కన్నతల్లిలా కాపాడే కరక్కాయ వైద్యం
మన శారీరక, మానసిక ఆరోగ్య పరిరక్షణకు వంటింటి దినుసులు, గృహావరణ, పరిసర, పంట, బీడు పొలాలలో పెరిగే వివిధ రకాల ఔషధ మొక్కలతో ఉపయోగపడుతాయి.
పాటు అడవులనుంచి లభించే వివిధ రకాల ఉత్పత్తులు అడవుల్ని స్వార్థంతో విచక్షణా రహితంగా విధ్వంసం చేయటం వల్ల వాతావరణ కాలుష్యం,
పర్యావరణ సమతుల్యం దెబ్బతినటం, వన్య ప్రాణులు క్రమంగా కనుమరుగవ టంతోపాటు మన ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడే మహత్తరమైన..
ఔషధ విలువలున్న మందు మొక్కలు, వృక్షాల్ని కోల్పోతున్నాం. దీని ప్రభావం మున్ముందు తరాలవారిపై తీవ్రంగా పడేందుకు బాధ్యులమవుతున్నాం.
అటవీ ఉత్పత్తులలో కరక్కాయకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కాంబ్రిటేసి అనే వృక్ష కుటుంబానికి చెందిన ఈ చెట్టు శాస్త్రీయ నామం టెర్మినేలియా చెబులా.
కరక్కాయలు మూలికా దుకాణాల్లో చౌకధరకు దొరుకుతాయి. అన్ని వయస్సుల వారికి సర్వకాలాల్లో ఉపయోగపడుతూ, అనేక రోగాలను శక్తివంతంగా..
హరించి వేయడం వల్ల దీనికి హరీతకి అని, మృత్యుభయం లేకుండా చేయటం వల్ల అభయా అని అంటారు.
శరీరంలోని వివిధ అవయవాల మధ్య ఉండే..
సూక్ష్మాతి సూక్ష్మమైన స్రోతస్సులనబడే వివిధ సంధాన మార్గాలలోని అవరోధాలను తొలగించి, ఆయా అవయవాల పనితీరు మెరుగుపరిచి చైతన్యవంతం చేసే శక్తికల ఔషధం కనుక పథ్య అని అంటారు.
అకాల వార్ధక్య లక్షణాలు దరి చేరనివ్వకుండా కాపాడే ఔషధం కనుక సంస్కృతంలో దీనిని వయస్థ అని అంటారు.
మనం దైనందిన జీవితం’ ఎదుర్కొనే అనేక అనారోగ్యాలకు కరక్కాయ
ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.
కరక్కాయ బెరడును ఔషధాలలో విరివిగా ఉపయోగిస్తారు.
ఒక చెంచాడు కరక్కాయ చూర్ణాన్ని రాత్రిపూట వేడిపాలు లేదా వేడి నీటితో సేవిస్తుంటే ఉదయం సుఖ విరేచమవుతుంది.
కరక్కాయ చూర్ణం అరచెంచానుంచి చెంచా వరకూ తగినంత తేనెలో కలిపి ఉదయం, సాయంత్రం సేవిస్తూ, పథ్యం చేస్తే పచ్చకామెర్లు త్వరగా తగ్గుతాయి.
కరక్కాయను కాల్చి చూర్ణం చేసి నువ్వుల నూనెలో కలిపి లేపనం చేస్తుంటే దీర్ఘకాలం నుంచి బాధించే పుళ్లు, కుష్టు వ్రణాలు తగ్గుతాయి.
కరక్కాయ చూర్ణం ఒకటే కాని, దానికి సమంగా పొంగించిన పటిక పొడిని కలిపి కాని నీటితో కలిపి పుక్కిట పడుతుంటే నోటి పుళ్లు, నోటి పూత తగ్గుతాయి.
Also Read..నల్లమల అడవులకు రానున్న గజరాజులు
ఈ పొడినే దంతధావన చూర్ణంగా ఉపయోగిస్తే చిగుళ్ల వెంట రక్తం కారడం, పిప్పి పంటి బాధలు తగ్గుతాయి.
కరక్కాయ బెరడు చూర్ణం, కిళ్లీల్లో వేసే కాచు చూర్ణాల్ని కొబ్బరి నూనెలో బాగా కలిపి పూసుకుంటే కాలి పగుళ్లు క్రమంగా తగ్గిపోతాయి.
