వైయస్సార్ సిపి కి వరుసగా షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి . తాజాగా సినీ యాక్టర్ , కమెడియన్ అలీ YSRCP కి రాజీనామా చేశారు. తన రాజీనామా ను వైసీపీ పార్టీ ఆఫీసుకు పంపించారు. కమెడియన్ అలీ 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. టికెట్ ఆశించి ఎన్నికల ముందు అలీ వైసీపీలో చేరడంతో.. జగన్ అలీకి టికెట్ కేటాయించ లేదు.. తనకు టికెట్ దక్కకపోయినప్పటికీ పార్టీ తరుఫున అలీ ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. 2019 లో అలీ ప్రచారం చేసిన మైనారిటీ నియోజకవర్గాల్లో.. వైసీపీ ఘన విజయం సాధించింది. జగన్ సీఎం అయిన తరువాత ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ పదవులు ఇస్తారని అలీ ఆశపడ్డాడాని ప్రచారం జరిగింది. అలి కూడ ఆశపడిన మాట వాస్తవం కూడా.. అయితే నిరుత్సాహంగా అలీ కి వైయస్ జగన్ మాత్రం ఆయనకు ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమించారు. తర్వాత 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా అలీ వైసీపీ నుంచి ఎమ్మెల్యే లేదా..నంద్యాల, గుంటూరు పార్లమెంట్ స్థానాలకు అలీ పేరును పరిశీలిస్తున్నట్టుగా గట్టిగా పుకార్లు వచ్చాయి. కానీ అలీకి 2024 ఎన్నికల్లో ఎక్కడా కూడా.. టికెట్ దక్కకపోవడంతో.. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అలీ ఎక్కడ కూడా పార్టీ కార్య క్రమాల్లో పాల్గొనలేదు.. వైసీపీ పార్టీ కూడా ఘోరంగా ఓటమి పాలు కావడంతో..అలీ రాజీనామా చేశారు.