జనసేనలోకి వైసీపీ ఎంపీ బాలశౌరి

MP-BALASHOURY.jpg

జనసేనలోకి వైసీపీ ఎంపీ బాలశౌరి.. పార్టీలో చేరికకు ముహూర్తం ఖరారు

ఫిబ్రవరి 4న జనసేన అధినేత సమక్షంలో పార్టీలో చేరిక

ఎంపీ సీటుపై క్లారిటీ వచ్చాకే పార్టీ మారేందుకు బాలశౌరి నిర్ణయం

ఎమ్మెల్యే పేర్ని నానితో విభేదాలున్నాయన్న వార్తల నడుమ పార్టీ మారేందుకు నిర్ణయం

శివ శంకర్. చలువాది

మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేనలో చేరేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 4న ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు.

వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నానితో బాలశౌరికి విభేదాలు ఉన్నాయన్న వార్తలు కొంతకాలంగా చక్కర్లు కొడుతున్నాయి. మచిలీపట్నం ఎంపీగా తనకు సంబంధించిన ప్రోటోకాల్ పాటించట్లేదని పలు సందర్భాల్లో ఆయన ఆరోపించారు. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే, సీఎం జగన్ మాత్రం స్పందించలేదని సమాచారం.

ఇక వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మచిలీపట్నం సీటు కేటాయింపుపై కూడా స్పష్టత లేదని తెలిసింది. తనకు తెలియకుండానే మరొకరికి టిక్కెట్ కేటాయించారంటూ బాలశౌరి ఆగ్రహంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. మచిలీపట్నం ఎంపీ టిక్కెట్‌పై జనసేన అధినేత నుంచి క్లారిటీ తీసుకున్నాకే ఆయన పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకున్నట్టు విశ్వనీయ వర్గాల సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top