విజయవాడ వరద బాధితుల సహాయార్థం సిఎం రిలీఫ్ ఫండ్ కు శ్రీశైలం నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన రూ. 2, 22,70,749/- కోట్ల రూపాయల విరాళాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శ్రీశైలం ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారు అందజేశారు.
బుడమేరు వరద విపత్తులో సర్వం కోల్పోయిన విజయవాడ వాసులకు అండగా తమవంతు సహాయం చేయడానికి ముందుకు వచ్చి విరాళాలు అందించిన శ్రీశైలం నియోజకవర్గ ప్రజలకు , ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి కి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కృతజ్ఞతలు తెలిపారు.
వరద బాదితుల సహాయార్థం విరాళం అందించిన దాతల వివరాల లిష్టు ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి శ్రీశైలం ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి అందజేశారు. లిస్టును సిఎం చంద్రబాబు నాయుడు పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల చిత్రపటం, ప్రసాదం మరియు శేషవస్త్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అందజేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు శ్రీ ఎన్.యం.డి ఫరూక్ గారు, శ్రీ బిసి జనార్ధన్ రెడ్డి గారు, శ్రీశైలం నియోజకవర్గ ముఖ్య నాయకులు, మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జీలు , తదితర నాయకులు పాల్గొన్నారు.
Plz aap Instalationhttps://play.google.com/store/apps/details?id=com.ravindra.news&pli=1
ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పిలుపుకు అనూహ్య స్పందన
ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పిలుపుకు అనూహ్య స్పందన వచ్చింది. విజయవాడ వరద బాధితుల కోసం శ్రీశైలం నియోజకవర్గం తరఫున సీఎం రిలీఫ్ ఫండ్ కు మన వంతు సహాయ సహకారాలు అందించాలని నియోజకవర్గ ప్రజలు తమకు తోచినంత సహాయం చేసి .. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీశైలం నియోజకవర్గం తరఫున అత్యధిక విరాళాన్ని అందజేసేలా ఉండాలని పిలుపునిచ్చారు.
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పిలుపుమేరకు నియోజకవర్గం నలుమూలల నుండి పార్టీలకు అతీతంగా తమ వంతు వంతుగా విరాళాలను విరాళాలన్నీ విరాళాలు అందజేశారు. తక్కువ సమయం లోనే ఇంత భారీ మొత్తాన్ని సమకూర్చడం సంతోషదగ్గ విషయమని.. తన పిలుపుమేరకు తమ వంతు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్క నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఇలా విపత్తు సమయంలో అందరూ కలిసికట్టుగా రావడం శుభ పరిణామం అని అన్నారు.
Also Read నల్లమల ఫారెస్ట్ లోకి అడవిదున్న రాక
అమరావతి,
19.09.24.
ముఖ్యమంత్రి సహాయనిధికి శ్రీశైలం నియోజకవర్గం తరపున దాదాపు రూ. 2.23 కోట్ల విరాళం
వరద బాధితుల సహాయార్ధం ముఖ్యమంత్రి సహాయనిధికి శ్రీశైలం నియోజకవర్గం తరపున రూ. 2,22,70,749/- అక్షరాలా రెండు కోట్ల ఇరవై రెండు లక్షల డైబ్బైవేల ఏడు వందల నలభై తొమ్మిది రూపాయులు విరాళం అందజేయడం జరిగింది. నేడు వెలగపూడిలోని సచివాలయంలో రోడ్లు & భవనాలు, మౌలిక సదుపాయాలు & పెట్టుబడులు శాఖ మంత్రి బీ.సి. జనార్దన్ రెడ్డి, న్యాయ & మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎండీ ఫరూక్ గారి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారిని కలిసి 2,22,70,749 కోట్ల రూపాయులు చెక్కును శ్రీశైలం నియోజకవర్గం ప్రజల తరపున ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అందజేశారు.. వరద బాధితులకు తమ వంతుగా సాయం అందించాలనే సదుద్దేశ్యంతో శ్రీశైలం నియోజకవర్గంలో గ్రామగ్రామాన తిరిగి ప్రజల దగ్గర విరాళాలు సేకరించిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని, స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు అందజేసిన శ్రీశైలం నియోజకవర్గం ప్రజలు రాష్ట్రానికే ఆదర్శప్రాయంగా నిలిచారని ముఖ్యమంత్రి కొనియాడారు. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని మంత్రులు బీ.సీ జనార్ధన్ రెడ్డి, ఎన్. ఎండీ. ఫరూక్ లు సైతం అభినందించారు.
జారీ చేసిన వారు : రోడ్లు & భవనాలు, మౌలిక సదుపాయాలు & పెట్టుబడులు మంత్రిత్వ శాఖ, అమరావతి.