బ్లూ జావా అరటిపండ్లు
వనిల్లా కస్టర్డ్ ఐస్ క్రీం గుర్తుకొచ్చే రుచి… బ్లూ జావా అరటిపండు. ఇది కొత్త రకం అరటిపండు. అరటిలో వందల రకాలున్నాయి. వాటిని యాభై రకాలుగా విభజించారు. ఎలాగంటే- విత్తనాలు లేదా విత్తన రహితమైనవి, విస్తృత శ్రేణి పరిమాణాలు, ఆకారాలు, రంగులతో కూడిన పండ్లుగా విభజించారు.
కొన్ని అరటిపండ్లు యాభై సెంటీమీటర్ల పొడవుంటే మరికొన్ని అంతకన్నా తక్కువ పొడవుంటాయి. అడవి అరటి రకాలలోకి మూసా అక్యుమినాటా, మూసా బాల్బిసియానా వంటివి వస్తాయి. అలాగే వాణిజ్య అరటి రకాలుగా ట్రిప్లాయిడ్ వంటి వాటిని పేర్కొంటారు. అయితే చాలా అరటిపండ్లు మూసా అక్యుమినాటా, మూసా బాల్బిసియానా, ఎఎబి, లేదా ఎబిబి రకాలు.
ఉష్ణమండలం ఎగుమతులయ్యే వాటిలో కావెండిష్ రకం అధికం. వీటిలోనే పొడుగు, పొట్టి రకాల అరటిపండ్లున్నాయి.
గ్రాస్ మిచెల్
ఇవి ఆకర్షణీయమైన రంగులో పండవుగా ఉంటాయి. ఈ రకం అరటిపండు రుచిగా కూడా ఉంటుంది. అరటి పండ్లలోనే కొన్ని అత్యంత ప్రజాదరణ పొందిన రకాలున్నాయి. బగ్లో , పిసంగ్ అవాక్, హార్టన్, కుర్రేరె. ఇలా రకరకాల అరటిపండ్ల గురించి చెప్పుకుంటూ పోతే ఇక్కడ చోటు చాలదు. కనుక ప్రత్యేకించి ఒక రకం అరటి పండు గురించి తెలుసుకుందాం..
గత కొంత కాలంగా ఓ కొత్త రకం అరటిపండు మన ముందుకొచ్చింది. దాని పేరు బ్లూ జావా అంటే పేరుకు తగ్గేట్టే నీలం రంగు తొక్కతో ఉండే ..
Also Read..నల్లమల అడవులకు రానున్న గజరాజులు
పండు తొక్క నీలం రంగులో ఉంటే లోపం క్రీం కలర్లో ఉండి తింటున్నంతసేపూ వనిల్లా కస్టర్డ్ ఐస్క్రీం గుర్తుకొస్తుందట.
చూడటంతోనే ఆకట్టుకునే ఈ పండుకున్న ప్రత్యేకత దాని రుచి..అంటున్నారు శాస్త్రవేత్తలు. దీని రుచి
మధురాతి మధురమని తిన్నవారి మాట.
అయితే ఈ రకం అరటిపండ్లు దొరకడం అరుదు. అవి అన్ని ప్రాంతాల్లో లభించవు. ఇది మొట్ట మొదటగా ఆగ్నేయాసియాలో ఉద్భవించిన హైబ్రిడ్ అరటి చెట్టు.
హవాయి, ఇతర పసిఫిక్ దీవులలో కూడా ఈ పండ్లు సహజంగానే పెరుగుతుండటం గమనార్హం.
ఈ రకం అరటిపండ్లకు ఐస్క్రీం ‘అరటి’ అని కూడా పేరు ఉంది.
ఎందుకంటే ఈ పండు ప్రత్యేకమైన రుచి, స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. ఫిజీలో వీటిని ‘హవాయి బనానా’ అని పిలుస్తారు. ఫిలిప్పీన్స్ లో వీటిని ‘క్రీ’ అని, మధ్య అమెరికాలో ‘సెనిజో’ అని అంటారు.
ఈ నీలి రంగు జావా అరటిపండ్లు, సీడెడ్ అరటిపండ్లు, మూసా అక్యుమినాటా, మూసా బాల్బిసియానా ట్రిప్లాయిడ్ హైబ్రిడ్ రకం బ్లూ జావా అరటిచెట్లు 15 నుండి 20 అడుగుల ఎత్తువరకు పెరుగుతాయి.
ఈ చెట్టు ఆకులు వెండి-ఆకుపచ్చ రంగులో ఉంటాయి. అలాగే అవి సరైన పెరుగుదలకు 40 డిగ్రీల ఫారెన్ హీట్ ఉష్ణోగ్రత అవసరం.
అయితే ఒక్క విషయం… ఈ అరటికాయలు పండగానే మామూలు పసుపు రంగు తొక్కనే కలిగి ఉంటాయి. ఈ రకం అరటిపండ్లలో పోషక పదార్థాలు మెండుగానే ఉన్నాయట.
బ్లూ జావా అరటిపండ్లు
విటమిన్లు సి, బి6 ఉన్న ఈ అరటి పండ్లలో ఐరన్, పాస్ఫరస్, థియామిన్, సెలినియం వంటివి కలిసుండటం విశేషం. ఒక గెలలో వంద పండ్లదాకా ఉంటాయి.
పండు 18 నుండి 23 సెంటీమీటర్లు (7 నుండి 9 అంగుళాలు) పొడవు ఉంటుంది. ఈ రకం మొక్కను నాటిన తర్వాత 15-24 నెలల తర్వాత వికసిస్తాయి.
115 నుండి 150 రోజుల తర్వాత కోతకు వస్తాయి. అరటిపండ్లు మనిషి పిడికిలిని పోలి ఉండటం వలన వీటిని ‘నకిల్స్’ అని పిలుస్తారు.
Also Read..YABER PRO V9 WiFi 6 Bluetooth Projector
బ్లూ జావా అరటిపండ్లను అలాగే తినొచ్చు లేదా ఉడికించి కూడా తినవచ్చట.