ఒక భాగం కరక్కాయ బెరడును నాల్గింతల ఆముదంలో దోరగా వేయించి చూర్ణం చేసి అదే ఆముదంలో బాగా కలిపి ఉంచుకొని..
వైద్య విధానంలో కరక్కాయ
రాత్రి పూట 1 -2 చెంచాల వంతున సేవిస్తుంటే వివిధ రకాల మూలవ్యాధులు, మలబద్దకం తగ్గుతాయి.
కరక్కాయ, శొంఠి, వాము చూర్ణాల్ని సమంగా కలిపి తగినంత బెల్లం కలిపి నూరి కుంకుడు గింజంత మాత్రలు చేసి ఒకటి,
రెండు మాత్రల వంతున రోజూ మూడు పూటలూ తీసుకుంటే కీళ్లవాపులు, నొప్పులు తగ్గుతాయి.
ప్రయోగశాలల్లో జరిగిన అధ్యయనాలలో కరక్కాయలో టానిక్, చెబులా ‘యాసిడ్, కొరిలాజన్, గాలిక్ యాసిడ్, ఆంథ్రాక్వినోన్ అనే అంశాలున్నట్లు గుర్తించారు.
కరక్కాయను నీటితో నూరి తీసిన గంధాన్ని వివిధ రకాల చర్మవ్యాధులు. ‘దెబ్బలు, మొలలపై లేపనం చేస్తే ఆయా బాధలు ఉపశమిస్తాయి.
సిద్ధ వైద్య విధానంలో కరక్కాయ, ఆముదం కలిపి తయారుచేసిన మూలకుడార తైలాన్ని మూలవ్యాధులు తగ్గడానికి, మలబద్దకాన్ని నివారించడానికి వాడుతారు.
డిక్షనరీ ఆఫ్ ఎకనమిక్ ప్రొడక్ట్స్ ఇన్ ఇండియా అనే ప్రామాణిక గ్రంథంలో కరక్కాయ గురించి పలు విశేషాలు తెలియజేశారు.
ఆరు కరక్కాయలను నలగగొట్టి, నీటిలో వేసి డికాక్షన్ కాచి తాగటం వల్ల కడుపులో ఎటువంటి వికారాలు కలగకుండా నాలుగు ఐదు విరేచనాలయి కోష్ఠశుద్ధి జరుగుతుందని ఆ గ్రంథంలో పేర్కొన్నారు.
అలాగే కరక్కాయ చూర్ణాన్ని ధుమపానంగా సేవిస్తే ఉబ్బస వ్యాధి తీవ్రత శమిస్తుందని, కరక్కాయ కషాయంతో మూలవ్యాధి పిలకలను
Also Read..YABER PRO V9 WiFi 6 Bluetooth Projector
కడగడం వలన మంచి ప్రయోజనం చేకూరుతుందని ఆ గ్రంథంలో పేర్కొన్నారు.
శరీరం బరువు తగ్గకుండా సీరం లిపిడ్ ప్రమాణాలను కరక్కాయ తగ్గిస్తుందని పరిశోధనలలో వెల్లడైంది.
కరక్కాయ చూర్ణాన్ని సైంధవ లవణంతో కలిపి తీసుకుంటే శ్లేష్మ హరంగాను, పటిక బెల్లంతో కలిపి సేవిస్తే పిత్తహరంగాను,
నెయ్యితో సేవిస్తే వాతహరంగాను పనిచేస్తుంది. అలాగే బెల్లంతో కలిపి సేవిస్తే వివిధ రోగాలను హరిస్తుంది.
కరక్కాయ చూర్ణం, బెల్లం సమభాగాలుగా కలిపి ఉంచుకొని, ఒకటి రెండు గ్రాములు మోతాదుగా రోజూ రెండు మూడుసార్లు సేవిస్తే వివిధ రకాల మూల వ్యాధులు తగ్గుతాయి.
కరక్కాయ, సునాముఖి, సైంధవ లవణం చూర్ణాలను సమంగా తీసుకుని … అందులో నాలుగవ వంతు మిరియాల చూర్ణాన్ని కలిపి ఉంచుకుని రోజూ రాత్రిపూట వేడినీటితో ఒకస్పూను వంతున తీసుకుంటే అజీర్ణ దోషాలు తొలగిపోయి, సుఖ విరేచనం అవుతుంది. కడుపు ఉబ్బరం, త్రేన్పులు, కడుపు నొప్పి వంటి, ఇబ్బందులు తొలగిపోతాయి.