- శ్రీశైల దేవస్థానంలో పద్మావతి ఏజెన్సీ ఇష్టారాజ్యం
- మూడో నెల గడుస్తున్నా చెల్లించని జీతాలు
- పారిశుద్ధ్య, హౌస్‌కీపింగ్ కార్మికుల అవస్థలు
- కార్మికులకు ఫేస్ రికగ్నైజేషన్ హాజరు నమోదుకు దేవస్థాన నిర్ణయం
- కార్మికులను సర్దుబాటు చేయలేని ఏజెన్సీ
శ్రీశైలంటెంపుల్: అసలే అరకొర జీతం… ఆపై మూడు నెలలు అవుతున్నా అందని వేతనంతో శ్రీశైల దేవస్థానం పారిశుద్ధ్య, హౌసీపింగ్ కార్మి కులు నానా అవస్థలు పడుతున్నారు. దేవస్థానం కార్మికులందరికీ ఫేస్ రికగ్నైజేషన్ హాజరు నమోదు ఏర్పాటు చేయడంతో కాంట్రాక్టర్ పప్పులు ఉడ కడం లేదు. దీంతో ఏజెన్సీ టెండర్ ప్రకారం పూర్తి స్థాయిలో కార్మికులను సరఫరా చేయక పోవడం, కార్మికులకు సకాలంలో వేతనాలు ఇవ్వకపోవడం తో కార్మికుల వెతలు అన్నీ ఇన్నీ కావు. శ్రీశైల దేవస్థానంలో పారిశుద్ధ్య, హౌస్ కీపింగ్ నిర్వహణను తిరుపతికి చెందిన పద్మావతి హాస్పిటాలిటీ అండ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సంస్థ దక్కించుకుంది. శ్రీశైల దేవ స్థానంతో పాటు రాష్ట్రంలోని ఆరు ప్రముఖ దేవా లయాలకు కలిపి సెంట్రలేజేషన్ పేరుతో చంద్ర బాబు ప్రభుత్వానికి అత్యంత అప్తుడైన వ్యక్తికి చెందిన సంస్థకు పారిశుద్ధ్య నిర్వహణను కట్టబెట్టారు. గతేడాది అక్టోబరు 1వ తేదీ నుంచి పద్మావతి సంస్థ శ్రీశైల దేవస్థానంలో పారిశుద్ధ్య నిర్వహణ చేపడు తుంది.
చంద్రబాబు ప్రభుత్వంలో నూతనంగా ఏర్పాటైన పద్మావతి ఏజెన్సీకి సూపర్వైజర్స్-4, శానిటరీ మేస్త్రీ-52, హౌస్కపింగ్ వర్కర్స్ 506, స్కావెంజర్స్-58, మెషిన్ ఆపరేటర్స్, ట్రాక్టర్ డ్రైవ ర్స్-4, ఎలక్ట్రిషియన్స్-5, ఏసీ మెకానిక్-3, ప్లంబ ర్స్-5, కార్పెంటర్స్-4 ఇలా (వీక్లీ ఆఫ్ రిలీవర్స్తో )మొత్తం కలిపి సుమారు 641 మందికి కేటాయిం చారు. వీరికి కార్మిక చట్టం ప్రకారం రూ.12,253 నెలకు వేతనంగా చెల్లిస్తామని టెండర్లో పొందుప ర్చారు. ఇందులో ఈపీఎఫ్, ఈఎస్ఐకి పోను బేసిక్ వేతనంగా ఒక్కొక్కరికి నెలకు 10,690 ఇవ్వను న్నారు. అయితే పద్మావతి సంస్థ రెండు నెలలు గడుస్తున్నా కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు అవస్థలు పడుతున్నారు. అయితే పారి శుద్ధ్య, హౌస్‌కీపింగ్ కార్మికులకు జనవరి, ఫిబ్రవరి వేతనాలు ఇప్పటి వరకు చెల్లించలేదు.
ఫేస్ రికగ్నైజేషన్ హాజరుతో ఏజెన్సీకి తిప్పలు: పద్మావతి ఏజెన్సీ పూర్తిస్థాయిలో కార్మికులను పనుల్లో పెట్టరనే విమర్శలు ఉన్నాయి. అంతేకాకుం డా పద్మావతి ఏజెన్సీ శ్రీశైల దేవస్థానంలో పారిశు ద్య, హౌస్‌కీపింగ్ పనులు చేపట్టినప్పటి నుంచి పారిశుద్ధ్యంలో భక్తుల సంతృప్తి స్థాయి కిందిస్థా యికి దిగజారిపోయి చివరి స్థానంలో శ్రీశైల దేవ స్థానం నిలిచింది. పద్మావతి ఏజెన్సీపై నమ్మకం సన్నగిల్లి కార్మికులకు ఫేస్ రికగ్నైజేషన్ హాజరుతోనే వేతనం నమోదు అయ్యేటట్లు దేవస్థానం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పద్మావతి ఏజెన్సీకి ఫేస్ రికగ్నైజేషన్ హాజరు కంట్లో నలకలా మారింది. ఈ క్రమంలో హౌస్ కీపింగ్ కింద పనిచేస్తున్న కార్మికులను పారిశుద్ధ్య నిర్వహణ పనులకు వినియోగించు కుంటున్నారు. అయినా కానీ ఇంకా సిబ్బంది తక్కువగా ఉన్నారు.
30 మంది కార్మికులను సరఫరా చేయలేం: పద్మావతి ఏజెన్సీకి టెండర్లో పారిశుద్ధ్య, హౌసి పింగ్‌కు కలిపి మొత్తం 641 మంది కార్మికులను సరఫరా చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆ సంస్థపై నమ్మకం లేకపోవడంతో చాలా మంది ఆ సంస్థలో పనిచేసేందుకు ఆసక్తి చూపడంలేదు. దీంతో ఇప్పటికి 30 మంది కార్మికులను తాము సరఫరా చేయలేమని, ఉన్న కార్మికులతో ఓటీ (ఓవర్ టైం) పనిచేయించుకునేందుకు అనుమతించాలని పద్మావతి ఏజెన్సీ దేవస్థానానికి లేఖ రాశారు. ఏజెన్సీ లేఖపై కమిషనర్ అనుమతులకు పంపారు.
ప్రత్యేక కమిటీ రద్దుకు ఏజెన్సీ యత్నం: పద్మావతి ఏజెన్సీ ద్వారా పారిశుద్ధ్యం, హౌస్ కీపింగ్, మెటీరియల్, మిషనరీల నిర్వహణపై దేవస్థానం నుంచి బిల్లు చెల్లింపులకు పూర్తి పారదర్శకత కోసం దేవస్థాన ఈఓ నలుగురు అధికారుల బృందంతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ పూర్తిస్థాయిలో పరిశీలించి బిల్లుకు ఆమోదం తెలిపితేనే బిల్లు చెల్లిస్తారు. దేవస్థానం ఏజెన్సీ నిర్వహణపై కమిటీ వేయడం పద్మావతి ఏజెన్సీకి మింగుడు పడడం లేదు. ఏదో అరకొర మనుషులను, మెటీరియలు తీసుకువచ్చి మల్లన్న సొమ్మును కాజే ద్దామనుకుంటే దేవస్థాన ఈఓ అడ్డుకట్ట వేయడంపై ఆ సంస్థ ఎండీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఏజెన్సీ నిర్వహణపై వేసిన కమిటీని తొలగించేందుకు ప్రభుత్వ పెద్దలతో ఈఓపై ఒత్తిడి తీసుకువస్తు న్నట్లు తెలుస్తుంది.











