వయ్యారిభామ – తిక్కబంగి ఆకు
వయ్యారిభామను మనం క్యారెట్ గడ్డి, నక్షత్ర గడ్డి అని కూడా అంటాము. ఈ కలుపు మొక్క అమెరికా నుండి దిగుమతి అయిన గోధుమల ద్వారా మొదట మన దేశంలో తర్వాత రాష్ట్రంలో ప్రవేశించి కొద్ది సంవత్సరాల్లోనే పంట పొలాల్లో, బంజరు భూముల్లో, జనావాసాల్లోను విస్తరించింది. వయ్యారిభామ (పార్టీనియం) ఒక సమస్యాత్మకమైన కలుపు మొక్క వయ్యారిభామ ఏకవార్షిక మొక్క వాతావరణం అనుకూలంగా ఉంటే ఇది నాలుగు వారాల్లో పుష్పిస్తుంది. పుష్పాలు తెల్లగా ఉంటాయి. ఒక్కొక్క మొక్క 10,000 నుండి 50,000 వరకు విత్తనాలు ఉత్పత్తి చేస్తుంది. అధిక విత్తనోత్పత్తి, విత్తనవ్యాప్తి, ఇతర మొక్కలపైన రసాయనాల ప్రభావం, పశువులు తినలేక పోవడం, అన్ని రకాల వాతావరణాలను తట్టుకొనే శక్తి మొదలైన లక్షణాల వల్ల ఈ మొక్కలు ఇంతగా విస్తరిస్తున్నాయి.
వయ్యారిభామ వలన కలిగే నష్టాలు: పార్థీనియం కలుపు మొక్క మొక్కలకే కాక మానవులకు, జంతువులకు హాని కలుగజేస్తుంది.
- పంట పొలాల్లో 40 శాతం దిగుబడి, పశుగ్రాసాల్లో 90 శాతం దిగుబడిని తగ్గిస్తుంది.
- ఈ మొక్క వేర్ల నుండి స్రవించబడే కొన్ని రకాల రసాయనాలు పైరు మొక్కల దిగుబడిని తగ్గిస్తాయి.
” ఈ మొక్క పుప్పొడి టమాట, వంగ, మిరప, మొక్కజొన్న పుష్పాలపై పడినప్పుడు ఫలోత్పత్తి నిరోధించబడుతుంది. - కొన్ని రకాల వైరస్లకు ఆశ్రయం ఇవ్వటం ద్వారా మొక్కల్లో వివిధ రకాల వైరస్లకు రోగాల వ్యాప్తికి సహకరిస్తుంది. ఉదా: వేరుశనగ, ప్రొద్దుతిరుగుడు పంటల్లో కాండం కుళ్ళు తెగులు.
‘ దీనివల్ల మానవులకు డెర్మాటైటిస్ లేదా ఎగ్జిమా, హైఫీవర్, ఉబ్బసం, బ్రాంఖైటిస్ లాంటి వ్యాధులు వస్తాయి. - పశువుల్లో వెంట్రుకలు రాలిపోవడం. హైపర్టెన్షన్కు గురికావడం వల్ల వాటి ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది.
పై అన్ని కారణాల వల్ల ఈ కలుపు మొక్కను సమూలంగా నిర్మూలించడం రైతులకు చాలా అవసరం.
వయ్యారిభామ నిర్మూలన యాజమాన్యం : జీవనయంత్రణ మరియు యాజమాన్య పద్దతులు మూడింటిని కలిపి సమర్థవంతంగా వినియోగించడం వలన వయ్యారిభామను సమర్ధవంతంగా నిర్మూలించవచ్చు..
యాజమాన్య పద్ధతులు.. Also Read ఆరోగ్యానిచ్చే ఆహారపు పంటగా జొన్న
చేతితో పీకి వేయడం: తక్కువ విస్తీర్ణంలో ఉన్నప్పుడు సులభంగా చేయవచ్చు. కానీ ఎక్కువ విస్తీర్ణంలో ఈ పద్దతి వీలుకాదు. ఈ మొక్కను పూతకు రాక ముందే పీకివేసి తగులబెట్టాలి లేదా కంపోస్టు చేయడానికి ఉపయోగించాలి. పూతకు వచ్చిన తర్వాత పీకినట్లయితే, పీకిన మొక్కలను వెంటనే తగులబెట్టి విత్తనవ్యాప్తి నిరోధించాలి. మొక్కలు పీకేటప్పుడు చేతులకు తొడుగులు ధరించాలి లేదా ఎలర్జీ కలుగని వ్యక్తులను ఈ పనికి నియమించాలి.
పంట మార్పిడి: బంతితో పంట మార్పిడి చేస్తే తర్వాత వేసే పైరులో పార్టీనియం ఉధృతి తక్కువగా ఉంటుంది.
