సుస్థిర వ్యవసాయం అంటే ఏమిటి?
‘సుస్థిర వ్యవసాయం అంటే పర్యావరణం మరియు జీవజాతులను రక్షించే వివిధ వ్యవసాయ పద్ధతులను ఉపయోగించి మొక్కలు లేదా జంతువుల నుండి ఆహారాన్ని ఉత్పత్తి చేయడం. పంట దిగుబడి పెంచడానికి రసాయన పురుగుల మందులు మరియు ఎరువులను విస్తృతంగా ఉపయోగించడం వల్ల దిగుబడి మరియు ఉత్పాదకత పొందవచ్చు, కానీ ఈ ఎరువులతో వ్యవసాయం ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు నేల ఉత్పత్తి సామర్థ్యం క్షీణించటానికి, కారణం అవుతుంది.
సుస్థిర వ్యవసాయంలో వానపాముల పనితీరు:
వానపాములను రైతు మిత్రుడు, పొలం దున్నేవారు, భూమి యొక్క ప్రేగులు, పర్యావరణ ఇంజనీర్లు మరియు జీవ సూచికలు అని కూడా పిలుస్తారు. వానపాములు వివిధ రకాల సేంద్రియ వ్యర్థ పదార్థాలను పోషకాలు అధికంగా ఉండే ఉత్పత్తులుగా మార్చడం ద్వారా నేల యొక్క భౌతిక రసాయనిక లక్షణాలను పెంపొందిస్తాయి మరియు వాటి బొరియల నుండి విడుదలయ్యే మల పదార్థాన్ని (వర్మీకాస్ట్) ఉపరితలంపై జమచేస్తాయి.
Also Read వరి నాటే యంత్రము తో రైతుకు మేలు
సాధారణంగా 3 రకాల వానపాములు నేలలో ఉంటాయి
- భూమి లోతైన పొరలలో నివసించే వానపాములు: ఉదా: లాంపిటా మారుతి
ఈ వానపాములు భూమిలో లోతైన మరియు శాశ్వతమైన
బొరియలు చేసుకొని జీవిస్తాయి. రాత్రిపూట మాత్రమే బొరియల నుండి
భూమి ఉపరితలానికి వచ్చి సేంద్రియ పదార్థాన్నితింటాయి. కావున ఈ వానపాములు వర్మికంపోస్ట్ తయారీకి అనువైనవి కావు. 2. భూమి లోపల పొరలలో నివసించే వానపాములు ఉదా:
పెంటాస్కాలెక్స్ మరియు ద్రావిడా
ఈ వానపాములు భూమిలో తక్కువ లోతైన బొరియలు చేసుకొని నివసిస్తాయి. ఇవి నేలలో ఉన్న సేంద్రియ పదార్థాన్ని తింటాయి. ఇవి భూమి ఉపరితలానికి అరుదుగా వస్తాయి. కావున ఇవి వర్మికంపోస్ట్ తయారీకి అనువైనవి కావు. - భూమి ఉపరితలం మీద నివసించే వానపాములు ఉదా: ఐసినియా ఫొటిడా
ఈ వానపాములు భూమిపై పొరలలో బొరియలు చేసుకొని సేంద్రియ పదార్ధాన్ని తింటాయి. కావున ఇవి వర్మికంపోస్ట్ తయారీకి అనువైనవి. ఇవి శాశ్వత బొరియలు ఏర్పాటు చేయవు. ఉదా: యుడ్రిల్లన్ యుజినియ, పెరియోనిక్స్ ఎక్సకావేటస్
వానపాములు హెర్మాఫ్రోడైటాలు అనగా ప్రతి వానపాములో మగ మరియు ఆడ రెండు అవయవాలు ఉంటాయి. అవి భూమి యొక్క లోపల నుండి మట్టిని పైపొరల్లోకి తీసుకువచ్చే అవిశ్రాంతంగా పని చేసే జీవులు. ఈ వానపాములు నేలలో లోతుగా సొరంగం చేసి భూసారాన్ని ఉపరితలానికి తీసుకుని, మట్టితో కలుపుతాయి. దీనితో పాటు అతి చిన్న పరిమాణం కలిగిన సరళ సొరంగాల సమూహంగా ఏర్పడుతాయి. వానపాములు చనిపోయిన తర్వాత కూడా సొరంగాలు ఎక్కువ కాలం ఉంటాయి. ఈ సొరంగాలు నీటిని భూగర్భంలోకి చొప్పించడాన్నిసులభతరం చేస్తాయి మరియు నీటి ప్రవాహాన్ని తగ్గిస్తాయి. వర్షపు నీటిని నేలలో నిల్వ చేయడంలో సహాయపడుతుంది. అటువంటి నిల్వ తేమ నెమ్మదిగా వేసవికాలంలో పంటకు విడుదల అవుతుంది.
