శ్రీశైల నియోజకవర్గం చరిత్ర

History of Srisaila Constituency

History of Srisaila Constituency

శ్రీశైల నియోజకవర్గం చరిత్ర…..

1978 లొ ఆత్మకూరు నియోజకవర్గం ఎర్పడింది.
మొదటి ఎం.ఎల్.ఏ ఆత్మకూరు వెంగళరెడ్డి (AVR)కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందారు…

ప్రత్యర్థి అభ్యర్థి డాక్టర్ రంగసాయి ,జనతా
పార్టీ

1983 మరియు 1985 లో బుడ్డా వెంగళరెడ్డి T.D.P పార్టీ నుంచి రెండు సార్లు ఎం.ఎల్.ఏ గా గెలుపొందారు
1989 వరకు కరువుశాఖ సహయ మంత్రిగా పనిచేశారు

1989లొ బుడ్డా వెంగళరెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించి ఎం.ఎల్.ఏ గా గెలుపొందారు
మరల 1994లొ,T.D.P లొ చేరారు అయితే ఓడిపోయారు
కాంగ్రెస్ అభ్యర్థి ఏరాసు ప్రతాపరెడ్డి ఆరు వేల ఓట్లతో గెలుపొందారు

1999 ఆగష్టు 11వ తేదిన బుడ్డా వెంగళరెడ్డి నక్సల్ చేతిలొ హతమయ్యాడు

అనంతరం
1999 లొ తన మొదటి కుమారుడు బుడ్డా సీతారామిరెడ్డి 18525 ,ఓట్లతొ గెలుపొందారు

కాంగ్రెస్ అభ్యర్థి ఏరాసు ప్రతాపరెడ్డి పై గెలుపొందారు

2004లొ బుడ్డా వెంగళరెడ్డి కోడలు బుడ్డా శైలజ ప్రస్తుత ఎం.ఎల్.ఏ బుడ్డా రాజశేఖరరెడ్డి గారి సతీమణి 16వేల ఓట్లతో ఓడిపోయారు

కాంగ్రెస్ అభ్యర్థి ఏరాసు ప్రతాపరెడ్డి గెలుపొందారు

2009లొ బుడ్డా రాజశేఖరరెడ్డి 5 వేల ఓట్లతో ఓడిపోయారు

కాంగ్రెస్ అభ్యర్థి ఏరాసు ప్రతాపరెడ్డి గెలుపొందారు

2014 లొ బుడ్డా రాజశేఖరరెడ్డి వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించి 6525 ఓట్లతో ఎం.ఎల్.ఏ గా గెలుపొందారు

ప్రత్యర్థి అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి T.D.P తరపున పొటి చేసి ఓడిపోయాడు

2017లొ బుడ్డా రాజశేఖరరెడ్డి T.D.P.లొ చేరాడు

శ్రీశైల నియోజకవర్గం లొ ప్రదాన సమస్య త్రాగునీరు, ఆత్మకూరు నుండి శ్రీశైలం ఘాట్ రోడ్డు నిర్మాణం, పరిశ్రమలు లేకపోవడం తొ బ్రతుకు దెరువుకు వలసలు పోవడం, కేవలం వ్యవసాయం పైనే ఆదారపడడం, ఫారెస్ట్ వున్నా బ్యాంబు కటింగ్ యివ్యకపోవడం

టి.డి.పి బలహీనతలు
నాయకులలొ కొందరికే ప్రాధాన్యత ఇవ్వడం
పాతవారిని పట్టించుకొక పొవడం
ప్రతి పథకాలలొ అవినీతి,
పొదుపు మహిళల పసుపు కుంకుమ చెక్కులకు కూడ రెండు వేలు వసూలు చేయడం,
ప్రజల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించడం
చేసిన పనులలొ నాణ్యత లేకపోవడం
ఆదరణ పథకంలొ అవినీతి ,
సబ్సిడి లొన్ల విషయం లొ ప్రతి పథకంలొ
సొంత పార్టీ కార్యకర్తల వద్ద కూడ డబ్బులు ఇవ్వనిదే ఏ నాయకుడు పనులు చేయక పోవడం..

శ్రీశైలం అసెంబ్లీ రాజకీయం..

శ్రీశైలం నియోజకవర్గం ఎప్పుడు ఏర్పడింది? భౌగోళిక స్వరూపము, దాని పరిస్థితులు ఎలా ఉన్నాయి.. ఈ నియోజకవర్గంలో ఏమేమి సామాజిక వర్గాలు ఉన్నాయి..  ప్రజల జీవన స్థితి గతులు ఎలా ఉన్నాయి.. అనే విషయాలు ఈవాల్టి అసెంబ్లీ రాజకీయంలో తెలుసుకుందాం… 

  శ్రీశైలం నియోజకవర్గం..

జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా, జాతీయ స్థాయి లో కూడా గుర్తింపు పొందిన నియోజకవర్గం, అందుకు కారణం ….అష్టాదశ శక్తి పీఠాలలో 6 వ శక్తి పీఠంగా వున్న భ్రమరాంబ దేవి శక్తి పీఠం, మరియు,ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవ దిగా వున్న మల్లికార్జున స్వామి వున్న జ్యోతిర్లింగం ,ఈ రెండు కలిసి వున్న ఏకైక దివ్య క్షేత్రం శ్రీశైలం పుణ్యక్షేత్రం, ప్రపంచంలో ఎక్కడా ఇలా( శక్తి పీఠం,జ్యోతిర్లింగం) రెండు ఒకే చోట వుండవు.అలాంటి పుణ్యక్షేత్రం శ్రీశైలం పేరుతో 2009 లో నంద్యాల నియోజకవర్గం లోని మహానంది మండలం, బండి ఆత్మకూరు మండలాలను చేర్చుకొని ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం లోని పాములపాడు మండలం, కొత్తపల్లి మండలాలను నందికొట్కూరు నియోజకవర్గం లోకి మార్చి కొత్త గా శ్రీశైలం నియోజకవర్గం ఏర్పడింది.

అలాగే మరో శివాలయం మహానంది దేవాలయం…. నవ నందులలో ఒకటైన మహానందీశ్వరుడు ఇక్కడ వెలసియున్నాడు.చుట్టూ తొమ్మిది నందులతో వెలసి వున్న మహానంది క్షేత్రం ఈ నియోజకవర్గంలోనే వుంది.శ్రీ శైలం నియోజకవర్గం లో శివాలయాలు కొదవేలేదు.ఓంకార క్షేత్రం, రుద్రకోడు క్షేత్రం వంటి శైవ క్షేత్రాలు అనేకం వున్నాయి.

ఈ  నియోజకవర్గం .. కర్నూలు జిల్లా కేంద్రానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.. ఈ నియోజకవర్గానికి తూర్పున. ప్రకాశం జిల్లా లోని దోర్నాల, పడమర దిక్కున నందికొట్కూరు నియోజకవర్గం,ఉత్తరం దిక్కున కృష్ణా నది దక్షిణం దిక్కున నంద్యాల నియోజకవర్గం లు వున్నాయి. శ్రీశైలం నియోజకవర్గం 180 కిలోమీటర్ల మేర పొడవునా నల్లమల అటవీప్రాంతం ను అనుకోని విస్తరించి ఉంది.
గతంలో మాజీమంత్రి బుడ్డా వెంగళరెడ్డిని నక్సలైట్లు పోలీసుల వేషంలో వచ్చి కాల్చి చంపారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ కూలిన ప్రమాద ఘటన పావురాలగుట్ట, శ్రీశైలం నియోజకవర్గం పరిధిలోకే వస్తుంది.
 
  శ్రీశైలం నియోజకవర్గంలో ఐదు  మండలాలు.. ఆత్మకూరు, వెలుగోడు, బండి ఆత్మకూరు, మహానంది, శ్రీశైలం మండలాలు ఉన్నాయి,, ఈ సెగ్మెంట్లో 75 గ్రామాలు, 15 గిరిజన గూడెం లు, తాండాలున్నాయి. లక్షా 57 వేల 557 మంది ఓటర్లున్నారు. ఇందులో 79 వేల 795 మంది మహిళా ఓటర్లు, 77 వేల 730  మంది పురుష ఓటర్లున్నారు…మొత్తం ఓటర్లలో 50 శాతం బీసీలు,12 శాతం ఎస్టీలు, 18 శాతం ఎస్సీలు,10 శాతం ఓసీలు 10 శాతం ముస్లింలు కూడా ఉన్నారు… నియోజక వర్గంలో ప్రతిసారి గెలుపు ఓటములలో మాత్రం బిసి ఓటర్లే కీలకంగా మారుతు వస్తున్నాయి…

నియోజకవర్గం 2009 లో కొత్త గా ఏర్పాటు

శ్రీశైలం నియోజకవర్గం 2009 లో కొత్త గా ఏర్పాటు అయ్యింది. అతకు ముందు ఆత్మకూరు నియోజకవర్గం గా వుండి 1978 లో ఏర్పడింది.. అప్పటి నుండి నుంచి  8 సార్లు జరిగిన ఎన్నికల్లో 5 సార్లు కాంగ్రెస్ కు పట్టం కట్టారు ఓటర్లు…టీడీపీ స్థాపించాక రాజకీయంగా చాలామార్పులే జరిగాయి… మూడుసార్లు కాంగ్రెస్ అభ్యర్థి ఎరాసు ప్రతాపరెడ్డి గెలిచారు…అయితే, టీడీపీ స్థాపనతో కాంగ్రెస్ కంచుకోట బద్ధలైంది…1983లో టీడీపీ అభ్యర్థి బుడ్డా వెంగళరెడ్డి గెలిచారు…

