్రజలకు పిలుపు నిచ్చారు.
ఈ కార్యక్రమం లో బనగానపల్లె నియోజకవర్గ అధ్యక్షుడు కుమ్మరి సురేష్,ప్రధాన కార్యదర్శి శివరామ మద్దిలేటి,బనగానపల్లె నియోజకవర్గ
గౌరవ అధ్యక్షుడు బాబయ్య,జిల్లా అధ్యక్షుడు సోమేష్,అవుకు మండల అధ్యక్షుడు రఘురాం ,కొలిమిగుండ్ల మండల అధ్యక్షుడు నాగభూషణం,
సంజామల మండల అధ్యక్షుడు వెంకట సుబ్బయ్య, పాత పాడు మహేష్, కనకాద్రి పల్లె దస్తగిరి, సంజామల చిన్నయ్య,నాగరాజు,గోవిందిన్నే సుబ్బయ్య, కలుగొట్ల వెంకట సుబ్బయ్య,నియోజకవర్గ శాలివాహన సంఘం ప్రతినిధులు,ప్రజలు పాల్గొన్నారు.