తాడేపల్లి
ఘనంగా ఏపీయూడబ్ల్యూజె జిల్లా నూతన కమిటీ ప్రమాణ స్వీకారం
ప్రొఫెషనల్ ట్యాక్స్ ను వ్యతిరేకించిన యూనియన్ నాయకులు
వెంటనే రద్దు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగాఉద్యమిస్తాం
హెచ్చరించిన ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐ.వి సుబ్బారావు,ప్రధాన కార్యదర్శిచందు జనార్ధన్,ఐజెయూ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు
గుంటూరు జిల్లా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఏపీ యూడబ్ల్యూజే జిల్లా కమిటీ కార్యవర్గ సమావేశం ఏపీయూ డబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు ఎస్. ఎస్.మీరా,కార్యదర్శి తక్కెళ్ళ పాటి శివనాగిరెడ్డి ఆధ్వర్యంలో
శుక్రవారం తాడేపల్లి ప్రెస్ క్లబ్ లోజరిగింది. ఈ సమావేశానికి
ఐజెయూ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు, ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు
ఐ.వి సుబ్బారావు, ఏపీయూ డబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ముందుగా
ఏపీయూడబ్ల్యూజే గుంటూరు జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం జరిగింది.
అధ్యక్షులుగా ఎస్.ఎస్.మీరా, కార్యదర్శిగా తక్కెళ్ళ పాటి శివనాగిరెడ్డి, ప్రమాణస్వీకారం చేశారు.అనంతరం ఉపాధ్యక్షులు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.తాడేపల్లి నుండి జిల్లా ఉపాధ్యక్షులుగా తాడిబోయిన నాగేశ్వరరావు,జొన్న రాజేష్,ప్రమాణ స్వీకారం చేశారు.నూతన కార్యవర్గంగా పలువురు ప్రమాణ స్వీకారం చేశారు.ఈ కార్యక్రమంలో
ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐ.వి. సుబ్బారావు, మాట్లాడుతూ జిల్లాస్థాయిలో జర్నలిస్టుల సమస్యల మీద
చర్చించడం జరిగిందని అన్నారు, జిల్లాలో ఉన్న ప్రతి జర్నలిస్టుని ఆదుకునే విధంగా
యూనియన్,నిర్ణయించుకోవడం జరిగిందన్నారు. ఇప్పటికీ తాడేపల్లి ప్రెస్ క్లబ్ లో అమలు చేస్తున్న అనేక ఇన్సూరెన్స్ స్కీములను జిల్లాస్థాయిలో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి నిర్ణయించుకోవడం జరిగిందన్నారు. అలాగే భవిష్యత్తులో ప్రతి నియోజకవర్గంలో నెలకి ఒక కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రెండు మూడు నెలలకు ఒకసారి మంచి సెమినార్లు సదస్సులు నిర్వహించాలని
సమావేశంనిర్ణయించిందన్నారు
రానున్న రెండు నెలల్లో జర్నలిస్టులకు శిక్షణా తరగతులునిర్వహించనున్నట్లు తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జర్నలిస్టులకు వృత్తి పన్ను విధిస్తూ నోటీసులు జారీ చేసిందని దానిని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.అలాగే జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకురావడాన్నిస్వాగతిస్తున్నామన్నారు.ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్ మాట్లాడుతూ
జర్నలిస్టులకు ప్రొఫెషనల్ టాక్స్ విధించడాన్నిఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గం తీవ్రంగా ఖండిస్తుందన్నారు.జర్నలిస్టులకు ప్రొఫెషనల్ టాక్స్ తో నోటీసులు ఇవ్వడం తీవ్రంగా ఖండిస్తున్నామని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి సమాచార శాఖ కమిషనర్ కమర్షియల్ టాక్స్ కు సంబంధించిన ఉన్నతాధికారులను కూడా ఏపీయూడబ్ల్యూజే, అగ్రనాయకత్వం,ఐజేయు కలసి జర్నలిస్టుల పట్ల వేధింపులను ఆపాలని చెప్పి కొడతామన్నారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతామన్నారు.రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను అక్కడేషన్లు హెల్త్ కార్డులు సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతామన్నారు.
ఐజేయు ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అక్రిడేషన్ లో జాప్యం జరగకుండా చూడాలన్నారు. జర్నలిస్టులకు వృత్తి పన్ను జారీ చేయటం సరైన పద్ధతి కాదన్నారు. తక్షణమే విరమించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పుల్లగూర భక్తవత్సల రావు, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు ఏచూరి శివ, తదితరులు పాల్గొన్నారు.