కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం : CM రేవంత్ రెడ్డి

On Central Budget CM Revanth Reddy

On Central Budget CM Revanth Reddy

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగింది : CM రేవంత్ రెడ్డి ఫైర్

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజీనామా చేయాలి

న్యూ ఢిల్లీ : జులై 23 కేంద్ర బడ్జెట్ పై తీవ్రంగా స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్రంలోని మోదీ సర్కార్ పై ఆయన నిప్పులు చెరిగారు.

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ పట్ల కక్ష పూరితం గా వ్యవహరించారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

వికసిత్ భారత్ లో తెలంగా ణ భాగం కాదన్నట్లుగా కేంద్రం తీరు ఉందని ధ్వజ మెత్తారు.

బీహార్, ఏపీకి తప్ప ఇతర రాష్ట్రాలకు కేటాయింపులు లేకపోవడం దారుణం అన్నారు.

ఓట్లు, సీట్లు మాత్రమే తెలం గాణ నుంచి కావాలి..కానీ, తెలంగాణ ఆత్మగౌరవం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి పట్టింపు లేదని మరోసారి రుజువైందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

బడ్జెట్ లో తెలంగాణకు నిధులు కేటాయించాలని కోరుతూ ఢిల్లీకి 14సార్లు వెళ్లి వినతిపత్రాలు ఇచ్చి నా.. తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి నిధులు కేటాయిం చలేదని సీఎం రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read Samsung 189 cm (75 inches) 8K Ultra HD Smart Neo QLED TV

ప్రధాని మోదీని తాము పెద్దన్నగా భావించామని, తెలంగాణకు పెద్దన్నగా న్యాయం చేయాలని, నిధులు కేటాయించాలని ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులను కోరినా ప్రయో జనం లేకపోయిందన్నారు.

కేంద్ర బడ్జెట్ లో కనీసం తెలంగాణ అనే పదాన్నే ఉచ్చరించలేదని సీఎం రేవంత్ అన్నారు.

కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఇవాళ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

బీజేపీ అధ్యక్షుడిగా, నరేంద్ర మోదీ మంత్రివర్గంలో యూ నియన్ కేబినెట్ మినిస్టర్ గా కిషన్ రెడ్డి బాధ్యత వహిం చాలి.

తెలంగాణకు జరిగిన అన్యాయానికి తెలంగాణ ప్రజలకు వెంటనే క్షమాప ణలు చెప్పి, తక్షణమే మోదీ మంత్రివర్గం నుంచి కిషన్ రెడ్డి తప్పుకోవాలి” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Aslo Read సప్తనదుల సంగమేశ్వరం క్షేత్రం విశిష్టత

కేంద్ర బడ్జెట్లో అన్ని రాష్ట్రాలకు కేటాయించిన విధంగానే తెలంగాణ రాష్ట్రానికి కూడా కేటాయించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పట్ల పక్షపాతి ధోరణి మాను కోవాలని ఆయన డిమాండ్ చేశాడు. భారతదేశంలో ఉన్న రాష్ట్రాలకు సమన్యాయం చేయాలని , పక్ష పాత ధోనీ మాను కోవాలని అన్నారి . బిజెపి పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు బడ్జెట్ ఒక రకంగా కేటాయిస్తే బిజెపి అధి కారంలో లేని రాష్ట్రాలకు మాత్రం మరోలా బడ్జెట్ ఉందని . ఎన్నికల వరకే పార్టీలు చూడాలి తప్ప అధికారం లోకి వచ్చిన పార్టీలు పాలనా పరమైన అంశంలో పక్ష పాతం మానుకోవాలని అన్నారు . ఈ విధానగా రాష్ట్రాలను అణచి వేసే దిశగా ప్రధాన మంత్రి మోడీ వ్యవ హరించడం సిగ్గు చేటని అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top