నంద్యాలలో కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలు

Mollamamba Jayanti celebrations in Nandyal

Mollamamba Jayanti celebrations in Nandyal

తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలు నేడు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి.  అందులో భాగంగా నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొల్లమాంబ జయంతి మహోత్సవం, కుమ్మరుల ఆద్వర్యంలో ఘనంగా జరిగిగింది. కవయిత్రి మొల్లమాంబ కుమ్మరి ఆడపడుచు కావడంతో జిల్లాలోని శాలివాహన కుమ్మరులు పెద్ద ఎత్తున పాల్గొని ఆమెకు నివాళులర్పించారు. అనంతరం కుమ్మరులు మాట్లాడుతూ .. రామాయణాన్ని తెలుగులో రాసిన కవయిత్రి మొల్లమాంబ జయంతిని అధికారికంగా జరుపుకోవడానికి ప్రభుత్వం ముందుకురావడం. కుమ్మరులకు గర్వించ దగ్గ విషయమని కొనియాడారు. ఆమె విగ్రహాలను జిల్లా కేంద్రాలలో, మండల కేంద్రాలలో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని, అందుకు అధికారులు, ప్రభుత్వం సహకరించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.  కవయిత్రి మొల్లమాంబ విగ్రహాలను ఏర్పాటు చేసే దిశగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కుమ్మరులు ఏకం కావాలని పిలుపు నిచ్చారు.  

మొల్ల అసలు పేరు ఆత్మకూరి మొల్లమాంబ. ఆమె 16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి.  తెలుగులో తాను రాసిన రామాయణం మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందింది.ఈమె కుమ్మరి కుటుంబంలో జన్మించింది. మొల్ల శ్రీ కృష్ణదేవరాయల సమయంలోనిదని కూడా ప్రసిద్ది. ఇక మొల్ల రచనలను చదివినవారు మొల్ల రచనా శైలి చాలా సరళమైందని, రమణీయమైనదని అంటారు. రామాయణాన్ని అతి సులువైన పదాలతో తెలుగులో రాసి తన సరళమైన పదజాలానికి అందరూ ముద్దులయ్యేలా చేసిన కవయిత్రి మొల్ల.

 ఆమె రాసిన రామాయణం ‘మొల్ల రామాయణం’గా ఎంతో ప్రసిద్ధి చెందింది. రామాయణాన్ని తెలుగులో రాసిన తొలి కవయిత్రిగా కూడా ఆమె ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచింది. అందుకే ప్రభుత్వం మొల్ల జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయించించింది.  మొల్ల జయంతి అయిన మార్చి 13వ తేదీని రాష్ట్ర ఉత్సవంగా చేయాలని నిర్ణయించి 2023 సెప్టెంబర్ 19తేదీన జీవో 99ను విడుదల చేసింది.  మొల్ల స్వస్థలం కడప జిల్లా, గోపవరం మండలం, గోపవరం గ్రామం. ఈ గ్రామం కడప పట్టణానికి 56 కి.మీ దూరంలో, బద్వేలుకు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొన్ని మూలాల ఆధారంగా మొల్ల స్వంతంత్ర భావాలు కలిగి ఉండేదని, చిన్న తనంలోనే తల్లిని కోల్పోగా తండ్రి కేసన శెట్టి ఈమెను గారాబంగా పెంచారని, ఈమెకు తండ్రి అంటే అమిత ఇష్టం కావడంతో పెళ్ళి కూడా చేసుకోలేదని స్దానికులు చెబుతారు. మొల్ల రామాయణం మొత్తం ఆరు కాండాలలో 871 పద్యాలతో కూడుకుంది. ఈ కావ్యాన్ని మొల్ల కేవలం ఐదు రోజులలో రాసిందని ప్రతీతి. మొల్ల రచన ఆనాటి పద్ధతికి విరుద్ధంగా వాడుక భాషకు దగ్గరగా ఉండేదని సాహిత్యకారులు చెబుతుంటారు.

పలువురు కవులు, రచయితలు, కవయిత్రులు, కుమ్మర, శాలివాహన సంఘం ఇచ్చిన వినతుల మేరకు  అప్పటి సీఎం జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం మొల్ల జయంతిని రాష్ట్ర ఉత్సవంగా చేయడానికి పూనుకున్నట్లు జీవో 99 విడుదల చేసింది. ఈ కార్యక్రమాలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొల్ల జయంతిని రాష్ట్ర ఉత్సవంగా జరపడాన్ని కుమ్మరులు, కవులు, రచయితలు స్వాగతించి హర్షం వ్యక్తం చేశారు.

#MollamambaJayanticelebrationsNandyal

##MollamambaJayanticelebrationsNandyal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top