పది రూపాయల కాయిన్ వద్దంటే జైలుకే..!

Ten rupees coin validity

Ten rupees coin validity

చిల్లరకు బదులు వినియోగ దారులకు చాక్లెట్లు, ఇతర తిను పదార్ధాలు ఇవ్వడం వ్యాపా రులకు పరిపాటిగా మారింది.

అంతే కాకుండా పది రూపాయల నాణెం చెల్ల దంటూ తిరస్కరిం చడం అలవాటై పోయింది. అయితే, కొనుగోలు దారులు ఇచ్చే ఈ నాణేలను..

దుకాణ దారులు తీసు కోక పోతే, ఫిర్యాదు ఆధారంగా మూడేళ్ల జైలు శిక్షపడే అవకాశం ఉందని భారత రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ప్రక టించింది.

ప్రస్తుతం ఫోన్పే, గూగుల్ పే. పేటీఎం ద్వారా చెల్లింపులు వేగవంత మయ్యాయి. వస్తువుల కొనుగోలు, చెల్లింపుల్లో ఇవి కీలకంగా మారాయి.

గతంలో మాదిరిగా కార్డులు, క్యాష్ చెల్లింపులు చాలా వరకు తగ్గిపోయాయి. దీంతో నాణేల మార్పిడి దాదాపు నిలిచి పోయింది.

Also Read..నల్లమల అడవులకు రానున్న గజరాజులు

చిల్లర ఇవ్వాల్సి వస్తే చాక్లెట్లు, బిస్కెట్లు బలవం తంగా అంటగడుతున్నారు. దేశీయ కరెన్సీలో గడిచిన దశాబ్ద కాలంలో పెను మార్పులు చోటుచేసు క ఎన్నాయి.

రూపాయి నోటు మొదలుకుని 2 వేల రూపాయల నోటు వరకూ భారత కరెన్సీ నోట్లు విభిన్న రంగులు, డిజైన్లలో చెలామణీలో ఉన్నాయి.

నాణేలు మొదలు కుని నోట్ల వరకు డిజన్లలో తరచూ జరుగుతున్న మార్పులు ప్రజల్లో పలు సందే హాలకు దారి తీస్తున్నాయి.

ప్రజల్లో నెల కొన్న అను మానాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసేందుకు బ్యాంకర్లు, ఆర్బీఐ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో.. ఆర్బీఐ తాజాగా ఓ హెచ్చరికను జారీ చేసింది.

నిరాకరిస్తున్న వ్యాపారులు

ప్రధాని మోడీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థను ఊగిస లాడించిందనే చెప్పు కోవచ్చు. వెయ్యి రూపాయల నోట్లు రద్దు చేసి కొత్తగా 2వేల నోటును ప్రవేశ పెట్టడం తెలిసిందే.

ఆ తర్వాత పాతవి రూ.500 నోట్లు సైతం రద్దు చేసి వాటి స్థానంలో కొత్త డిజైన్ తీసుకువచ్చారు. నాణేల విషయంలోనూ రూ.10, 20 నాణేలు ప్రవేశపెట్టారు.

కాగా, కొన్ని ప్రాంతాల్లో వాటిని తీసుకునేందుకు వ్యాపారులు నిరాకరి స్తున్నారు. హైదరా బాద్ సిటీ బస్సుల్లో కండక్టర్లు తప్ప ఎవ్వరూ వాటిని అనుమతించడం లేదు.

కాగా, వాటిని మార్పిడి చేసుకుంటున్న ప్రయాణి కులు తిరిగి తీసుకోవడంలో వెనుకాడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది.

Also Read..YABER PRO V9 WiFi 6 Bluetooth Projector

ఈ ప్రకటన కొంత మందికి హెచ్చరిక లాంటిదే అవుతుంది. ప్రభుత్వం ఆమోదించిన నాణేల ను తిరస్కరించడం నేరం అవుతుందని స్పష్టం చేసింది.

తిరస్కరిం చడమే కాకుండా అవి చెల్లవంటూ సోషల్ మీడియా లో ప్రచారం చేసినా శిక్ష ఖాయమని చెప్తోంది. 10, 20 రూపాయల నాణేలు చెలా మణీలో ఉన్నాయని, వాటిని తిరస్కరిస్తే ఫిర్యాదు చేయాలని సూచిస్తోంది. ఎవరైనా నిరాకరిస్తే ఐపీసీ సెక్షన్ 124 ప్రకారం ఫిర్యాదు చేయాలని, విచారణలో ఆ విషయం రుజువైతే మూడు సంవత్స రాల వరకు జైలు శిక్ష ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top