తిరుపతి జిల్లా…
మైనర్ బాలిక పై అత్యాచారయత్నం కేసు లో 5 సంవత్సరాలు కఠినకారాగార జైలు శిక్ష మరియు 22,000/- వేల రూపాయలు జరిమానా విధించిన న్యాయస్థానం.
నాయుడుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరాం నగర్ నందు నివసించే ఫిర్యాధికి వివాహమై భర్తతో కలసి తన ముగ్గరు పిల్లలతో నివాసం ఉంటుండేది. అందులో చిన్న పాప వయసు సుమారు 09 సంవత్సరాలు మరియు నెల్లూరుకు దగ్గరగల దామరమడుగు గ్రామంలో మదరసాలో ఉర్దూ చదువుకుంటూ అక్కడే హాస్టల్ లో ఉండేది.
రంజాన్ సెలవులకు మా కూతురిని ఇంటికి తేసుకువచ్చాము. 28.04.2019 వ తేది నాడు మధ్యాహ్నం 3 గంటలకు వీధిలో తమ్ముడితో ఆడుకుంటూ ఉండగా అదే వీధిలో నివాసం ఉంటున్న కరియం వెంకయ్య అనే అతను పాపకు డబ్బులు ఇస్తానని చెప్పి వల్ల ఇంటికి తీసుకెళ్ళి తలుపు వేసుకుని అరిస్తే చంపుతానని భేదిరించి హత్యచార ప్రయత్నించగా పక్కింటిలో నివసిస్తున్న అతను అంకయ్య చూసి చిన్న పాపని ఏం చేస్తున్నావని అరవగా కరియం వెంకయ్య పాపని బయటకు పంపడం జరిగింది.
Also Read ముష్టపల్లెలో కూలిన..భారీ రావిచెట్టు
ఆ ఫిర్యాదు కోర్ట్ లో నిజమేనని నిర్ధారణ అవడంతో జరిగిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు నిందితుడైన కరియం వెంకయ్య పై పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు ఇవ్వగా నాయుడుపేట పోలీస్ స్టేషన్ నందు ది.29.04.2019 తేదిన ఫిర్యాదు చేయగా సదరు ఫిర్యాదు పై పోలీసు వారు క్రైమ్ నెంబర్. 104/2019 పోక్సో SC.No. 36/20. u/s 506 IPC మరియు sec. 7,8 of POCSO యాక్ట్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినారు.
సదరు కేసును దర్యాప్తు చేసి నిందితుడైన కరియం వెంకయ్య ను ది.29.04.2019 తేదిన అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ కోర్ట్ నందు హాజరు పరచి రిమాండ్ కు తరలించడం జరిగింది. అనంతరం చార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది.
Also Read అల్లు సినిమా హత్యకు 2 కోట్లు – మెగా సినిమా హత్యలకు 10 లక్షలు
విచారణ అనంతరం నిందితుడు అయిన కరియం వెంకయ్య వయసు: 09 సంవత్సరాలు పై నేరం ఋజువైనందున ది.27.03.2025 వ తేదీన POCSO Court, గౌరవ న్యాయాధికారి శ్రీమతి సిరిపిరెడ్డి సుమ గారు నిందితుడుకి 5 సంవత్సరాలు కఠినకారాగార జైలు శిక్ష 22,000/- వేల రూపాయలు జరిమానా విధించడం జరిగింది.
ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరుపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి, నాయుడుపేట కోర్ట్ హెచ్.సి జి. వెంజటేశ్వర్లు వారు నేర నిరూపణ చెయడానికి కృషి చేసారు.
నేర నిరూపణలో కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి, నాయుడుపేట కోర్ట్ హెచ్.సి జి. వెంజటేశ్వర్లు వారిని జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు ఐ.పి.ఎస్., గారు అభినందించారు.
తిరుపతి జిల్లా…
మైనర్ బాలిక పై అత్యాచారయత్నం
DEPARTMENT OF SCHOOL EDUCATION Government of Andhra Pradesh