బహు వార్షికపు కలుపు మొక్క అయిన తెల్లగలిజేరు సుమారు 50 సెం.మీ పొడవు వరకు పెరుగుతుంది. దళసరిగా ఒకటి చిన్నది మరొకటి పెద్దదిగా ఉండే వీటి పత్రాలు దాదాపు వృత్తాకారంలో ఉండి కణుపునకు రెండు చొప్పున అభిముఖ పత్రవిన్యాసంలో అమరి ఉంటాయి. పత్రవృంతం మొదటిలో ఒక్కొక్కటి చొప్పున చిన్న పుష్పాలుంటాయి.
సంస్కృతంలో పునర్నవ, శోధఘ్ని అనే పేర్లతో పిలువబడే ఈ మొక్క శాస్త్రీయనామం ట్రైయాంధిమా పోర్టులాకాస్త్రం అయేజోయేసి అనే వృక్ష కుటుంబానికి చెందిన ఈ మొక్క ఔషధ గుణాలను పరిశీలిద్దాం.
గలిజేరు ఆకులు లేదా సమూలం దంచి తీసిన రసం 30 మి.లీ. చొప్పున ఉదయం, సాయంత్రం తగినంత పెరుగులో కలిపి సేవిస్తూ చప్పిడి పథ్యంగా మజ్జిగన్నం మాత్రమే ఆహారంగా ఇస్తుంటే పచ్చకామెర్లు తగ్గుతాయి. అలానే మిరియాల చూర్ణం ఒకభాగం, ఎండించిన తెల్లగలిజేరు చూర్ణం రెండు భాగాలు “కలిపి ఉదయంపూట మాత్రమే పెరుగుతో కలిపి సేవిస్తున్నను పచ్చకామెర్లు చాలా త్వరితంగా తగ్గుతాయి.
తెల్లగలిజేరు, మిరియాల చూర్ణం, జీలకర్ర చూర్ణాల్ని సమానంగా కలిపి కుంకుడు గింజ ప్రమాణం మాత్రలు చేసి ఎండించి పూటకొక మాత్ర చొప్పున కూడు పూటలూ తీసుకుంటుంటే ముఖం, కాళ్ళు, చేతులు వాపులు తగ్గి ఉబ్బు, ‘ కామెర్లుగా పిలువబడే వ్యాధి తగ్గుతుంది. జీర్ణ శక్తి వృద్ధి అవుతుంది. గర్భిణీ స్త్రీలలో కలిగే వాపులు తగ్గుతాయి.రెండు గ్లాసుల నీటిలో రెండు స్పూన్ల తెల్లగలిజేరు చూర్ణం కలిపి అరగ్లాసు నీరు మిగిలేలా మరిగించి వడగట్టి అందులో తగినన్ని పాలు, అవు నెయ్యి కలిపి మరల నెయ్యి మాత్రం మిగిలేలా మరిగించి, చల్లార్చి, వడగట్టి నిల్వ వుంచుకుని రెండు స్పూన్ల ఆ నెయ్యిని ఒక స్పూను అతిమధుర చూర్ణంలో కలిపి సేవిస్తుంటే మద్యపాన సేవనవల్ల కలిగే మత్తు, భ్రమ హరిస్తుంది.
also read వేసవి తాపాన్ని చల్లార్చే వట్టివేళ్లు
గలిజేరు ఆకుల్ని దంచి వెచ్చజేసి కడుతుంటే బోదకాలు, వృషణాల వాపుల్లో సుగుణం కనిపిస్తుంది.
తెల్లగలిజేరు రసం పైన పూస్తుంటే ఒంటి దురదలు తగ్గుతాయి. తెల్లగలిజేరు వేర్లలో కొద్దిగా ఉప్పు చేర్చి మెత్తగా నూరి కుంకుడు గింజ ప్రమాణం మాత్రలు చేసి రోజూ రెండు మాత్రలు మింగుతుంటే మూత్రంలో తెల్లటి పదార్థం పోవటం తగ్గుతుంది. ప్రయోగ శాలలో జరిగిన అధ్యయనాలలో గలిజేరులో పునర్నవిన్, సపోనిన్ మొదలగు అంశాలున్నట్లు కనుగొన్నారు
ఒకభాగం మిరియాలు, నాల్గు భాగాల తెల్లగలిజేరు చూర్ణాలలో తగినంత గలిజేరు స్వరసం కలిపి నూరి కుంకుడు గింజంత మాత్రలు చేసి ఎండించి వ్యాధి తీవ్రతను బట్టి ఒకటి, రెండు మాత్రల చొప్పున వేడి నీరు లేదా అల్లం రసంతో సేవిస్తుంటే ఉబ్బస వ్యాధిలో ఉపశమనం కలుగుతుంది. ఈ మాత్రలను పలుచటి మజ్జిగతో రోజూ ఉదయం, సాయంత్రం సేవిస్తుంటే అధిక బరువు తగ్గేందుకు దోహదపడతాయి.