సుస్థిర వ్యవసాయంలో వానపాముల పాత్ర
- ఇవి నేలలో సూక్ష్మ రంధ్రాలను ఏర్పాటు చేయడం వలన నీటి చొరబాటు రేటును పెంచుతాయి మరియు నేలకోతను తగ్గిస్తాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం వానపాములు విటమిన్ బి మరియు విటమిన్ డి వంటి కొన్ని ఎంజైములను నేలలోకి విడుదల చేస్తాయి. ఇవి మొక్కల పెరుగుదలకు దోహదపడుతాయి. వానపాములు భూమిని సారవంతమైన భూమిగా మార్చగలవని మరియు వ్యవసాయ ఉత్పత్తిని పెంచగలవని వివిధ అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.
- వర్మికాస్ట్లో ఉండే హ్యుమిక్ ఆమ్లాలు మరియు హార్మోన్లు పంట దిగుబడి పెంచుతాయి. వర్మికంపోస్టును రసాయనిక ఎరువులతో పాటుగా, సమీకృత పోషకాల నిర్వహణలో పంటలలో వాడడం వలన రసాయనిక ఎరువుల వాడకం గణనీయంగా తగ్గుతుంది. ఈ సేంద్రియ పదార్ధం ఉపయోగం వలన వివిధ మార్గాల్లో మొక్కలు పెరుగుదలను మెరుగుపరుస్తుంది. అనగా ఆకుల సంఖ్య, విత్తనాలు మొలకశాతం, వేరు బయోమాస్, పండ్ల ఉత్పత్తి, విత్తనాల సంఖ్య మరియు దిగుబడి గణనీయంగా పెరుగుతుంది. ఇది చెక్కర, నూనె మరియు ప్రోటీన్ సమ్మేళనాలను పెంచడం ద్వారా పంటల పోషక నాణ్యతను మెరుగు పరుస్తుంది. నేలలోని ఈ చిన్నజీవులు మానవాళికి తమ అమూల్యమైన సేవలను అందిస్తూ ఉండేలా రక్షించడం అత్యంత అవసరం
Also Read అత్తగారింటికి పోవడానికి ఆర్టీసీ బస్సు చోరీ..
- నేలలో వానపాముల సంతతి పెంచే మార్గాలు
- మోతాదుకు మంచి రసాయనిక ఎరువులను పంటలలో వాడరాదు.
- సిఫారసుకు మించి పురుగు మందులను వాడరాదు.
- ລ້ సంవత్సరం కాంపోస్ట్ లేదా పచ్చిరొట్ట ఎరువులను పొలంలో వేయాలి.
- నేలలో తగినంత తేమ ఉండాలి.
- పంట పొలంలో ప్లాస్టిక్ లేదా పరిశ్రమల వ్యర్థాలను వేయరాదు.
- పొలంలో నీటి పారుదల వ్యవస్థ సరిగ్గా ఉండాలి.
- నేల గట్టిగా ఉండకూడదు మరియు బరువైన వ్యవసాయ
పనిముట్లను నేలలో వాడరాదు. - వీలైనంత వరకు తక్కువగా పొలంను దున్నాలి మరియు భూమిపై పొరల వరకు మాత్రమే దున్నడం మంచిది.
డా. టి. వినోద్ కుమార్, వ్యవసాయ విస్తరణ విభాగ శాస్త్రవేత్త, బి. భాస్కర్
రావు, ఉద్యాన శాస్త్రవేత్త, డాక్టర్ ఎ. శ్రీనివాస్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ మరియు
ప్రోగ్రాం కోఆర్డినేటర్, కృషి విజ్ఞాన కేంద్రం, రామగిరిఖిల్లా, పెద్దపల్లి జిల్లా