కామిని వేణుగోపాల్ రెడ్డి మృతి రాయలసీమ ఉద్యమానికి తీరని లోటు
రాయలసీమకు సాగు, తాగునీరు సంపూర్ణంగా అందించినప్పుడే వేణుగోపాల్ రెడ్డికి నిజమైన నివాళి
మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి
రాయలసీమ ఉద్యమకారుడు, కుందూనది పోరాట సమితి వ్యవస్థాపకులు కామిని వేణుగోపాల్ రెడ్డి అకాలమరణం చాలా భాధేస్తోందని, అయన మృతి రాయలసీమ ఉద్యమానికి తీరనిలోటని, రాయలసీమకు రావాల్చిన నీటి హక్కు వాటా సాధించి సంపూర్ణంగా సాగు, తాగు నీరు వచ్చినప్పుడే వేణుగోపాల్ రెడ్డికి నిజమైన నివాళులు అర్పించినట్లు అని రాయలసీమ ఉద్యమనేత, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు.
శనివారం కోవెలకుంట్లలోని కామిని వేణుగోపాల్ రెడ్డి ఇంట్లో అయన పార్థివదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
Plz Download Political Hunter News Hunter aap
ఈ సందర్బంగా వివిధ ప్రజాసంఘాలనేతలు, రాయలసీమ ఉద్యమనేతలు, కోవెలకుంట్ల గ్రామస్థులనుద్దేశించి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కరువునేల రాయలసీమకు నీటి తోనే సమస్యలు 80 శాతం తోలుగుతాయని నమ్మిన వ్యక్తి వేణు అని, నీరు సాధించేందుకు రాజీలేని పోరాటం చేస్తున్నాడని గుర్తు చేశారు. సిద్దేశ్వరం వద్ద కృష్ణానదిపై తీగల వంతెన బదులు బ్రిడ్జి కం బ్యారేజ్ నిర్మాణం చేయాలని ఒక వైపు ఉద్యమం చేస్తూ మరో వైపు సుప్రీంకోర్టు తలుపులు తట్టిన ఉద్యమకారుడు వేణుగోపాల్ రెడ్డి అన్నారు. రాయలసీమకు నీళ్లు, నిధులు, నియామకాలు సాధించేందుకు వేణును స్ఫూర్తిగా తీసుకొని పోరాడుదాం అని బైరెడ్డి పిలుపునిచ్చారు.
ఈ అంతిమ సంస్కార కార్యక్రమంలో కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి, బి. వి. ప్రసాద్ రెడ్డి, రాయలసీమ ఉద్యమనేతలు అనంతపురం జిల్లా రామ్ కుమార్, తిప్పిరెడ్డి నాగార్జున రెడ్డి, అశోక్ వర్ధన్ రెడ్డి, ఇండ్ల ప్రభాకర్ రెడ్డి, Dr. రామాంజనేయులు, నంద్యాల జిల్లా నాయకులు, రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి, ఏర్వ రామచంద్రారెడ్డి, యం. వి. రమణారెడ్డి, ఆళ్లగడ్డ నాయకులు జ్యోతిర్మయి, హనుమంతరెడ్డి, కోవెలకుంట్ల ప్రజా సంఘాల నాయకులు కరీంబాషా, రచయిత కాశీపురం ప్రభాకర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, Dr. పేరా శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు అమర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొని కామిని వేణుగోపాల్ రెడ్డికి ఘనంగా నివాళులు అర్పించారు.
Also Read తిరుమల ప్రసాదంపై నంద్యాల ఎంపీ బైరెడ్డి శభరి ఫైర్