1985లోనూ టీడీపీ అభ్యర్థి బుడ్డా వెంగళరెడ్డి గెలిచారు…1989లో బుడ్డా వెంగళరెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు…తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంట్రీ ఇచ్చిన ఎరాసు ప్రతాపరెడ్డి 1994 లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా పోటీ చేసి హ్యాట్రిక్ సాధించిన బుడ్డా వెంగళరెడ్డి పై విజయం సాధించాడు.

1999 సంవత్సరం ఎన్నికల సమయంలో బుడ్డా వెంగళరెడ్డిని నక్సలైట్లు పోలీసుల వేషంలో వచ్చి కాల్చి చంపడం ద్వారా అయన స్థానం లో బుడ్డా వెంగళరెడ్డి పెద్దకుమారుడు బుడ్డా సీతారామిరెడ్డి టిడిపి అభ్యర్థి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏరాసు ప్రతాపరెడ్డి పై విజయం సాధించాడు, అనంతరం2004,2009 లలో జరిగిన ఎన్నికలలో బుడ్డా కుటుంబం పై ఎరాసు ప్రతాపరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా విజయం సాధించాడు.మంత్రిగా కూడా పనిచేశారు.

.ఆ తరువాత 2014 ఎన్నికల సమయానికి రాష్ట్రం విడిపోయిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తుడిచి పెట్టుకు పోవడంతో ఎమ్మెల్యే ఎరాసు ప్రతాపరెడ్డి కాంగ్రెస్ పార్టీ ని వీడి టిడిపి లో చేరారు.అప్పటికి నియోజకవర్గం లో స్థానంలేక పోవడంతో పాణ్యం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. శ్రీ శైలం నియోజకవర్గం నుంచి 2014 సాదరణ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన బుడ్డా రాజశేఖరరెడ్డి గెలుపొందారు………‌‌‌‌‌అయితే రెండు సంవత్సరాల అనంతరం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి వైసిపి ని వీడి నియోజకవర్గ అభివృద్ధి కై టిడిపి లో చేరారు.

 ఈ నియోజకవర్గంలో ఎక్కువగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తారు……. శ్రీ శైలం దేవస్థానం పరిధిలో వివిద ప్రాంతాలకు చెందిన ప్రజలు జీవిస్తారు.. విభిన్న సంస్క్రుతులకు నిలయంగా ఉంటుంది .. ఇక్కడ విద్యా, వ్యాపార , ఇండస్ట్రీయల్ తక్కువగా ఉన్నాయి.. శ్రీశైలం బ్యాక్ వాటర్ ను పోతిరెడ్డిపాడు నుంచి SRMC,SRBC కాలువ ద్వారా, కెసి కెనాల్,విబిఅర్,సిద్దాపురం ఎత్తిపోతల పథకంలు ఉండటంతో వాటిద్వారా పంటలు పండిస్తారు రైతులు.. 

 అయితే వలస వచ్చిన రైతులు కూడా జీవనం కొనసాగిస్తున్నారు…….. ఈ నియోజకవర్గంలో ఉద్యోగులు, వ్యాపారులు, కూలీలు,  రైతులు  జీవనం కొనసాగిస్తున్నారు.. గ్రామాల నుండి తమ పిల్లల చదువుల కోసం వలస వెళ్లిన వారు కొంత మంది ఉండగా గ్రామాల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవించే వారు ఎక్కువగా ఉన్నారు…  ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం పక్కనే ఉండటంతో పెళ్లిలకు ఇచ్చుకునడం పుచ్చుకోవడంతో బందుత్వాలు ఉన్నాయి….  ఇక్కడ  హిందువులతో పాటు ముస్లీంలు,క్రైస్తవులు అధికంగా నే ఉంటారు.. ముఖ్యంగా ఇక్కడ వరి, మొక్కజొన్న, కందులు, శెనగ,పత్తి, మినుముల పంటలు ఎక్కువగా పండిస్తారు..

Also Read చెస్ లో నారా దేవన్స్ ప్రపంచ రికార్డు

Also Read అత్తగారింటికి పోవడానికి ఆర్టీసీ బస్సు చోరీ..

also read జూనియర్ ఎన్ టి ఆర్ బామ్మర్ది నార్నే నితిన్ ఎంగేజ్మెంట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top