తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు గారి ఆదేశాల మేరకు బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో…….
బనగానపల్లె మండలం యాగంటిపల్లె గ్రామంలో“ఇదేం కర్మ మనరాష్ట్రానికి “అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముందుగా బీసీ జనార్దన్ రెడ్డి గారు గ్రామానికి చేరుకోగానే గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘణస్వాగతం పలికారు.
బీసీ జనార్దన్ రెడ్డి గారు గ్రామంలో ఇంటింటికి వెళ్లి వైసీపీ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కష్టాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రానికి పట్టిన ఖర్మ పోవాలంటే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించాలని అయన కోరారు.అదేవిదంగా వైసిపి అధికారంలోకి వచ్చాక పెరిగిన నిత్యవసర ధరలు, గ్యాస్, కరెంట్ బిల్లులు, ఇంటి పన్నులు అన్నింటిపై చర్చించి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజలు ఎలా ఉన్నారో ఇప్పుటి ప్రభుత్వం లో ఎన్ని కష్టాలు పడుతున్నారో అడిగి తెలుసుకున్నారు.
అనంతరం బీసీ జనార్దన్ రెడ్డి గారు మాట్లాడుతూ… వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిపోయింది.అదేవిదంగా వైస్సార్ ప్రభుత్వం రాకముందు
ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మందికి అమ్మబడి ఇస్తా అని చెప్పి, అధికారం వచ్చిన తర్వాత కేవలం ఇంట్లో ఒకరికి మాత్రమే నిబంధనల పేరుతో ఇవ్వడం జరుగుతుందని,రైతులకు సంక్షేమ పథకాలు అన్నాడు కానీ ఒక్కటి కూడా అమలు చేయడం లేదు. అలాగే గ్రామాలు అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ తోనే సాధ్యం అని, రాబోయే 2024 లో జరిగే ఎన్నికల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు PV కుమార్ రెడ్డి, కాట్రేడ్డి మల్లికార్జునరెడ్డి, గ్రామ నాయకులు,వార్డ్ మెంబర్లు,క్లస్టర్ ఇంచార్జ్ లు, బూత్ ఇంచార్జ్ లు, యూనిట్,సెక్షన్, ఇంచార్జ్ లు,మండల నాయకులు,గ్రామాల నాయకులు , కార్యకర్తలు,bcjr అభిమానులు, తదితరులు పాల్గొన్నారు…..