సమూలంగా ఎండించి కాల్చిన గలిజేరు బూడిదకు ఆయుర్వేద మందుల విక్రయశాలల్లో దొరికే మండూర భస్మాన్ని సమానంగా కలిపి రోజు రెండుసార్లు
కీళ్ళవాపులు, నొప్పులు కూడా తగ్గుతాయి.
చిటికెడు మందును తేనెతో కలిపి తీసుకుంటుంటే పాండు వ్యాధి. తద్వారా కలిగే వాపులు, ఒళ్ళు పాలిపోయినట్లుండటం, ఆయాసం తగ్గుతాయి. మిరియాలు, తెల్లగలిజేరు ఆకు కలిపి నూరిన గంధాన్ని తలకు పట్టిస్తుంటే : పార్శపునొప్పి తగ్గుతుంది. తెల్లగలిజేరు, దేవదారు చెక్క, మునగపట్ట, శొంఠి, తెల్లావాలు సమానంగా తీసుకొని నిమ్మరసంతో నూరి ఆయా భాగాలపై పట్టువేస్తుంటే వాపు, నొప్పి తగ్గుతాయి.
రెండు స్పూన్ల తెల్లగలిజేరు చూర్ణాన్ని రెండు గ్లాసుల నీటిలో వేసి అరగ్లాసు నీరు మిగిలేలా మరగించి పావుస్పూను వంతున శొంఠి, కచోరాల చూర్ణం కలిపి రోజూ రెండుమార్లు సేవిస్తుంటే కీళ్ళవాతం, కీళ్ళవాపులు, నొప్పులు తగ్గుతాయి.
Also Read అత్తగారింటికి పోవడానికి ఆర్టీసీ బస్సు చోరీ..
తెల్లగలిజేరు సమూలరసం రెండు స్పూన్ల వంతున ఉదయం, సాయంత్రం సేవిస్తుంటే శరీరమంతా నీరుచేరి వాపులుండటం తగ్గుతుంది. మూత్రం ధారాళంగా వస్తుంది. మూత్రపిండాల్లో రాళ్ళున్నవారిలో సుగుణం కనిపిస్తుంది. తెల్ల గలిజేరు ఆకులు, ధనియాలు, గసగసాలు మంచి నీటితో మెత్తగా నూరి నుదురుకు లేపనం చేస్తే తల తిరిగే సమస్య తగ్గుతుంది. తెల్ల గలిజేరు సమూలం రసం, నువ్వుల నూనె సమంగా కలిపి సన్నమంటపై రసమంతా ఇగిరి నూనె మాత్రం మిగిలేటట్లు మరిగించి దించి చల్లార్చి వడగట్టి నిల్వ యుంచుకుని మర్దన చేస్తుంటే కీళ్ళ నొప్పులు లాంటి వాత వ్యాధులు తగ్గుతాయి.
గుండెదడ సమస్య తగ్గేందుకు కూడా ఈ మొక్కచాలా వుపకరిస్తుంది. ఈ సమస్యకు తెల్లగలిజేరు ఆకురసంలో సగం పటిక బెల్లం (కలకండ) పొడి కలిపి పొయ్యిపై పెట్టి లేతపాకం వచ్చేలా మరిగించి దించి చల్లార్చి నిల్వయుంచుకుని రోజూ రెండు పూటలా పూటకు కప్పు నీటిలో రెండు చెంచాల ఈ ఔషధం, రెండు ..చెంచాల పన్నీరు కలిపి సేవిస్తుండాలి. పునర్నవారిష్ట, పునర్నవాది మండూరం మొదలగు ఆయుర్వేదౌషధాల తయారీలో కూడా ఈ గలిజేరును ఉపయోగిస్తారు