జీవ నియంత్రణ పద్ధతులు
జైగ్రామా బైకొలరేటా అనే క్రైసోమిలిడ్ జాతికి చెందిన పెంకు పురుగులు పార్టీనియం మొక్కలను విపరీతంగా తింటాయి. ఈనెలు మాత్రమే వదిలి పూర్తిగా ఆకులను తినే ఈ పెంకు పురుగులు పార్టీనియం కలుపు నివారణలో ఎంతో ప్రాముఖ్యాన్ని వహిస్తాయి. ఒక ఆడ పెంకు పురుగు 1500 నుండి 1800 గ్రుడ్లు పెడుతుంది. ఆకుల అడుగుభాగంలో పెట్టిన గుడ్లు నాలుగైదు రోజులలో పొదగబడి పిల్ల పురుగులు కూడా ఆకులను విపరీతంగా తింటాయి. ఈ పెంకుపురుగులు వర్షాకాలంలోనే అనగా జూన్ నుండి అక్టోబర్ వరకు మాత్రమే పార్టీనియంపై కనబడతాయి. ఆ తర్వాత శీతాకాలం మరియు వేసవికాలం ప్రతికూల పరిస్థితులను తట్టుకోవడానికి భూమి లోపలికి పోయి దాదాపు 6 నుండి 8 నెలలు నిద్రావస్థ దశలో గడుపుతాయి. వర్షాలు పడగానే అవి నిద్రావస్థ నుండి బయటపడి భూమిపైకి వస్తాయి. ప్రతి మొక్కకు సుమారు 20 నుండి 30 పురుగులు చొప్పున ఉండి ఒక మొక్క నుండి వేరొక మొక్క మీదకు ఎగురుతూ వెళ్తాయి. పార్టీనియం కలుపు మొక్కలపై గమనిస్తే వాటిని అలాగే పెరగటానికి అవకాశం ఇవ్వాలి. ఎలాంటి పురుగు మందులు చల్లకూడదు.
పార్థీనియం మొక్కలను కొన్ని రకాలైన ఆకుమచ్చ తెగుళ్ళు, బూడిద తెగులు, ఎండు తెగులు ఆశిస్తాయి. ఈ మొక్కలు గమనించినప్పుడు పీకకుండా ఉంటే మిగిలిన మొక్కలకు ఈ తెగుళ్లు ఆశించి నాశనం చేస్తాయి. మైకోప్లాస్మా అనే తెగులు ఆశించిన పార్టీనియం మొక్కల పెరుగుదల తగ్గిపోయి పూత రావడం ఆగి, విత్తనోత్పత్తి ఆగిపోతుంది.
కసివింద జాతికి చెందిన కలుపు మొక్కలు పార్టీనియం కలుపు మొక్కలతో పాటు పెరుగుతాయి. కసివిందతో పాటుగా వెంపలి, స్టైలో, క్రోటాన్ స్పార్సిఫ్లోరస్, హిస్టిస్, తొటకుర, సిడా ఎక్యూటా మొదలగు మొక్కలు ఇదే ప్రభావాన్ని పార్థీనియంపై కలిగించి దాని పెరుగుదలను తగ్గిస్తాయి.
పార్థీనియం నివారణకు కసివింద విత్తనాలు చల్లి వృద్ధి పరచాలి. కసివింద నిలదొక్కుకోవడానికి అవసరమైన చర్యలు చేపట్టి పార్టీనియం మొక్కలను నిర్మూలించి కసివింద మొక్కల పెరుగుదలను ప్రోత్సహింపవచ్చు. కాబట్టి రైతులు పైన తెలిపిన పద్ధతులను సమర్థవంతంగా ఉపయోగించి పార్థీనియం కలుపు మొక్కను నివారించవచ్చును.
ఉపయోగించి పార్థీనియం కలుపు మొక్కను నివారించవచ్చును. సామాజిక ఆరోగ్య భద్రత దృష్ట్యా వయ్యారిభామ వంటి సమస్యాత్మక కలుపు మొక్కలను సమర్థవంతంగా నిర్మూలించడం అవసరం మాత్రమే
కాక సామాజిక పరంగా మన అందరి బాధ్యత.
Also Read అత్తగారింటికి పోవడానికి ఆర్టీసీ బస్సు చోరీ..
డా. పి. మధుకర్ రావు, డా. జి. మంజులత, డౌ. డి. శ్రావణి, డా. జి. ఉషారాణి,
డా. ఎ. విజయభాస్కర్, డా. ఎమ్. రాజేంద్రప్రసాద్, డా. కె. మదన్ మోహన్
రెడ్డి, వ్యవసాయ పరిశోధన స్థానం మరియు ఏరువాక కేంద్రం, కరీంనగర్…